Kavitha Land Allegations: తాను ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న భూముల కన్నా గజం భూమి ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికే సరెండర్ చేస్తానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. అసెంబ్లీలో 22ఏపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబానికి ఎక్కడో భూములు ఉన్నట్టుగా ప్రస్తావించిన అంశంపై బుధవారం ‘ఎక్స్’ వేదికగా కవిత స్పందించారు. అసెంబ్లీలో సీఎం ఎవరెవరి పేర్లు ప్రస్తావించి వారికి ఎక్కువ భూములు ఉన్నట్టుగా చెప్పారో వారందరిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సీఎం అసెంబ్లీలో ఎవరెవరికి అక్రమ భూములు ఉన్నట్టు చెప్పారో వారందరిపై సరైన విచారణ జరిపిస్తారన్న నమ్మకం తనకు లేదన్నారు.
అసెంబ్లీలో సీఎం చదివిన భూముల చిట్టాలో నిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐ విచారణ జరిపించాలని కవిత డిమాండ్ చేశారు. సీఎం అసెంబ్లీలో ప్రస్తావించిన గుంట నక్క, కేసీఆర్ ఫాం హౌస్ లో ఉండే నవీన్ రావు, కొండల్ రావు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, రామేశ్వర్ రావు, ప్రతిమ శ్రీనివాస్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి సహా అందరి భూములపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలి అని డిమాండ్ చేశారు.
ఎన్నికల అఫిడవిట్ లో నేను ప్రస్తావించిన నా ఆస్తులకన్నా గజం భూమి ఎక్కువగా ఉన్నా ఆ భూమిని ప్రభుత్వానికే సరెండర్ చేస్తాను
అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి నా కుటుంబానికి ఎక్కడో భూములు ఉన్నట్టు అబద్ధాలు చెప్పారు
అసలు ఈ ముఖ్యమంత్రి పైనే మాకు నమ్మకం లేదు.. అసెంబ్లీలో ఈరోజు సీఎం… pic.twitter.com/0dimCUmKNT
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 16, 2026
Also Read: కాంగ్రెస్ నేతల దారుణ హత్య కేసు.. ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు.. 10 మందికి మరణశిక్ష
తాను ఎప్పటి నుంచో చెప్తున్నట్టుగా గుంపు మేస్త్రీ – గుంటనక్క కలిసే ఉన్నారని కవిత స్పష్టం చేశారు. వారిద్దరూ కలిసే ఈ డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిబంధనలు అతిక్రమించి తనకు గజం భూమి ఎక్కువగా ఉన్నా.. ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న భూమి కన్నా గజం అదనంగా ఉన్నట్టు తేలినా ఆ భూములు ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని మరోసారి స్పష్టం చేస్తున్నానని కవిత కుండబద్దలు కొట్టారు.
Also Read: కేసీఆర్ భూముల లిస్ట్ బయటపెట్టిన రేవంత్.. ఆ 388 ఎకరాలు దళితులకు పంచేస్తానంటూ..