E-Paper
Advertisement

కేసీఆర్ భూముల లిస్ట్ బయటపెట్టిన రేవంత్.. ఆ 388 ఎకరాలు దళితులకు పంచేస్తానంటూ..

కేసీఆర్ భూముల లిస్ట్ బయటపెట్టిన రేవంత్.. ఆ 388 ఎకరాలు దళితులకు పంచేస్తానంటూ..
Advertisement

Revanth Land: బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో చేసిన భూ అక్రమాలను అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బైటపెట్టారు. ఆనాడు తెలంగాణ కోసం పోరాటం చేసిన వారు భూములు సర్వం కోల్పోయారు.. కాని ఉద్యమకారుడని చెప్పుకునే కేసీఆర్ వేల కోట్ల రూపాయలు వందల ఎకరాలు సంపాదించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్, సతీమణి మీద పేరిట సిద్దిపేట జిల్లాలో మార్క్ 65 ఎకరాలు ఉంది. కేటీఆర్ మీద 49 ఎకరాలు, షాలిమా 17.30 ఎకరాలు, అలీఖ్య 9.38 ఎకరాలు, 46.3 ఎకరాలు హిమాన్ష్ పేరుమీద ఉన్నాయని సీఎం రేవంత్ అసెంబ్లీలో బైటపెట్టారు.

కవిత పేరుపై..

హరీష్ రావు కుటుంబ సభ్యుల మీద, కవిత పేరుపై 14 ఎకరాలు ఉన్నాయని, అనిల్ 23 ఎకరాలు 37 ఎకరాలు ఉందని, జోగినపల్లి రవీందర్ రావు పేరుమీద 53 ఎకరాలు ఎర్రవల్లి దగ్గరలో ఉందని సీఎం రేవంత్ తెలిపారు. జోగిన పల్లి సంతోష్ కుమార్ 18 ఎకరాలు, వారి భార్య పేరుమీద రోహిణి 7 ఎకరాలు ఉందని మోత్తం వారి కుటుభంపై 79ఎకరాలు ఉన్నాయని సీఎం తెలిపారు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రావు మీద 97ఎకరాలు, కేసీఆర్ మరియు వారు కుటుంబ సభ్యుల మీద మోత్తం 439 ఎకరాలు ఉన్నాయని సీఎం తెలిపారు.

కేసీఆర్ ఫాం హౌజ్..

Advertisement

కేసీఆర్ ఫాం హౌజ్ దగ్గర 325 సర్వే నెంబర్‌లో 388 ఎకరాలకు రికార్డులు లేవని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ అధీనంలో 700 ఎకరాల భూమి ఫాం హౌజ్ అధీనంలో ఉందా లేదా.. కేసీఆర్‌కు ఉన్న భూమి ఎంత కేసీఆర్‌కి నోటీస్‌లు ఆ వివరాలు అన్ని బయట పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ భూములపై 30 రోజుల్లో విచారణ పూర్తి చెయ్యాలని విచారణ పూర్తి చేయని అధికారుల పై ప్రభుత్వం చర్యలు తీసుకంటుందని సీఎం తెలిపారు.

Also read: చర్లపల్లిలో భారీ దొంగతనం.. 10 తులాల బంగారం, 12 తులాల వెండి అపహరణ!

హరీష్ రావు మామపై భూములు..

Advertisement

సత్యం రామలింగ రాజు భూములు కేటీఆర్ కుటుంబ సభ్యుల పేరు మీదికి మారాయని, జన్వాడలో కేటీఆర్ ఉంటున్న ఫాం హౌజ్ సత్యం రామలింగరాజు ఆస్తి అని అన్నారు. రంగనాయక సాగర్ దగ్గర భూ సేకరణ చేశారు. ఆ భూమి హరీష్ రావు తీసుకున్నారు. రంగనాయక సాగర్ దగ్గర 14 ఎకరాల భూమి హరీష్ రావుకి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతుల దగ్గర అగ్గువ సగ్గువకు తీసుకున్నారని తెలిపారు. 5 కోట్లతో ఆయన భూమి కోసం రోడ్డు వేయించుకున్నారని, హరీష్ రావు అధికార దుర్వినియోగం చేసారనడానికి ఇదే నిదర్షనం అని సీఎం రేవంత్ అన్నారు. ధరణితో హరీష్ రావు మామ హనుమంత్ రావు, మహేష్ రావుపై 120 ఎకరాలు మార్చుకున్నారని తెలిపారు.

మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై భూములు..

జగదీష్ రెడ్డి ఇనాం భూములను తన పేరు మీద మార్చుకున్నారని సీఎం తెలిపారు. అసైన్డ్ భూములను ఫాం హౌజ్ కట్టుకున్నారని రోహిన్ రెడ్డి బుల్లెట్ ట్రైన్ కోసం ఇచ్చిన భూమిని ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి, దయాకర్ రావు, గంగుల కమలాకర్ ప్రభుత్వ భూమిని కొల్లగొట్టారని సీఎం తెలిపారు. భూదాన్ భూములు 74 ఎకరాలు అయ్యాయని కిషన్ రెడ్డి పోరాటం చేశారు. ఇప్పుడు అది అన్యాక్రాంతం అయ్యిందని తెలిపారు సునితమ్మ, సబితమ్మ మీద నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. దళితుడు clp గా ఉంటే పార్టీకి అన్యాయం చేసి మీరు ఆ పార్టీలో జాయిన్ అయ్యి మంత్రి అయ్యారని, దొర దగ్గర బానిస ఉండాలంటే ఉండండిని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కిషన్ రెడ్డి గ్రామంలో ఉన్న భూములు ఎవరు కబ్జా చేశారు. వాటి మీద విచారణ చేయాలని సబితమ్మ కోరాలని డిమాండ్ చేశారు.

నమస్తే తెలంగాణ ఆస్తులు..

గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఎవరికి కారు గిఫ్ట్ ఇచ్చారో అందులో ఎవరు తిరుగుతున్నారో మాకు తెలుసని సీఎం తెలిపారు. నమస్తే తెలంగాణ పేరు మీద ఉన్న ఆస్తులు త్వరలో బయట పెడతానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వినోద్ రావు తమ్ముడు వట్టి నాగుల పల్లెలో, పళ్ళ రాజేశ్వర్ రెడ్డి భూదాన్ భూములు పేర్లు మార్చుకున్నారని సీఎం తెలిపారు.

Also Read: 22A నిషేధిత భూములపై సీఎం క్లారిటీ.. అసెంబ్లీలో బిఆర్‌ఎస్ నేతలపై రేవంత్ ధ్వజం!

ktr బంధువులకు భూములు..

సిరిసిల్లలో 8,000 ఎకరాల భూముల ktr బంధువులకు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సందీప్ కుమార్ ఝా 2400 ఎకరాలు ప్రభుత్వం భూములు తీసుకున్నారని అన్నారు. మై హోంకు 2400 ఎకరాల భూమి ఒక్కటే దగ్గర ఉంది. అక్కడ అసైన్డ్ భూములు కబ్జాలు చేశారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో లక్ష కోట్ల విలువ గల భూమిని కొల్లగొట్టారని సీఎం రేవంత్ తెలిపారు.

త్వరలో సిట్ విచారన..

తెలంగాణలో ఉన్న భూములపై విచారణ చేయిస్తామని త్వరలో వీరి వద్ద ఉన్న భూములపై సిట్ వేసి విచారణ చేసిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ధరణి పై sit వేశామని, Tgiic భూమిలో జరిగిన దోపిడి నీ బడ్జెట్ సెషన్‌లో బయట పెడతానని రేవంత్ రెడ్డి తెలిపారు. నా కండ్లలో చూడడానికి వారు భయపడతారు. వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళతో ముక్కు నేల రాయిస్తానని బీహార్ నుండి ఇక్కడికి వచ్చి దోచుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Also read: నోటి దూలతో కొంపముంచుకున్నారా.. ఆ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిపై కేసీఆర్ వేటు..?

Tags

Related News

చర్లపల్లిలో భారీ దొంగతనం.. 10 తులాల బంగారం, 12 తులాల వెండి అపహరణ!

22A నిషేధిత భూములపై సీఎం క్లారిటీ.. అసెంబ్లీలో బిఆర్‌ఎస్ నేతలపై రేవంత్ ధ్వజం!

దిల్‌సుఖ్‌నగర్ బహార్ బిర్యానీ కేఫ్‌పై ఫుడ్ సేఫ్టీ దాడులు.. 50 కేజీల కుళ్లిన చికెన్, మటన్ స్వాధీనం!

ఖమ్మం జిల్లాలో ఘోరం.. మైనర్ల వేధింపులు తట్టుకోలేక యువతి సూసైడ్!

మహిళలకు గుడ్‌న్యూస్.. ఇందిరమ్మ కుట్టు మిషన్ దరఖాస్తు గడువు పొడిగింపు!

ట్రేడ్ లైసెన్స్ పేరుతో దోపిడీ.. పట్టుకుని పోలీసులకు అప్పగించిన యువకులు!

వీడెవడండి బాబు.. ఏకంగా పెళ్ళాం ముక్కు కొరికేశాడు, మంచిర్యాలలో దారుణం

Big Stories

Advertisement
×