Korutla Crime: ఏ చేతులతో ఆమె చేయి పట్టుకుని ఏడడుగులు నడిచాడో.. అదే చేతులతో ఆమె పీక పిసికి ప్రాణాలు తీశాడు ఈ కసాయి భర్త. ఆవేశమో, ఆక్రోశమో.. చేయకూడని పాపం చేశాడు ఈ కిరాతకుడు. గొడవలు జరగని సంసారాలు ఉంటాయా. కోప్పడని భార్యలుంటారా.. సైలెంట్‌గా ఉంటే గంటలోనే అన్ని సర్దుకుంటాయి. రండి భోజనం చేయండి అని ఆ ఇల్లాలే ప్రేమగా పిలుస్తుంది. అంతమాత్రానా ఇలా కర్కశంగా ప్రాణాలు తీస్తారా?
పచ్చని సంసారంలో మనస్పర్థలు..
ఇదిగో ఈ ఫోటోలో ఉన్న దంపతుల పేర్లు సదుమట్ల నరేష్, లక్ష్మి. వీళ్లు జగిత్యాల జిల్లా కోరుట్లలో ఉంటున్నారు. నరేష్ కథలాపూర్ సబ్‌స్టేషన్‌లో వాచ్‌మెన్‌గా డ్యూటీ చేస్తున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బయటికి చూస్తే అంతా ప్రశాంతంగానే అనిపించినా.. ఆ నాలుగు గోడల మధ్య నరకం గెస్ట్ హౌస్ ఉండేది. పచ్చని సంసారంలో మనస్పర్ధల కార్చిచ్చు రగులుతూనే ఉండేది. చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య రోజూ గొడవలు జరగడం.. సర్దుమణగడం ఎవరి పనులకు వాళ్లు వెళ్లడం జరిగేది.
చున్నీతో భార్యను ఉరివేసి..
ఎప్పటిలాగే ఇవాళ మార్నింగ్ కూడా లక్ష్మి, నరేష్ మధ్య మళ్లీ మాటమాటా పెరిగింది. ఆ గొడవ పీక్స్‌కి చేరింది. నరేష్ నరరూపరాక్షశుడిగా మారిపోయాడు. ఏ మెడలో అయితే తలవంచి తాళి కట్టాడో అదే మెడకు ఉన్న చున్నీని గట్టిగా చుట్టేశాడు. ఊపిరి ఆడనివ్వలేదు. ఆ తల్లి ఎంత తల్లఢిల్లిపోయినా ఆ రాక్షసుడికి కనికరం కలగలేదు. భార్య చనిపోయేవరకు ఆ చున్నీని వదిలిపెట్టలేదు ఈ కంత్రీగాడు.
పోలీసులు రాగానే షాకింగ్ సీన్!
అప్పటి వరకు ఇంట్లో గొడవలు వినిపించి ఒక్కసారిగా సైలెంట్ అవ్వడంతో స్థానికులకు ఏదో అనుమానం వచ్చింది. వెంటనే కోరుట్ల పోలీసులకు ఫోన్ కొట్టారు. సీన్‌లోకి ఎంటరైన పోలీసులు ఇంటికి వచ్చి షాక్ అయ్యారు. లక్ష్మి విగతజీవిగా పడి ఉంది. పక్కనే పిల్లలు అమ్మ లే అమ్మా అంటూ ఏడుస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.
పిల్లలను ఆనాథలుగా చేసిన తండ్రి..
భార్య గొడవ చేస్తుందని ఆవేశంతో చంపేశాడు. కానీ కన్నపిల్లల కన్నీళ్లకు సమాధానం ఏమని చెబుతాడు? పిల్లలను అనాథలుగా చేసి ఏం సాధించాడు. ఒక్క క్షణికావేశంలో అతడు చేసిన ఆ రాక్షసత్యం.. ఆ పసిహృదయాలలో ఆరని శోకసముద్రాన్ని నింపేసింది.
Also Read: దానం నాగేందర్ సీటుకు ఎసరు? హైకోర్టు తీర్పుపై తెలంగాణ రాజకీయాల్లో సంచలనం!