E-Paper
Advertisement

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణలో భూ సమరానికి సిద్ధమైన సీపీఎం..!

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణలో భూ సమరానికి సిద్ధమైన సీపీఎం..!
Advertisement

CPM Telangana: భూ సమస్యలన్నింటిపై పూర్తిస్థాయి విచారణ జరిపి, అర్హులైన పేదలందరికీ ఆ భూములను పంపిణీ చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. భూ సమస్యలపై చర్చించి, తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడం సంతోషకరమనిఅన్నారు. బుధవారం మీడియా ప్రకటన విడుదల చేశారు.

కేసీఆర్ ఫామ్‌హౌస్..

22ఏ కింద ఎన్ని రకాల భూ సమస్యలు ఉన్నాయని, ఎన్ని ఎకరాల భూమి ఉంది అనేది పరిశీలించి, వాటి పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారన్నారు. 12 అంశాల ఆధారంగా విచారణ జరిపి, వచ్చిన సమస్యలను ఏ,బీ, సీ, డీ, ఈలుగా వర్గీకరించి 30 రోజుల్లో పరిష్కార విధానాలను ప్రకటిస్తామని సీఎం అన్నారన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఫామ్‌హౌస్ ద్వారా 700 ఎకరాల భూమిలో 300 ఎకరాలకు పైగా అసైన్డ్ భూమి ఉందని, మై హోమ్, ఇతర సంస్థలు కూడా అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నాయని, కేసీఆర్ కుటుంబం, ఇతర ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు భూములను ఆక్రమించారనే విషయాలను వెల్లడించారన్నారు.

Advertisement

Also read: ఖైరతాబాద్ పేరు మార్చాలంటూ.. సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ విజ్ఞప్తి!

గత ప్రభుత్వ హయాంలో..

ఈ మొత్తం భూ వ్యవహారం చూస్తే ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, భూదాన్ భూములు, ఫారెస్ట్ భూములు, వక్ఫ్ బోర్డ్ భూములు, పేదలు సాగు చేసుకుంటున్న భూములన్నింటినీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచుకున్నారని స్పష్టమవుతోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో లక్షల కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయని వెల్లడైన మాట వాస్తవం అన్నారు. కేవలం కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వరకే పరిమితం కాకూడదని, కేసీఆర్ లేదా ఒక కుటుంబానికే పరిమితమైతే అది రాజకీయ కక్ష సాధింపుగానే మిగిలిపోతుందన్నారు.బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, కార్పొరేట్ సంస్థలు లేదా ఏ పేరుతో ఉన్న సంస్థలైనా సరే అక్రమంగా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే వాటన్నింటిపైనా పక్షపాతం లేకుండా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ చుట్టూ..

Advertisement

విచారణ వివరాలను బహిర్గతం చేసి, శాసనసభలో చర్చించి, ఆక్రమణకు గురైన భూములన్నింటినీ స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలన్నారు. చట్టానికి మించి భూములు కలిగి ఉన్నవారి వివరాలు పరిష్కరిస్తే భూమి లేని పేదలందరికీ భూమి దక్కే అవకాశం ఉంటుందన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న అన్యాక్రాంతమైన భూములను ప్రభుత్వం తిరిగి తీసుకుంటే అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి వీలవుతుందన్నారు. ప్రభుత్వం ఈ దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also read: అలియాబాద్ ప్రజలకు భారీ శుభవార్త.. రూ.1.38 కోట్లు మంజూరు!

Tags

Related News

2028లో ఒంటరి పోరే.. బీజేపీతో పొత్తు లేదు.. హర్యానా వర్సిటీలో కేటీఆర్ క్లారిటీ

జగిత్యాల జిల్లాలో దారుణం.. భార్యను చున్నీతో ఉరివేసి చంపిన భర్త!

‘అప్పుడు నీ బుద్ధి ఏమైంది?’.. హరీశ్‌రావుపై మంత్రి పొంగులేటి నిప్పులు!

దానం నాగేందర్ సీటుకు ఎసరు? హైకోర్టు తీర్పుపై తెలంగాణ రాజకీయాల్లో సంచలనం!

అలియాబాద్ ప్రజలకు భారీ శుభవార్త.. రూ.1.38 కోట్లు మంజూరు!

ఖైరతాబాద్‌కు ఆ పేరు పెట్టండి.. సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ విజ్ఞప్తి

గజం ఎక్కువ ఉన్నా.. ప్రభుత్వానికే భూమి ఇస్తా.. కవిత ఓపెన్ ఛాలెంజ్!

Big Stories

Advertisement
×