E-Paper
Advertisement

అలియాబాద్ ప్రజలకు భారీ శుభవార్త.. రూ.1.38 కోట్లు మంజూరు!

అలియాబాద్ ప్రజలకు భారీ శుభవార్త.. రూ.1.38 కోట్లు మంజూరు!
Advertisement

Aliyabad: స్వేచ్చ బ్యూరో: పట్టణ అభివృద్ధికి అలియాబాద్‌ పురపాలక సంఘం కౌన్సిల్‌ ప్రాధాన్యమిచ్చింది. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రహదారులు, వీధిదీపాలు, పార్కుల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో ఛైర్‌పర్సన్‌ కంఠం శిరీష కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సాధారణ కౌన్సిల్‌ సమావేశంలో రూ.1.38 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది.

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి

పట్టణ పారిశుద్ధ్య నిర్వహణను మరింత పటిష్టం చేయడంపై కౌన్సిల్‌ చర్చించింది. భూగర్భ మురుగునీటి కాలువలు, డ్రైనేజీ వ్యవస్థల నిర్వహణతో పాటు అంతర్గత రహదారుల మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించింది. వీధిదీపాల నిర్వహణ, పార్కులు, హరిత ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన పనులపైనా నిర్ణయాలు తీసుకున్నారు.

వార్డుల సమస్యలకు ప్రాధాన్యం

Advertisement

కౌన్సిల్‌ సమావేశంలో ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను కౌన్సిలర్లు ప్రస్తావించారు. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడంతో పాటు అవసరమైన మౌలిక వసతులను ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి చేయాలని కోరారు. ఆయా అంశాలపై చర్చించిన కౌన్సిల్‌ పలు నిర్ణయాలు తీసుకుంది.

వేగంగా పనులు పూర్తి చేయాలి

ఛైర్‌పర్సన్‌ కంఠం శిరీష కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. పురపాలక సంఘ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

Advertisement

Also read: కవితను చూస్తే పాపం అనిపిస్తోంది.. ఎంపీ అరవింద్ షాకింగ్ కామెంట్స్

మెరుగైన పౌర సేవలే లక్ష్యం

వైస్‌ ఛైర్‌పర్సన్‌ మాలతి మాధవరెడ్డి మాట్లాడుతూ పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన పౌర సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. ప్రజలకు అవసరమైన పనులను గుర్తించి దశలవారీగా చేపడతామని పేర్కొన్నారు.

నాణ్యతతో.. నిర్ణీత గడువులో..

కమిషనర్‌ ఎన్‌.వెంకటరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తారని తెలిపారు.

రూ.1.38 కోట్లకు ఆమోదముద్ర

పారిశుద్ధ్యం, డ్రైనేజీ, అంతర్గత రహదారుల మరమ్మతులు, వీధిదీపాలు, పార్కులు, హరిత ప్రాంతాల అభివృద్ధి తదితర వివిధ పనులకు కలిపి మొత్తం రూ.1.38 కోట్ల నిధుల వ్యయానికి కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. దీంతో అలియాబాద్‌ పురపాలక సంఘ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధి పనులు వేగం పుంజుకోనున్నాయి.

Also read: ఖైరతాబాద్ పేరు మార్చాలంటూ.. సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ విజ్ఞప్తి!

Tags

Related News

2028లో ఒంటరి పోరే.. బీజేపీతో పొత్తు లేదు.. హర్యానా వర్సిటీలో కేటీఆర్ క్లారిటీ

జగిత్యాల జిల్లాలో దారుణం.. భార్యను చున్నీతో ఉరివేసి చంపిన భర్త!

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణలో భూ సమరానికి సిద్ధమైన సీపీఎం..!

‘అప్పుడు నీ బుద్ధి ఏమైంది?’.. హరీశ్‌రావుపై మంత్రి పొంగులేటి నిప్పులు!

దానం నాగేందర్ సీటుకు ఎసరు? హైకోర్టు తీర్పుపై తెలంగాణ రాజకీయాల్లో సంచలనం!

ఖైరతాబాద్‌కు ఆ పేరు పెట్టండి.. సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ విజ్ఞప్తి

గజం ఎక్కువ ఉన్నా.. ప్రభుత్వానికే భూమి ఇస్తా.. కవిత ఓపెన్ ఛాలెంజ్!

Big Stories

Advertisement
×