E-Paper
Advertisement

కవితను చూస్తే పాపం అనిపిస్తోంది.. ఎంపీ అరవింద్ షాకింగ్ కామెంట్స్

కవితను చూస్తే పాపం అనిపిస్తోంది.. ఎంపీ అరవింద్ షాకింగ్ కామెంట్స్
Advertisement

Dharmapuri Arvind: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇద్దరి నాయకత్వ శైలిని ఎద్దేవా చేశారు.

కవితపై తీవ్ర వ్యాఖ్యలు

Advertisement

కవిత పరిస్థితి చూస్తుంటే జాలేస్తోందని అరవింద్ వ్యాఖ్యానించారు. తన పేరులోనే ధర్మం ఉందని కవిత చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఎన్నికల్లో కవితను ప్రజలు ఓడించడం అధర్మమా?’ అని ప్రశ్నించారు. ప్రజలే కాదు, ఆమె సొంత కుటుంబ సభ్యులే ఆమెను పక్కన పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో చేరతామంటే అక్కడా వద్దన్నారని, ఆఖరికి సొంతంగా వేరే పార్టీ పెట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు.

పీసీసీ చీఫ్‌కు పాలనపై అవగాహన లేదు

Advertisement

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు పరిపాలన, ప్రజా సమస్యలపై కనీస అవగాహన లేదని అరవింద్ మండిపడ్డారు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు కావడం నిజామాబాద్ జిల్లా బీజేపీకి నిజంగా ఒక బ్లెస్సింగ్ అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

నిజామాబాద్‌ నుంచే పోటీ చేయాలి

వచ్చే ఎన్నికల్లో మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ నుంచే పోటీ చేయాలని తాము కోరుకుంటున్నామని అరవింద్ సవాల్ విసిరారు. పొలిటికల్ నాలెడ్జ్ లేని నేతలు కాంగ్రెస్, బీఆర్ఎస్ స్థానాల్లో ఉండటం బీజేపీ విజయానికి మరింత సులభం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: సూడాన్‌లో విషాదం.. కూలిన బంగారు గని.. 67 మంది దుర్మరణం!

Tags

Related News

ఖైరతాబాద్ పేరు మార్చాలంటూ.. సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ విజ్ఞప్తి!

గజం ఎక్కువ ఉన్నా.. ప్రభుత్వానికే భూమి ఇస్తా.. కవిత ఓపెన్ ఛాలెంజ్!

కేసీఆర్ భూముల లిస్ట్ బయటపెట్టిన రేవంత్.. ఆ 388 ఎకరాలు దళితులకు పంచేస్తానంటూ..

చర్లపల్లిలో భారీ దొంగతనం.. 10 తులాల బంగారం, 12 తులాల వెండి అపహరణ!

22A నిషేధిత భూములపై సీఎం క్లారిటీ.. అసెంబ్లీలో బిఆర్‌ఎస్ నేతలపై రేవంత్ ధ్వజం!

దిల్‌సుఖ్‌నగర్ బహార్ బిర్యానీ కేఫ్‌పై ఫుడ్ సేఫ్టీ దాడులు.. 50 కేజీల కుళ్లిన చికెన్, మటన్ స్వాధీనం!

ఖమ్మం జిల్లాలో ఘోరం.. మైనర్ల వేధింపులు తట్టుకోలేక యువతి సూసైడ్!

Big Stories

Advertisement
×