E-Paper
Advertisement

ఖమ్మం బాలిక ఘటనపై కవిత ఫైర్.. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్

ఖమ్మం బాలిక ఘటనపై కవిత ఫైర్.. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్
Advertisement

Kalvakuntla Kavitha: ఖమ్మం మైనర్ బాలిక అత్యాచారయత్నం ఘటనలో నిందితుడిని ఉరి తీయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. 12 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నంతో పాటు ఆమెను బిల్డింగ్ పై నుంచి తోసేయటంతో జీవితాంతం నడవలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితురాలిని శనివారం పరామర్శించిన కవిత.. బాలిక ఆరోగ్య పరిస్థితి.. ఆమెకు అందిస్తున్న వైద్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి తల్లిదండ్రులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు.

‘నిందితుడ్ని ఉరి తీయాలి’

అనంతరం మాట్లాడుతూ.. అత్యంత అమానుషమైన దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని ఉరి తీయాలని కవిత డిమాండ్ చేశారు. నిందితునిపై కఠినమైన చట్టాలు ప్రయోగించి వీలైనంత తొందరగా శిక్షపడేలా మంచి లాయర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. శిక్ష ఎంత లేటు అయితే నిందితుల్లో అంత భయం లేని పరిస్థితి వస్తుందన్నారు. ఈ సంఘటనలో ప్రభుత్వ పెద్దలే కేసు వాపసు తీసుకోవాలంటూ బాధితురాలి కుటుంబంపై ఒత్తిడి తెస్తున్నారని.. ఇది చాలా అమానుషమని కవిత అన్నారు. ఈ కేసు విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా బాధితురాలికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

‘ప్రతీ నెల రూ.50 వేలు ఇవ్వాలి’

Advertisement

అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకున్న 12 ఏళ్ల బాలిక ఒక్కసారి బిల్డింగ్ మీద నుంచి పడి జీవితాంతం నడవలేని పరిస్థితికి చేరటం ఆ తల్లితండ్రులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోందని కవిత అన్నారు. బాధితురాలి తల్లి నిందితున్ని ఉరి తీయాలని డిమాండ్ చేస్తోందని చెప్పారు. అదే విధంగా బాధితురాలు జీవితాంతం మంచానికే పరిమితమయ్యే పరిస్థితి వచ్చిందని.. ఆమెను పసిబిడ్డలా చూసుకోవాల్సి ఉంటుందని అన్నారు. తల్లితండ్రులు ఇద్దరు కూడా కూలీలేనని వారికి అంత ఆర్థిక స్థోమత లేదని కవిత చెప్పారు. ప్రభుత్వమే ఆ కుటుంబానికి అండగా ఉండాలన్నారు. వారికి ఇళ్లు కేటాయించటంతో పాటు ప్రతి నెల రూ. 50 వేలు పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించాలని సూచించారు.

Also Read: కాంగ్రెస్ ఫస్ట్ పార్ట్ అట్టర్ ప్లాప్.. సెకండ్ పార్ట్‌పై నమ్మకమే లేదు.. కేటీఆర్ తీవ్ర విమర్శలు

సీఎంపై తీవ్ర ఆగ్రహం

Advertisement

రాష్ట్రంలో మహిళలకు, ఆడపిల్లలకు భద్రత లేని పరిస్థితి వచ్చిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్లపై రోజుకు 5 అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పారు. అయిన సరే ఈ ప్రభుత్వం లో చలనం లేదన్నారు. హోమంత్రిగానూ ఉన్న ముఖ్యమంత్రి ఇకనైనా స్పందించాలని డిమాండ్ చేశారు. రివ్యూ చేపట్టి మహిళలు, ఆడపిల్లల భద్రతపై భరోసా ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.

Also Read: గోల్డ్ షాప్‌లోకి చొరబడి.. పెప్పర్ స్ప్రే కొట్టి.. యువతులు వీరంగం!

Related News

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్ పీఏ, పీఆర్వో ఉన్న రూమ్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు!

శుద్ధీకరణ పేరిట దళితులపై అవమానం.. ఏడుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు..!

కేటీఆర్ పీఏ, పీఆర్ఓ విచారణలో బిగ్ ట్విస్ట్.. సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు!

ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన!

గణేష్ నిమజ్జనం చేసి మా పొట్టకొట్టొద్దు.. ఖమ్మంలో మత్స్యకారుల ఆందోళన కలకలం!

1,000 రోజుల కాంగ్రెస్ పాలన థీమ్‌తో ప్రత్యేక వినాయక విగ్రహం.. ఎక్కడో తెలుసా..?

సీఎం రేవంత్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కుటుంబ సభ్యులు

Big Stories

Advertisement
×