Kanchana 4 Buzz: టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో హారర్ కామెడీ జానర్‌కు ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఫ్రాంచైజీ ‘కాంచన’. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో, ఆయనే ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సిరీస్ సినిమాలకు భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా విపరీతమైన అభిమానులున్నారు. ఇప్పటివరకు వచ్చిన మూడు భాగాలు థియేటర్లలో కాసుల వర్షం కురిపించడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించాయి.
టీవీల్లో వస్తే ఇప్పటికీ రిమోట్లు పక్కన పెట్టి చూసేలా ఆడియన్స్‌ను కట్టిపడేసిన ఈ క్రేజీ హారర్ యూనివర్స్ నుంచి ఇప్పుడు నాలుగో భాగం రాబోతుంది. ‘కాంచన 4’ (Kanchana 4) ను మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ బడ్జెట్‌తో, ఊహించని తారాగణంతో పట్టాలెక్కించేందుకు లారెన్స్ పక్కా స్కెచ్ వేశారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక లీక్డ్ సమాచారం ఇప్పుడు ఫిలిమ్ సర్కిల్స్ లో సంచలనం సృష్టిస్తోంది.
సాధారణంగానే రాఘవ లారెన్స్ ‘ముని’, ‘కాంచన’ సిరీస్ సినిమాల్లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లు అత్యంత ఎమోషనల్‌గా, వెన్నులో వణుకు పుట్టించేలా భయంకరంగా సాగుతుంటాయి. సినిమా విజయాల్లో ఈ ఎపిసోడ్లే కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, ఈసారి ‘కాంచన 4’ లో ఆ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను అంతకుమించి ప్లాన్ చేశారట లారెన్స్. ఈ ప్రాజెక్ట్‌లోని అత్యంత పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే.. లేడీ సూపర్‌స్టార్ నయనతార ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ మరియు అత్యంత కీలకమైన కీ రోల్‌ను పోషించబోతున్నారట.
Also read :హీరోయిన్ మీనాక్షి చౌదరికి షాక్.. రంగంలోకి దిగిన సైబర్ కేటుగాళ్లు!
కథను పూర్తిగా మలుపు తిప్పే ఒక బలమైన బ్యాక్ స్టోరీలో నయనతార కనిపిస్తుందని, ఆమె క్యారెక్టర్ డిజైనింగ్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని టాక్. ఈ హారర్ ఫ్రాంచైజీలోకి నయన్ లాంటి సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ ఎంట్రీ ఇస్తుండటంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.
ఈ సినిమాలో కేవలం నయనతార మాత్రమే కాకుండా, మెయిన్ ఫీమేల్ లీడ్స్‌గా ఇద్దరు గ్లామరస్ బ్యూటీలు సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ హారర్ వరల్డ్‌లో మెయిన్ హీరోయిన్‌గా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే కనిపించబోతోందని సమాచారం. కేవలం గ్లామర్ హంగులకే పరిమితం కాకుండా, కథలో ప్రాధాన్యత ఉన్న మరియు లారెన్స్‌తో కలిసి దెయ్యాల కామెడీ పండించే రోల్‌ను పూజా దక్కించుకున్నట్లు వినిపిస్తుంది. ఆమెతో పాటు బాలీవుడ్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ నర్గిస్ ఫక్రీ సైతం ఈ సినిమాలో మరో కీలకమైన సెకండ్ లీడ్ పాత్రలో నటించబోతోందనే గట్టి టాక్ నడుస్తోంది. హిందీ బెల్ట్‌లో కూడా ఈ సినిమాకు భారీ క్రేజ్ తీసుకురావాలనే ప్లాన్‌తోనే నర్గిస్ ఫక్రీని రంగంలోకి దించారన్నది ట్రేడ్ పండితుల మాట.
నయనతార పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, పూజా హెగ్డే మరియు నర్గిస్ ఫక్రీల గ్లామర్ హంగులు తోడవ్వడంతో ‘కాంచన 4’ గ్లోబల్ వైడ్‌గా భారీ మార్కెట్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. లారెన్స్ మార్క్ హారర్ ఎలిమెంట్స్, కామెడీ టైమింగ్‌కు తోడు ఈ క్రేజీ కాస్టింగ్ తోడవడంతో, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మునుపటి రికార్డులను తిరగరాయడం ఖాయమని కాంచన ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
Also read :ఒక్క రోజులోనే అన్ని షూటింగ్‌లా? అమితాబ్ ఎనర్జీ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను సైలెంట్‌గా జరుపుకుంటున్న ఈ చిత్రం, త్వరలోనే ఒక భారీ ఈవెంట్ ద్వారా ఈ క్రేజీ కాస్టింగ్, షూటింగ్ షెడ్యూల్స్ మరియు టెక్నీషియన్స్ వివరాలపై మూవీ టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని సమాచారం . చూడాలి మరి లారెన్స్ మళ్లీ ఏ రేంజ్‌లో భయపెట్టి, నవ్విస్తాడో !