E-Paper
Advertisement

Merugu Madhu: సినిమా ప్రభావంతో యువత భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు: మెరుగు మధు

Merugu Madhu: సినిమా ప్రభావంతో యువత భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు: మెరుగు మధు
Advertisement

Merugu Madhu: స్వేచ్చ బ్యూరో: నల్గొండ జిల్లా కేంద్రానికి విచ్చేసిన కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు మెరుగు మధు బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. అనంతరం శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్, గౌరవ సలహాదారు పాముల అశోక్ ముదిరాజ్ మాట్లాడుతూ.. యువత సినిమాలను కేవలం వినోద సాధనంగా కాకుండా సమాజానికి మేలు చేసే అంశాలను గ్రహించే వేదికగా చూడాలని సూచించారు.

Also Read: HYDRAA: హైదరాబాద్‌కు కొత్తగా మెట్ ఎమర్జెన్సీ టీమ్స్.. రంగంలోకి 51 బృందాలు..!

ప్రతికూల పాత్రలు..

Advertisement

సినిమాల్లో ప్రదర్శించే సానుకూల సందేశాలు, క్రమశిక్షణ, దేశభక్తి, సామాజిక బాధ్యత వంటి విలువలను యువత ఆచరణలో పెట్టి సమాజ హితం కోసం కృషి చేయాలని కోరారు. అదే సమయంలో సినిమాల్లో కనిపించే ప్రతికూల పాత్రలు, హింసాత్మక ధోరణులు, చెడు అలవాట్లను అనుకరించడం వల్ల యువత భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. యువత మంచి విషయాలను స్వీకరించి వ్యక్తిత్వ వికాసంతో పాటు సమాజ అభివృద్ధికి తోడ్పడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం నాయకులు బోళ్ల నాగరాజు, నారగోని వెంకట్, వనం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Also read: 23 రోజుల కింద తల్లి అయింది..ఇప్పుడు సెంచ‌రీతో ఇర‌గ‌దీసిన లెస్బియ‌న్ క్రికెట‌ర్

Related News

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్ పీఏ, పీఆర్వో ఉన్న రూమ్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు!

శుద్ధీకరణ పేరిట దళితులపై అవమానం.. ఏడుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు..!

కేటీఆర్ పీఏ, పీఆర్ఓ విచారణలో బిగ్ ట్విస్ట్.. సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు!

ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన!

గణేష్ నిమజ్జనం చేసి మా పొట్టకొట్టొద్దు.. ఖమ్మంలో మత్స్యకారుల ఆందోళన కలకలం!

1,000 రోజుల కాంగ్రెస్ పాలన థీమ్‌తో ప్రత్యేక వినాయక విగ్రహం.. ఎక్కడో తెలుసా..?

సీఎం రేవంత్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కుటుంబ సభ్యులు

Big Stories

Advertisement
×