Kavitha: కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు వ్యవహారంపై స్పందించారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. సంజయ్ కుమారుడు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అత్యుత్సాహంతో బాధితురాలి ఫోటోలు బయటకు వచ్చాయని ఆరోపించారు. ఫోటోలు బయట పెట్టిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు.
బండి సంజయ్ కొడుకు ఇష్యూ.. కవిత ఘాటు వ్యాఖ్యలు
బండి సంజయ్ కుమారుడి మీద చాలా బలమైన ఆరోపణలు వచ్చాయని, అలాంటి సందర్భంలో ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న వేదికను ఆయన పంచుకోవటం శోచనీయమన్నారు. కుటుంబ సభ్యులపై ఆ స్థాయి ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన ఆ సమావేశానికి వెళ్లాల్సింది కాదన్నారు. దీనివల్ల పెద్దవాళ్ల పిల్లలు ఏ తప్పు చేసినా చూడనట్లు వ్యవహరిస్తారనే భావన ప్రజల్లోకి వెళ్లిందన్నారు.
ఏ ఆరోపణలు వచ్చినా సరే తొలుత నిందితులను దేశం దాటించటం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. అందుకే బండి సంజయ్ కుమారుడు దేశం దాటి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని మరోసారి చెప్పారు. అప్పుడు మాత్రమే విచారణ పారదర్శకంగా జరుగుతుందని విశ్వాసం ప్రజలకు వస్తుందన్నారు.
బీఆర్ఎస్ వల్లే ఫోటోలు బయటకు.. వారిని అరెస్టు చేయాల్సిందే
కొన్ని పార్టీల వాళ్లు ఒక ట్వీట్ వేసి సమస్యను పరిష్కరించినట్లు చెబుతున్నారని అన్నారు. తాను ఎందుకు స్పందించటం లేదంటూ నానా హంగామా చేస్తున్నారని, ఒక ఆడపిల్ల అంశం వచ్చినప్పుడు చాలా సంయమనంగా వ్యవహరించాలన్నారు. అందులోనూ అమ్మాయి మైనర్ అయినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఈ సమాజం మగపిల్లలను క్షమిస్తుందని, కానీ ఆడపిల్లలను క్షమించదన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అత్యుత్సాహం కారణంగా బాధిత అమ్మాయి ఫోటోలు బయటకు వచ్చాయన్నారు. దీని కారణంగా ఆ అమ్మాయి జీవితం నష్టపోయే ప్రమాదం ఉందని, పోస్ట్ చేసిన ఖాతాలను గుర్తించి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాము ఎప్పుడైనా ఆడపిల్లల పక్షం ఉంటామని, అండగా ఉంటామన్నారు.
ప్రధాని మోడీ తెలంగాణకు చెప్పిన పొదుపు సూత్రాలు మాట్లాడారు. ఆంధ్రాకు పైసలు ఇచ్చారని, పాలమూరు-రంగారెడ్డి జాతీయ హోదాపై ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. పోలవరం కోసం సీఎం చంద్రబాబు శ్రమిస్తే.. పాలమూరు ప్రాజెక్ట్‌ను రేవంత్ సర్కార్ పట్టించుకోలేదన్నారు. గురువును చూసైన మన సీఎం నేర్చుకోవాలన్నారు.
హైదరాబాద్‌కు ప్రధాని వస్తే బీఆర్ఎస్ కనీసం ఒక్క మాట కూడా ఎందుకు మాట్లడలేదని ప్రశ్నించారు. మహిళల బిల్లు మీద ఏమీ మాట్లాడలేదని, ఆ బిల్లులో ఓబీసీ సబ్ కోటా పెట్టాలని డిమాండ్ చేశారు. జనగణనలో ఇళ్ల లెక్క అయిపోయిందని, ఇక జన గణన మాత్రమే ఉంటుందన్నారు.అందుకే అందులో ఓబీసీ కాలం పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
కులంతోపాటు ఉపకులాలు, సామాజిక స్థితిగతులను పరిగణలోకి తీసుకోవాలని, బీసీ రిజర్వేషన్ల కోసం మేము చేసిన రైల్ రైకో కారణంగా ఇవాళ న్యాయస్థానాలకు వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం న్యాయబద్ధమైన డిమాండ్ ను మేము చేస్తూనే ఉన్నామని, కృష్ణానది 300 కిలోమీటర్లు పారుతున్నా మహబూబ్‌నగర్ జిల్లా వెనుకబడి ఉందన్నారు.
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పరిస్థితి ఉన్న అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇచ్చారని వివరించారు టీఆర్ఎస్ చీఫ్. మనకు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి మాట్లాడాలని, జాతీయ హోదా కోసం కేంద్రానికి లెటర్ రాయాలని డిమాండ్ చేశారు. జాతీయ హోదా కోసం పట్టుపట్టాలని కోరారు.
శ్రీశైలంలో 331 టీఎంసీలు వాడుకునేలా ఆంధ్రా నేతలు వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారని, గోదావరిలో 964 టీఎంసీ ల నీళ్లు వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ మనం 220 టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నామని అన్నారు. నీళ్ల విషయంలో ఆంధ్రా నేతలతో పోల్చుకుంటే మనం ఎంత వెనుకబడి ఉన్నామో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రతి ప్రాజెక్ట్ వద్ద మూడు అల్టర్ నేట్‌లు పెట్టుకున్నారని చెప్పారు. చెన్నైకి నీళ్లు అని చెప్పి అక్కడకు వెళ్లే కాలువలను వెడల్పు చేశారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికంగా నిధులు ఖర్చు చేస్తున్నాయని, తాము అధికారంలోకి రాగానే నీటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు.
బీఆర్‌ఎస్‌పై కవిత తీవ్ర విమర్శలు
బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అత్యుత్సాహంతో అమ్మాయి ఫోటోలు బయటపెట్టారని వ్యాఖ్యలు
ఆ అమ్మాయి జీవితం నాశనం కావడానికి బీఆర్ఎస్ పార్టీయే కారణమన్న కవిత
Kalvakuntla Kavitha strongly criticizes BRS.. Comments that BRS party released photos of girl… pic.twitter.com/9Wjl6lbodn
— BIG TV Breaking News (@bigtvtelugu) May 13, 2026