E-Paper
Advertisement

Kavitha: హైదరాబాద్‌కు రాగానే సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ.. ఈడీ విచారణపై చర్చ

Kavitha: హైదరాబాద్‌కు రాగానే సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ.. ఈడీ విచారణపై చర్చ
Advertisement

Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మొత్తం ఐదుగురు సభ్యుల ఈడీ బృందం ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణ అయిపోగానే కవిత ఈడీ ఆఫీస్ నుంచి ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి వెళ్లిపోయారు.

ఆ తర్వాత అర్థరాత్రి కవితతో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, శ్రీనివాస్‌గౌడ్‌లు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరి వచ్చారు. 12.10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమై ఈడీ విచారణ జరిగిన తీరును వివరించారు. ఈడీ అధికారులు ఏయే ప్రశ్నలు అడిగారు అనే వివరాలను కేసీఆర్‌కు తెలిపారు.

Advertisement

మరోవైపు ఈనెల 16న మళ్లీ విచారణకు రావాలని ఈడీ కవితకు నోటీసులిచ్చింది. తొలిసారి జరిగిన ఈడీ విచారణలో ప్రాథమిక అంశాల గురించే కవితను ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రెండోసారి జరగబోయే విచారణలో కవితను మరింత లోతుగా ప్రశ్నించే అవకాశం ఉంది.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×