E-Paper
Advertisement

ఇంద్రవెల్లి వేదికగా కవిత బిగ్ స్కెచ్.. అక్టోబర్‌లో భారీ బహిరంగ సభ!

ఇంద్రవెల్లి వేదికగా కవిత బిగ్ స్కెచ్.. అక్టోబర్‌లో భారీ బహిరంగ సభ!
Advertisement

Kavitha:స్వేచ్ఛ బ్యూరో: అక్టోబర్ లో ఇంద్రవెల్లి కేంద్రంగా భారీ బహిరంగ సభ నిర్వహించేలా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత వ్యూహ రచన చేస్తున్నారు. నిజామాబాద్ లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ సక్సెస్ తో జోష్ మీద ఉన్న పార్టీ క్యాడర్ లో మరింత ఉత్సాహం నింపేందుకు ఈనెల 20న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహిస్తున్నారు. అక్టోబర్ లో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల పరిధిలోని పార్టీ క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నాల్లో ఉన్నారు. కొడంగల్ బహిరంగ సభ అనంతరం ఇంద్రవెల్లి సభ నిర్వహించే తేదీని ప్రకటించనున్నారు. ఈ సభ ద్వారా ఆదివాసీలు, ముఖ్యంగా గోండులు, బంజారాలను పెద్ద సంఖ్యలో పార్టీలో చేర్చుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

రక్షణసేనలో చేరిన నాగోబా ఆలయ ప్రధాన పూజారి

Advertisement

కేస్లాపూర్ లోని నాగోబా దేవాలయ ప్రధాన పూజారి మేస్రం ఆనంద రావు తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. ఆదివారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో పలువురు సర్పంచులు, ముఖ్య నాయకులతో కలిసి పార్టీలో చేరారు. వారికి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత కండువాలు పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజాసమస్యల పోరాడాలని, పరిష్కారం అయ్యేవరకు విశ్రమించవద్దని సూచించారు. ఆ అమ్మవారి ఆశీస్సులు తమపై సంపూర్ణంగా ఉన్నాయని కవిత విశ్వసిస్తారు. ఆలయ ప్రధాన పూజారి, మేస్రం వంశీయుల పెద్ద అయిన మేస్రం ఆనందరావు చేరికతో తమ బలం రెట్టింపు అయ్యిందని పార్టీ నేతలు తెలిపారు. చేరినవారిలో  గిన్నెర గ్రామ సర్పంచ్ మేస్రం భీమ్ రావు, ముత్తనూరు సర్పంచ్ రిట్టె విఠల్, ఆసోద గ్రామ సర్పంచ్ నగేశ్, మన్నూరు మాజీ ఎంపీటీసీ సభ్యుడు కాట్లె మనోహర్, సీనియర్ నాయకులు మేస్రం దయాకర్, తొడసం సాగర్, మేస్రం జంగురావు, కోట్నక్ లక్ష్మణ్, సాయిగౌడ్, కోట్నక్ కృష్ణా తదితరులు టీఆర్ఎస్ లో చేరారు. కార్యక్రమంలో బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, పార్టీ సీనియర్ నాయకులు లోకిని రాజు తదితరులు పాల్గొన్నారు.

Also Read: తెలంగాణలో మారిన మున్సిపల్ రూల్స్.. ఆ తప్పు చేస్తే హోటళ్లు, షాపులు సీజ్!

Tags

Related News

కోదాడ మెగా జాబ్ మేళా.. 300 కంపెనీలు, 4 వేల ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే!

బీసీ కులగణన పేరుతో కేంద్రం మోసం.. డేంజర్‌ జోన్‌లో ఆ రెండు కులాలు..?

నాగార్జునసాగర్‌లో 200 టీఎంసీల నీరు మాయం.. సర్కార్ పై జగదీశ్వర్ రెడ్డి ఫైర్!

సెప్టెంబర్ 17 సంఘటన పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిందే.. రాంచందర్ రావు డిమాండ్!

తెలంగాణలో మారిన మున్సిపల్ రూల్స్.. ఆ తప్పు చేస్తే హోటళ్లు, షాపులు సీజ్!

దర్గా దర్శనం పేరుతో.. భర్త హత్యకు భారీ స్కెచ్చేసి లేపేసిన భార్య!

తెలంగాణ విద్యుత్ వాడకంలో సరికొత్త హిస్టరీ.. అత్యధిక వినియోగం అక్కడే?

Big Stories

Advertisement
×