E-Paper
Advertisement

తెలంగాణలో మారిన మున్సిపల్ రూల్స్.. ఆ తప్పు చేస్తే హోటళ్లు, షాపులు సీజ్!

తెలంగాణలో మారిన మున్సిపల్ రూల్స్.. ఆ తప్పు చేస్తే హోటళ్లు, షాపులు సీజ్!
Advertisement

Cure Act: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రస్తుతం అమలవుతున్న 70 ఏళ్ల నాటి మున్సిపల్ యాక్టు 1959 కు స్వస్తి పలికి, సరి కొత్త క్యూర్ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్దమైంది. పాత చట్టం స్థానంలో సర్కారు అమలు చేయాలనుకున్న క్యూర్ బిల్లుకు శనివారం అసెంబ్లీ కూడా ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టం పాత చట్టాన్ని పూర్తిగా భిన్నంగా ఉండనుంది.

అతిగా వ్యవహారించే వారిపై కఠిన చర్యలు..

Advertisement

సర్కారు నియమించిన బాసులమని అధికారులు, ప్రజలచే ఎన్నకోబడిన ప్రజా ప్రతి నిధులమంటూ అతిగా వ్యవహారించే వారిపై కఠిన చర్యలు అమలు కానున్నాయి. ఏడు దశాబ్దాల క్రితం సుమారు పది నుంచి 15 లక్షల జనాభాకు సరిపోయే విధంగా రూపకల్పన చేసిన మున్సిపల్ యాక్డులోని నిబంధనలు నేడు క్యూర్ లో పెరిగిన కోటి 30 లక్షల జనాభాకు సరిపోకపోవటంతోనే కొత్త చట్టాన్ని తీసుకురావాలన్న సర్కారు నిర్ణయించింది.

సర్కార్ జారీ చేసిన ఆదేశాలు..

Advertisement

గత సంవత్సరం నవంబర్ 25వ తేదీన కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలోకి విలీనం చేయాలని సర్కారు జారీ చేసిన ఆదేశాల మేరకు అతి వేగంగా విలీనం, ఆ తర్వాత ఫిబ్రవరి 11 నుంచి మూడు కార్పొరేషన్లుగా పునర్విభజించిన సంగతి తెల్సిందే. పాత జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించి, అందుబాటులోకి రానున్న పాలక మండలి, అధికారగణం మొత్తం కూడా ఈ సరి కొత్త చట్టం నిబంధనలకు అనుగుణంగా పని చేయనున్నాయి. పరిపాలనలో పారదర్శకత, జవాబుదారితనం పెరగటంతో పాటు ఖర్చు చేసే ప్రతి పైసా కూడా లెక్క కట్టేందుకు వీలుగా కొత్త చట్టంలో నిబంధనలను రూపకల్పన చేసినట్లు తెలిసింది. పౌర, అత్యవసర సేవల్లో భాగంగా పారిశుద్ధ్యం, హెల్త్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, ఫుడ్ సేఫ్టీ పక్కాగా అమలు చేసేందుకు రంగం సిద్దమైనట్లు సమాచారం.

టీజీ సేఫ్ లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విలీనం

క్యూర్ సిటీ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల ఆధీనంలో ఉన్న ఫుడ్ సేఫ్టీ వింగ్ ను ఇటీవలే ఏర్పాటు చేసిన టీజీ సేఫ్ లో విలీనం చేసిన సంగతి తెల్సిందే. ఇప్పటి వరకు అడపాదడపా దాడులు చేస్తూ నామమాత్రంగా అమలైన ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఇక మున్ముందు పోలీసు బాసుల ఆధ్వర్యంలో కట్టుదిట్టంగా అమలయ్యే అవకాశాలున్నాయి. ఇందుకు గాను జీహెచ్ఎంసీ పరిధిలో ఫుడ్ సేఫ్టీ విధులు నిర్వహిస్తున్న 18 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, అయిదుగురు ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్లు, మరోకరు ఫుడ్ సేప్టీ ఆఫీసర్ల ను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ జీహెచ్ఎంసీ నుంచి ఇప్పటికే రలీవ్ చేసినట్లు సమాచారం.

వ్యాపారాలు సీజ్.. యజమానిపై కేసులు..

ప్రస్తుత జీహెచ్ఎంసీ 2007 కు ముందు మున్సిపల్ కార్పొరేషన్  ఆఫ్ హైదరాబాద్ గా ఉన్నప్పటి నుంచి ఐపీఎం ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ వింగ్ పని చేస్తూ వచ్చింది. ఫుడ్ సేఫ్టీకి ప్రత్యేకంగా వింగ్ ఉన్నప్పటికీ, ఫిర్యాదులు వస్తేనే దాడులు నిర్వహించి, శ్యాంపిల్స్ సేకరించి, టెస్టుల నిమిత్తం ల్యాబ్ కు పంపించే వారు. ల్యాబ్ నుంచి రిపోర్టులు వచ్చే లోపు బాధ్యులు జరిమానాలు చెల్లించి, స్వల్ప మార్పులతో యదావిధంగా తమ వ్యాపారాలను కొనసాగించుకునే వారు. ఫుడ్ సేఫ్టీకి సంబంధించ జాతీయ స్థాయిలో పెను మార్పులు వచ్చినా, కలుషిత ఆహారం, నాణ్యలేని తినుబండారాలు, ప్రమాదకరమైన కెమికల్స్ వినియోగించి తయారు చేసిన ఆహారాన్ని విక్రయిస్తున్న వ్యాపారులపై ఇప్పటి వరకు కఠిన చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. ఎంతటి కఠిన చర్యలు తీసుకోవాలన్నా, అది జరిమానాకే పరిమితమైన కఠిన చర్యలు ఇకపై క్యూర్ చట్టంలోని నిబంధనల ప్రకారం వ్యాపారాన్ని సీజ్ చేయటంతో పాటు యజమానిపై కేసులు కూడా నమోదు చేసే అవకాశం లేకపోలేదు.

నాలుగు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా

ఫుడ్ సేఫ్టీపై స్పెషల్ గా ఫోకస్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే టీజీ సేఫ్ ను ఏర్పాటు చేసి, తొలుత  నాలుగు జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, సంగారెడ్డి పరిధిలోని కూర్ అర్బన్ రీజియన్ పరిధిలో  కొత్త చట్టంలోని నిబంధనలను అమలు చేస్తూ ఫుడ్ సేఫ్టీపై టీజీ సేఫ్ ను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని సర్కారు భావిస్తున్న సంగతి తెల్సిందే. ఇకపై ముక్కు సూటిగా వ్యవహారించే ఐపీఎస్ ఆఫీసర్ నేతృత్వంలో క్యూర్ సిటీ పరిధిలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు క్యూర్ చట్టానికి అనుగుణంగా అమలు చేసేందుకు దాదాపు రంగం సిద్దమైందని చెప్పవచ్చు.

హోటల్స్, మెస్ లపై కొరడా..

ముఖ్యంగా మాంసాహార విక్రయ కేంద్రాలైన హోటల్స్, మెస్ లపై కొరడా ఝళిపించేందుకు టీజీ సేఫ్ కూడా షెడ్యూల్ సిద్దం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకు కొన్ని క్యాటగిరీలకు చెందిన ఆహార విక్రయ కేంద్రాలు మాత్రమే మున్సిపల్ కమిషనర్ తనిఖీ చేసే పవర్ ఉండేది. ప్రస్తుతం ట్రేడ్ లైసెన్స్ తో పాటు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లు తప్పనిసరి అయ్యాయి.  కానీ సరి కొత్త క్యూర్  చట్టం ప్రకారం ప్రతి ఒక ఆహార విక్రయ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ తనిఖీ చేసి, ట్రేడ్, ఫుడ్ సేఫ్టీ  లైసెన్స్ లలో ఏ ఒక్కటి లేకపోయినా, సదరు సంస్థను కమిషనర్ పర్మినెంట్ గా సీజ్ చేసేలా క్యూర్ సిటీ చట్టంలో విస్తృత అధికారాలు కేటాయించారు.

Also Read: తిరుమలలో ప్రైవేట్ వాహనాలపై TTD క్లారిటీ

Tags

Related News

ఇంద్రవెల్లి వేదికగా కవిత బిగ్ స్కెచ్.. అక్టోబర్‌లో భారీ బహిరంగ సభ!

సెప్టెంబర్ 17 సంఘటన పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిందే.. రాంచందర్ రావు డిమాండ్!

దర్గా దర్శనం పేరుతో.. భర్త హత్యకు భారీ స్కెచ్చేసి లేపేసిన భార్య!

తెలంగాణ విద్యుత్ వాడకంలో సరికొత్త హిస్టరీ.. అత్యధిక వినియోగం అక్కడే?

నకిలీ పన్నీర్‌ దందాకు సర్కార్ చెక్.. ఏడాది పాటు అనలాగ్ పన్నీర్‌పై నిషేధం!

రూ. 15 వేల కోట్ల ఫీజు బకాయిలు ఎప్పుడిస్తారు?.. సర్కార్‌ను నిలదీసిన బీజేపీ!

నన్ను రెచ్చగొడితే కథ వేరేలా ఉంటుంది.. ప్రత్యర్థులకు కొండా మురళి వార్నింగ్!

Big Stories

Advertisement
×