HP OmniBook 3 14: హెచ్‌పీ కొత్తగా OmniBook 3 14 ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 14 అంగుళాల స్క్రీన్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ కొత్త పాంథర్ లేక్ ప్రాసెసర్లు ఉన్నాయి. గరిష్ఠంగా 32GB ర్యామ్, 1TB ఎస్‌ఎస్‌డీ, వై-ఫై 7 వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బడ్జెట్‌లో మంచి పనితీరు కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలువనుంది.
మ్నీబుక్ 3 14లో కోర్ అల్ట్రా 5 322, కోర్ అల్ట్రా 5 325, కోర్ అల్ట్రా 7 355 ప్రాసెసర్లను ఎంచుకోవచ్చు. బేస్ మోడల్‌లో కోర్ అల్ట్రా 5 322, 16GB DDR5-5600 ర్యామ్, 256GB PCIe Gen 4 ఎస్‌ఎస్‌డీ ఉన్నాయి. ర్యామ్‌ను 24GB లేదా 32GB వరకు పెంచుకునే అవకాశం ఉంది. 32GB వెర్షన్ మాత్రం సింగిల్ ఛానల్‌లో పనిచేస్తుంది.
Also Read: 7900mah బ్యాటరీతో వచ్చిన POCO M8X 5G ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్!
బేస్ మోడల్‌లో 1200p IPS డిస్‌ప్లే, 300 నిట్స్ బ్రైట్‌నెస్, 62.5 శాతం sRGB కవరేజ్ ఉన్నాయి. కావాలంటే 400 నిట్స్ బ్రైట్‌నెస్, 100 శాతం sRGB ఉన్న స్క్రీన్‌ను అదనంగా ఎంచుకోవచ్చు. టచ్‌స్క్రీన్ ఆప్షన్ కూడా ఉంది. ఎక్కువ సమయం స్క్రీన్ ముందు పనిచేసేవారికి 100 శాతం sRGB మోడల్ ఉపయోగకరంగా ఉంటుంది.
అమెరికాలో బేస్ సుమారు రూ.50,000. 1TB ఎస్‌ఎస్‌డీ, 32GB ర్యామ్, కోర్ అల్ట్రా 7 355, బ్యాక్‌లిట్ కీబోర్డ్, వై-ఫై 7, 400 నిట్స్ డిస్‌ప్లేతో టాప్ మోడల్ ధర రూ.1.23 లక్షలు. అయితే భారత మార్కెట్ ధర వేరుగా ఉండొచ్చు.
ల్యాప్‌టాప్‌లో 60Wh బ్యాటరీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6 బేస్ మోడల్‌లో ఉన్నాయి. అదనంగా వై-ఫై 7, బ్యాక్‌లిట్ కీబోర్డ్ ఎంచుకోవచ్చు. గ్లేసియర్ సిల్వర్‌తో పాటు కొన్ని ఇతర రంగుల ఆప్షన్లు కూడా ఉన్నాయి. మొత్తంగా, మంచి ర్యామ్, కొత్త ఇంటెల్ ప్రాసెసర్, అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం కావాలనుకునే వారికి OmniBook 3 14 ఉపయోగపడే ల్యాప్‌టాప్.
Also Read: గూగుల్ డ్రైవ్‌లో ఫైల్స్ అప్లోడింగ్ చాలా స్లోగా ఉందా? ఈ సింపుల్ ట్రిక్స్ ట్రై చూసి చూడండి!