BigTV English

BREAKING NEWS : హాస్పిటల్‌కు కేసీఆర్.. అయ్యో ఏమైంది?

BREAKING NEWS : హాస్పిటల్‌కు కేసీఆర్.. అయ్యో ఏమైంది?

BREAKING NEWS : బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్.. హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్‌కు వెళ్తున్నారు. హెల్త్ చెకప్, కొన్ని రెగ్యులర్ టెస్టుల కోసం అని అంటున్నారు. పైకి అంతా ఓకే అని చెబుతున్నా.. లోలోన మాత్రం…?


ఇటీవలే కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు కేసీఆర్. ఆ సమయంలో చాలా వీక్‌గా కనిపించారు. సొంతంగా నడవలేక పోయారు. గన్‌మెన్‌ను పట్టుకుని మెట్లు ఎక్కారు. జస్టిస్ ఘోష్ తోనూ తన ఆరోగ్యం బాగాలేదని.. సింగిల్‌గా ఇన్ కెమెరా విచారణ చేయాలని కోరారు. కేసీఆర్ కోరిక మేరకే వన్ టు వన్ ఎంక్వైరీ జరిగింది. 50 నిమిషాల పాటు ప్రశ్నించి పంపించేశారు. కమిషన్ విచారణ సందర్భంగా కేసీఆర్ తీవ్ర ఒత్తిడికి గురయ్యారా? తన అరెస్ట్ తప్పదని భావిస్తున్నారా? ఆ టెన్షనే ఆయన ఆరోగ్యాన్ని కుంగతీసిందా? అనే అనుమానాలు పార్టీ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి.

కేటీఆర్‌కు నోటీసులు..


ఒక్క కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీనే కాదు.. అటు కేటీఆర్‌కు సైతం ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో.. లేటెస్ట్‌గా మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. జూన్ 16, సోమవారం ఉదయం విచారణకు హాజరుకావాలని సూచించింది. కొడుకు టెన్షనూ కేసీఆర్‌ను వేధిస్తున్నట్టే అనిపిస్తోంది.

కవిత టెన్షన్ పట్టుకుందా?

అన్నిటికంటే ముఖ్యమైనది కూతురు కవిత ఎపిసోడ్. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ పార్టీలో కలకలం రేపడాన్ని.. గులాబీ బాస్ తట్టుకోలేక పోతున్నారు. ఇటీవల ఫాంహౌజ్‌కు వచ్చిన కవిత ముఖం కూడా చూడలేదు కేసీఆర్. కొడుకు పైనే కూతురు కొట్లాడటం.. బీఆర్ఎస్ కాకుండా సొంతంగా జాగృతి పేరుతో రాజకీయాలు చేస్తుండటం.. కేసీఆర్‌కు అస్సలు నచ్చట్లేదట. అందుకే, కూతురు ఏం కొంపముంచుతుందోననే మనోవేధన సైతం ఆయన్ను తీవ్రంగా కుంగదీస్తోందని తెలుస్తోంది. ఇలా అనేక మానసిక బాధలు.. వయస్సు పైబడిన శారీరక చాయలతో.. కేసీఆర్ మునుపటిలా లేరని.. చాలా బలహీనంగా మారారరి అంటున్నారు. అందుకే, ఆరోగ్యం బాగా లేకపోవడంతో మరోసారి AIG హాస్పిటల్‌లో హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారని చెబుతున్నారు. ఓడిపోయి.. తన మానాన తాను ఫాంహౌజ్‌లో రెస్ట్ తీసుకుంటున్న కేసీఆర్‌కు ఎంత కష్టం వచ్చే!

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×