Big TV Kissik Talks..భాను శ్రీ.. బుల్లితెరపై పలు టీవీ షోలతో భారీ పాపులారిటీ అందుకున్న భాను శ్రీ (Bhanu Sri) ఈమధ్య వెండితెరపై కూడా పలు సినిమాలలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. నిత్యం ఇంస్టాగ్రామ్ వేదికగా రోజుకో కొత్త ఫోటోతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇకపోతే సినిమాలతోనే కాదు పలు సాంగ్స్ తో కూడా భారీ పాపులారిటీ అందుకున్న భాను.. ‘ శ్రీ దేవి డ్రామా కంపెనీ’ వంటి కామెడీ షోలలో పాటలు పాడి తన వాయిస్ కారణంగా నెగెటివిటీ కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అలా ఒకవైపు పొగడ్తలు.. మరొకవైపు విమర్శలతో విసిగిపోయిన ఈమె గత కొంతకాలంగా ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చింది. అయితే కావాలని ఈమె బ్రేక్ ఇచ్చిందా? లేక బ్రేక్ వచ్చిందా? అనే విషయం మాత్రం తెలియలేదు. ఇకపోతే నిన్న మొన్నటి వరకు విదేశాలలో తెగ ఎంజాయ్ చేసిన ఈమె.. తాజాగా హైదరాబాద్ కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బిగ్ టీవీ నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Big TV Kissik Talks) కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చింది భాను శ్రీ.
“నా లిప్స్ చాలా కాస్ట్లీ” – భాను శ్రీ
జబర్దస్త్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న భాను శ్రీ ఎన్నో విషయాలను పంచుకుంది. ముఖ్యంగా తన కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను కూడా పంచుకుంది. ప్రస్తుతం ఈ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమోని తాజాగా నిర్వాహకులు విడుదల చేశారు. ఇక ఇందులో అడిగిన ప్రశ్నలకు భాను శ్రీ సమాధానం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇంటర్వ్యూలో భాగంగా జబర్దస్త్ వర్షా మాట్లాడుతూ..” నువ్వు చేస్తున్న సినిమాలలో కానీ సాంగ్స్ లో కానీ లిప్ కిస్ చేయమంటే..చేయడానికి నువ్వు రెడీగా ఉన్నావా ?” అని ప్రశ్నించగా.. “నా లిప్స్ చాలా కాస్ట్లీ” అంటూ వర్ష ముందు ప్రైజ్ గురించి ఓపెన్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచింది భాను శ్రీ. ప్రస్తుతం భాను శ్రీ ఇంటర్వ్యూకి సంబంధించిన ఈ ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.
also read: Big TV Kissik Talks: రాజమౌళి వల్లే నా జీవితం నాశనం- భాను శ్రీ ఎమోషనల్ కామెంట్స్!
లవ్ బ్రేకప్ పై భాను శ్రీ క్లారిటీ..
ఇకపోతే భాను శ్రీ ఇదే ప్రోమోలో లవ్ బ్రేకప్ పై కూడా క్లారిటీ ఇచ్చింది. బ్రేకప్ అయిందని విన్నాము.. దాని మాటేంటి? అని వర్షా అడగగా.. భాను మాట్లాడుతూ.. “ప్రేమ అనేది చాలా పవిత్రమైనది. మనిద్దరి మధ్య ఏం జరిగినా.. ఎన్ని ఫైట్స్ అయినా.. 100% నువ్వు నాతోనే.. నేను నీతోనే.. నిజమైన ప్రేమ ఎప్పుడూ బ్రేకప్ అవ్వదు. అది లైఫ్ లాంగ్ ఉంటుంది. మనం జీవించినంత కాలం ఉంటుంది”అంటూ తన బ్రేకప్ పై క్లారిటీ ఇచ్చింది భాను శ్రీ. మొత్తానికైతే బ్రేకప్ లేదని , ప్రస్తుతం తాను లవ్ లోనే ఉన్నట్టు హింట్ ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ.