KCR Press Meet : సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో సంచలన విషయాలు వెల్లడించారు. ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వీడియోలో బీజేపీ కుట్రలు బయటపడ్డాయని చెప్పారు. ఇప్పటికే 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేశామని మధ్యవర్తులు చెప్పినట్టు.. త్వరలోనే మరో నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలను పడగొడతామని వారు అన్నట్టు సీఎం తెలిపారు.
బీజేపీ టార్గెట్ చేసిన ఆ నాలుగు రాష్ట్రాలు ఏంటో కూడా కేసీఆర్ చెప్పారు. మధ్యవర్తుల మాటల ప్రకారం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ లో ఎమ్మెల్యేలను చీల్చి ఆయా ప్రభుత్వాలు కూల్చేసి.. దేశవ్యాప్తంగా బీజేపీ సర్కార్లను ఏర్పాటు చేస్తామని ఫాంహౌజ్ లో ఆ ముగ్గురు మధ్యవర్తులు చెప్పారని కేసీఆర్ అన్నారు.
మొత్తం 24 మంది టీమ్ ఉన్నట్టు వారే చెప్పారని కేసీఆర్ వెల్లడించారు. ఒక్కొక్కరికీ మూడు నాలుగు పాన్ కార్డులు , పలు అడ్రస్ ప్రూఫ్ లు ఉన్నాయని.. ఇది చాలా పెద్ద క్రైం అంటూ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.