KCR Press Meet : దేశంలో ప్రజాస్వామ్య హత్య జరుగుతోందని.. ఇంత దుర్మార్గం ఎప్పుడూ చూడలేదని.. బాధాకరమైన మనసుతో ఈ ప్రెస్ మీట్ పెడుతున్నట్టు సీఎం కేసీఆర్ అన్నారు. దేశ్ కో బచాయియే.. అంటూ న్యాయ వ్యవస్థను కోరారు కేసీఆర్.
మొయినాబాద్ ఫాంహౌజ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తెలంగాణ దర్యాప్తు సంస్థలు సేకరించిన వీడియో ఫూటేజ్ ని సుప్రీంకోర్టుకు, దేశంలోని అన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ లకు, సీబీఐ ఈడీలాంటి అన్ని జాతీయ దర్యాప్తు సంస్థలకు, అన్ని మీడియా సంస్థలకు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, అన్ని పార్టీల అధ్యక్షులకు ఈ వీడియో సాక్షాలు పంపించినట్టు కేసీఆర్ చెప్పారు. మొత్తం 3 గంటల వీడియో ఉందని.. అది చూస్తే జనం నివ్వెరబోతారని అన్నారు.