
KCR Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని అందరూ మోనార్క్ అంటారు. ఆయనని ఎవరైనా ప్రశ్నిస్తే అసలు సహించరనే టాక్ ఉంది. అది ప్రెస్‌మీట్‌లో రిపోర్టర్లు అయినా… లేదంటే అసెంబ్లీలో విపక్షాలైనా.. క్వశ్చన్ చేస్తే అంతెత్తున ఎగిరిపడతారు. అధికార బలాన్ని ప్రయోగిస్తారు. బీఆర్ఎస్‌లో చేరే ముందు ఒకమాట.. చేరిన తర్వాత మరోలా పరిస్థితి ఉంటుందని కేసీఆర్‌ని నమ్మి మోసపోయిన వాళ్లు చెబుతుంటారు. ఇదంతా ఒక ఎత్తైతే ఎన్నికల ప్రచారంలో మరో ఎత్తుగా కేసీఆర్ తీరు ఉంటోంది. ఓటేయాల్సిన ప్రజలని.. నిలబడిన అభ్యర్థులను ఏకి పారేస్తున్నారు. కేసీఆర్ ఊగిపోతుండటం చూసిన జనం ఓటమి ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందని అంటున్నారు. మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రజలని ఉత్సాహపరుస్తున్నారు. తనతో పాటు మాట కలపాలంటూ జోష్ నింపుతున్నారు.
ఈ ఇద్దరు నేతల ప్రచార శైలి ఎలా ఉందో మనం చూస్తున్నాం. కేసీఆర్ ప్రచారానికి.. రేవంత్‌రెడ్డి ప్రచారానికి ఎంత తేడా కనిపిస్తోంది. కేసీఆర్ తీవ్రమైన ఫ్రస్ట్రేషన్‌కి గురవుతుండగా రేవంత్‌రెడ్డి మాత్రం జోష్‌లో కనిపిస్తున్నారు. ఒకరు ప్రజల్ని హౌలా అంటూ తిట్ల దండకం అండుకుంటుండగా మరొకరు గొంతు కలపాలంటూ ఉత్సాహ పరుస్తున్నారు. మరి ఈ ఇద్దరు నేతల ప్రచార శైలి ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారుతోంది. కాంగ్రెస్ గెలుస్తుందనే ధీమా రేవంత్‌రెడ్డి ప్రచార సరళిలో స్పష్టంగా కనిపిస్తోంది. అటు కేసీఆర్‌లో మాత్రం నైరాష్యం నెలకొంటోంది. ఎక్కడ సభకు వెళ్లినా ఇలాగే తిట్ల దండకం అందుకుంటున్నారు గులాబీ బాస్. ఇదే టైమ్‌లో పీసీసీ చీఫ్ ఎక్కడికి వెళ్లినా ప్రజలని గౌరవిస్తూ గొంతు కలిపేలా ఎంకరేజ్ చేస్తున్నారు. బోధన్, మెదక్, నాగార్జునసాగర్, నిజామాబాద్, పాలకుర్తి సహా దాదాపు అన్ని సభల్లోనూ కేసీఆర్ ఇలాగే విరుచుకుపడుతున్నారు.
ఇక కేసీఆర్ ఫ్రస్ట్రేషన్స్ పీక్స్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. అభ్యర్థుల తరఫున ప్రచారానికి వస్తున్న వాళ్లని కూడా ఉతికి ఆరేస్తున్నారు. సార్ కొంచెం హామీల మాట మీ నోటితో చెప్పండి అంటే ఏ అవన్నీ చిన్న చిన్నవి చీప్ ముచ్చట్లు అని కొట్టిపారేస్తున్నారు. తాను చెప్పాలనుకున్నది మాత్రమే చెప్పి వెళ్లిపోతున్నారు. ఎక్కువ మాట్లాడితే ఒర్రకుర్రి… నోరు మూసుకోని కూర్చోండి.. హౌలే గాళ్లా అంటూ దొరతనం చూపిస్తున్నారు గులాబీ బాస్. ఇట్లైతే కుదరదు నేను ఒక్కడినే ఇంకా ఎన్నాళ్లు కొట్లాడాలే ఫామ్ హౌస్‌లో రెస్ట్ తీసుకుంటా అంటూ ఏమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అదే రేవంత్‌రెడ్డి మాత్రం మీటింగ్ అయిపోగానే చివర్లో ప్రజల మద్దతు కోరుతున్నారు. మార్పుకోసం కలిసి రావాలంటూ గొంతు కలిపేలా ప్రోత్సహిస్తున్నారు. అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెబుతుండగా.. కాంగ్రెస్‌పై దష్ప్రచారానికి, కరెంట్ మాటలు తప్ప కేసీఆర్ నోట మరేమీ రావడం లేదు.
ముఖ్యమంత్రి సభ ఉందంటేనే జనం ఆలోచనలో పడిపోతున్నారు. ఆయన సభ కోసం వెళ్లడం ఎందుకు ఆయనతో హౌలేగాళ్లా.. పాలెగాళ్లా.. అని తిట్లు పడటం ఎందుకని ఆవేదన చెందుతున్నారు. మీటింగ్‌కు రాకపోతే.. ఓటు వేయకపోతే పథకాలు అపేస్తామని బెదిరిస్తున్నారని.. పోతే పొయ్యాయి.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని జనం గులాబీ నేతలకి గట్టిగానే బదులిస్తున్నారు. రేవంత్‌రెడ్డి కలుపుగోలుతనం ప్రేమ, అభిమానం చూసి ఆయన వస్తున్నారంటే కార్నర్ మీటింగ్‌లు సహా సభలకు భారీగా వెళ్తున్నారు. అధికారం ఉందని కేసీఆర్ అహం ఇన్నాళ్లూ నాయకులపైనే చూపించేవారని.. ఇప్పుడు ఓడిపోతున్నాననే ఫ్రస్ట్రేషన్‌లో తమను కూడా తిడుతున్నారని జనం చర్చించుకోవడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారుతోంది. తిరిగే కాలు.. తిట్టే నోరు ఊరుకుంటుందా అనే సామెత కేసీఆర్ విషయంలో హండ్రెట్ పర్సెంట్ నిజమని పల్లెల్లో జనం రచ్చబండల దగ్గర మాట్లాడుకోవడం చర్చనీయంశమవుతోంది.
Bandi Sanjay : బండి అరెస్టుపై రాజకీయ రగడ.. బీజేపీ హైకమాండ్ ఆరా.. బీఆర్ఎస్ ఎదురుదాడి..