E-Paper
Advertisement

Medak : మెదక్ లో దారుణం.. రోడ్డుపక్కన సగం కాలిన యువతి మృతదేహం

Medak : మెదక్ లో దారుణం.. రోడ్డుపక్కన సగం కాలిన యువతి మృతదేహం
Advertisement
TS News updates

Medak News today(TS news updates):

మెదక్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. పాతికేళ్ల యువతి విగతజీవిగా.. సగం కాలిన శరీరంతో రోడ్డుపక్కన కనిపించింది. ఈ ఘటన చేగుంట మండలం వడియారం సమీపంలో జరిగింది. స్థానిక ఎస్సై హరీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 25 ఏళ్ల వయసు ఉన్న గుర్తుతెలియని యువతి మృతదేహం హైదరాబాద్‌ కు వెళ్లే రహదారి పక్కన సగం కాలిపోయిన స్థితిలో ఉండటాన్ని స్థానికులు గమనించారు.

పోలీసులకు సమాచారం అందించగా.. ఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పరిశీలించారు. దుండగులు ఆమెను ఎక్కడో హత్యచేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్రోలు పోసి నిప్పటించినట్లు అక్కడ ఉన్న అనవాళ్లను బట్టి తెలుస్తోందని ఎస్సై తెలిపారు. మృతురాలి ఒంటిపై కాషాయ రంగు టాప్, ఎరుపు రంగు లెగ్గిన్ ఉందని పేర్కొన్నారు. మృతురాలి గుర్తు తెలిసిన వ్యక్తులు, బంధువులు ఎవరైనా ఉంటే చేగుంట పోలీసు స్టేషన్, రామాయంపేట సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×