BigTV English

Dharani Portal : ధరణి పేరుతో దోచిపెట్టింది ఎవరికి.. ఈ భూములే ఆ నాయకుల అసలు టార్గెట్టా.. అమ్మో పెద్ద ప్లానింగే..

Dharani Portal : ధరణి పేరుతో దోచిపెట్టింది ఎవరికి.. ఈ భూములే ఆ నాయకుల అసలు టార్గెట్టా.. అమ్మో పెద్ద ప్లానింగే..

Dharani Portal : అప్పటి వరకు పేపర్ రికార్టులకు పరిమితమైన భూమి రికార్డులను ధరణి పేరుతో డిజిటలైజ్ చేసింది.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక సమస్యలన్నీ మటుమాయం అంటూ ఊదరగొట్టేసింది. కానీ.. వాస్తవంలో మాత్రం దీని వెనుక పెద్ద కుట్రే ఉందంటోంది.. కాంగ్రెస్. ధరణి పేరుతో దగా చేశారని.. పేదల్ని కొట్టి పెద్దలకు లబ్ధి చేకూర్చారంటోంది. వేలకోట్ల భూముల్ని అప్పనంగా అప్పగించేందుకు చేసిన కుట్రగా చెబుతున్నారు. ఇప్పుడే కాదు.. ఎన్నికల సమయంలోనే ఈ విషయాన్ని ప్రస్తావించారు.. రేవంత్ రెడ్డి. కేసీఆర్ ధరణి పేరుతో తీసుకువచ్చిన పోర్టల్ అసలు ఉద్దేశాలను ప్రజల ముందుంచారు. తాము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామంటూ ప్రకటించారు. క్షేత్రస్థాయిలోని అనేక సమస్యలకు పరిష్కారం చూపడంతో ధరణి విఫలమైందంటూనే… ధరణి మాటున దగా జరగిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంతకీ ఆ ఆరోపణులు ఏంటి.. ప్రభుత్వ పెద్దలు చేసిన కుట్రలేంటి..


ధరణి ఆలోచనలోనే పెద్ద దందా ఉందన్నది రాజకీయ వర్గాల్లోని చాలా మందికి ఉన్న అనుమానం. ఈ విషయాన్ని పోర్టల్ వినియోగంలోకి వచ్చాక… అప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గుర్తించారు. కళ్ల ముందే కోట్ల భూముల రికార్డులు మారిపోతున్నాయని ఆరోపించారు. అర్థరాత్రి వేళ మారిపోయిన నిషేధిత భూముల జాబితాలోని భూముల వివరాల్ని ప్రజల ముందుంచి.. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాటన్నింటిపై మౌనమే సమాధానంగా ఉంటూ వచ్చిన కేసీఆర్ సర్కార్.. భూమి రికార్డుల్లో అనేక చీకటి మార్పులకు తెరలేపింది. రాత్రికి రాత్రే అనుయాయులకు కోట్లు కురిపించే భూముల్ని ధారాదత్తం చేసేసింది. అసలు ధరణికి ముఖ్యకారణమని చెబుతున్న భూముల సంగతి ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ భూములే అసలు టార్గెట్


హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ రంగానికి ఆయువు పట్టుగా ఉన్న ప్రాంతం.. గచ్చిబౌలికి కూతవేటు దూరంలోనే ఉంటుంది.. వట్టినాగులపల్లి. రంగారెడ్డి జిల్లాలోని ఈ ప్రాంతం.. జీవో 111 పరిధిలోని 84 గ్రామాల్లో ఒకటి. ఇక్కడ వ్యవసాయేతర కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం లేకపోవడంతో 1 లక్షా 32 వేల ఎకరాల భూములు.. ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు వీలు లేకుండా పోయాయి. సిటీకి చాలా దగ్గరగా ఉండడం, మరో పెద్ద సిటీ పట్టేంత ప్రాంతమైన ఇక్కడ భూముల విలువ లక్షల కోట్లు. అదిగో.. ఆ భూములే ఆనాటి ప్రభుత్వ పెద్దల టార్గెట్ అంటుంటారు. రేవంత్ రెడ్డి సైతం అనేక సార్లు ఈ విషయాల్ని ప్రస్తావించారు. ఈ విషయాన్ని మరింత వివరంగా తెలుసుకోవాలి అంటే…

2009లో సత్యం రామలింగరాజు కుంభకోణం బయటపడింది. దాంతో.. వట్టినాగుల పల్లిలోని సత్యం రామలింగరాజుకు చెందిన వంద ఎకరాల భూములను ఈడీ, సీబీఐ అటాచ్‌ చేశాయి. వాటిపై కన్నేసిన నేతలు.. ధరణి పేరుతో సరికొత్త కుట్రకు దారితీశారు. వివాదాల్లోని సత్యం భూముల్ని లీగల్‌గా మార్చుకుని.. వేల కోట్ల విలువైన భూములను దక్కించుకోడానికి ధరణి పేరుతో స్కెచ్ వేశారనేది ప్రతిపక్షాల ఆరోపణ. అందుకే, ధరణి పోర్టల్‌ను రామలింగరాజు రిలేటివ్ శ్రీధర్‌రాజు కంపెనీకి అప్పగించారని ఆరోపిస్తుంటారు.

ఈ సంబంధాలకు సమాధానాలేవి?

2018లో ధరణి పోర్టల్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ బాధ్యతను IL&FS కంపెనీకి ఇచ్చారు. ఈ IL&FS సంస్థ 2018 జూన్‌లోనే బ్యాంకులకు లక్ష కోట్లు ఎగ్గొట్టింది. అలాంటి సంస్థ ధరణి వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఎందుకు అప్పగించారనేది అసలు ప్రశ్న. అంతే కాదండోయ్… ఈ IL&FS సంస్థ.. సత్యం కుంభకోణం బయటపడిన తరువాత రామలింగరాజు తనయుడు తేజ రాజుకు చెందిన మేటాస్ ఇన్‌ఫ్రాను టేకోవర్ చేసింది. ఆ తర్వాత IL&FS కంపెనీ టెర్రాసిస్‌గా మారిపోయింది. టెర్రాసిస్‌గా మారిన ఈ కంపెనీని Quantela కంపెనీ కొనేసింది. ఈ Quantela ఓనర్ మరెవరో కాదు. సత్యం రామలింగరాజు బంధువు గాధి శ్రీధర్ రాజు. ఓవరాల్‌గా చూస్తే ధరణి పోర్టల్ సత్యం రామలింగరాజు బంధువైన శ్రీధర్ రాజు చేతిలోకి వెళ్లిపోయింది. అయితే.. ఈ కంపెనీ హెడ్ క్వార్టర్ అడ్రస్ మాత్రం అమెరికా. అందుకే.. ధరణి పోర్టల్ ని అమెరికన్ కంపెనీకి ఇచ్చామని బీఆర్ఎస్ నేతలు చెప్పేది. కానీ.. వాస్తవంలో మాత్రం ఇదీ ఆ సంస్థ వెనుకున్న చరిత్ర.

అంతే కాదు.. ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య కేవలం 250 నుంచి 500 మంది మాత్రమే. ఇంత తక్కువ మంది ఉన్న సంస్థకు రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల భూములు, రైతుల బ్యాంకు, వ్యక్తిగత వివరాలు ఉండే ధరణి బాధ్యతలు ఎలా ఇచ్చారనేది ప్రశ్న. పైగా సత్యం తనయుడు, ఒకప్పటి మేటాస్ ఇన్‌ఫ్రా ఛైర్మన్ తేజ రాజుతో మంత్రి కేటీఆర్ ఫారెన్ ట్రిప్పులు వేయడం వెనక ఏదో జరుగుతోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో ఆరోపిస్తూనే ఉన్నారు. NIT, TCS, ఇన్ఫోసిస్ ఉన్నప్పటికీ.. అప్పట్లో ఒక డీఫాల్ట్‌ కంపెనీకే సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ బాధ్యతలు ఎందుకు ఇచ్చారన్నది అప్పటి ప్రతిపక్ష నాయకుల ప్రధాన అనుమానం. దాని వెనుకున్న సీక్రెట్ స్కెట్.. ఇంకొక పెద్ద అనుమానం.

సత్యం రామలింగరాజు వట్టినాగులపల్లిలోని వేల కోట్ల భూముల కోసం ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్-ఈడీ ని అడిగితే.. రూ. 8,500 కోట్ల ఫైన్ కట్టి భూములు తీసుకోవాలని ఈడీ రిప్లై ఇచ్చింది. అంత మొత్తం కట్టడం ఎందుకని కేసీఆర్‌ సర్కార్‌ సత్యం రామలింగరాజు బంధువు కంపెనీకి ఇన్‌డైరెక్టుగా ధరణి సాఫ్ట్‌వేర్‌ బాధ్యతలు అప్పగించారనే టాక్ నడుస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్ సాయంతో వందల ఎకరాల భూములను లీగల్‌ చేసుకున్నట్లు ప్రధాన ఆరోపణ.

Also Read : కేటీఆర్ కు బిగ్ షాక్.. విచారణను ఎదుర్కోవాల్సిందే!

అలాగే.. ధరణిలో ప్రైవసీ అనే ఆప్షన్ ఉంది. కాబట్టి… ఈ భూములు ఎవరు కొన్నారు అనే విషయం బయటికి రాదు. కేవలం పెద్దోళ్ల కోసమే ఈ ఆప్షన్ తీసుకొచ్చారనేది చాలా మందికున్న అనుమానం. 111 జీవో రద్దుకు ముందు రంగారెడ్డి జిల్లా వ‌ట్టినాగుల‌ప‌ల్లిలోని సుమారు వెయ్యి ఎక‌రాల‌ను రాత్రికి రాత్రే ప్రైవసీ లిస్టులోకి ఎక్కించారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో ప్లాట్లుగా, ధరణిలో అంటే తహసీల్దార్ ఆఫీసులలో వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. ఇదంతా ఓ పెద్ద గోల్‌మాల్ అంటోంది మొదటి నుంచి కాంగ్రెస్ నాయకత్వం. అందుకే.. ఈ భూముల తారుమారు వ్యవహారాల్ని కొనసాగనివ్వకుండా.. భూభారతి పేరుతో నిపుణుల సలహాతో రూపొందించిన పకడ్భదీ వెబ్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×