Amazon Prime : ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అమెజాన్ (Amazon) వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త నిబంధనలను తీసుకురానుంది. ఇప్పటివరకు ప్రైమ్ సభ్యులు ఒకే ఖాతా నుంచి ఎన్ని టీవీలోనైనా ఈ ఫ్లాట్ఫామ్ ను ఉపయోగించే అవకాశం ఉండగా.. తాజాగా ఈ విషయంపై నిబంధనలు తీసుకురానుంది. కేవలం ఐదు టీవీలు లేదా గ్యాడ్జెట్స్ లో మాత్రమే ఒక మెంబర్షిప్ పనిచేసే విధంగా నిబంధనలు అమలు చేయాలనుంది.
తక్కువ ధరలకే బెస్ట్ కంటెంట్ ను అందిస్తున్న ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అమెజాన్. ఇప్పటివరకూ సినీ ప్రియులకు బెస్ట్ ప్లాట్ఫామ్ గా నిలిచిన అమెజాన్ ప్రైమ్.. తన యూజర్స్ కోసం ఎన్నో వెసులుబాటులను కల్పిస్తూ వచ్చింది. నిజానికి ఒక్కరి దగ్గర అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉంటే చాలు దాన్ని ఎంతమంది అయినా ఉపయోగించే అవకాశాన్ని ఇచ్చింది. నచ్చిన వారితో అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ను పంచుకునే అవకాశం కల్పించింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ విధానానికి స్వస్తి పలుకుతుంది అమెజాన్. జనవరి 2025 నుంచి ప్రైమ్ సభ్యులు ఒకే ఖాతాలో ఎన్ని టీవీలను ఉపయోగించవచ్చు అనే విషయాలపై కొత్త పరిమితులు తీసుకురానుంది.
ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం ఒక మెంబర్షిప్ పై గరిష్టంగా ఐదు టీవీలను ఉపయోగించే అవకాశం ఉండనున్నట్టు తెలుస్తోంది. అమెజాన్ పంపిన అధికార ఈ మెయిల్ ప్రకారం వినియోగదారులు ఈ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో సైతం మరిన్ని నిబంధనలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రెండు టీవీలు మిగిలినవి స్మార్ట్ ఫోన్స్ లో లాగిన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఒకవేళ మరిన్ని టీవీలకు ప్రైమ్ మెంబర్షిప్ కావాలి అనుకుంటే ప్రత్యేక సభ్యత్వాన్ని తీసుకోవాల్సి ఉండనున్నట్టు తెలుస్తుంది.
అయితే ఈ కొత్త నిబంధనల ప్రకారం.. వినియోగదారులు టీవీల విషయంలో పరిమితులు ఎదుర్కొన్నప్పటికీ స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, లాప్ టాప్స్ లో కంటెంట్ ను యాక్సెస్ చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ప్రైమ్ వీడియో సెట్టింగ్‌ల పేజీ ద్వారా వినియోగదారులు తమ మెంబర్షిప్ ను మరింత తేలికగా ఉపయోగించే అవకాశం ఉండనున్నట్టు కూడా అమెజాన్ తెలుపుతుంది. ఇక ఖాతాకు లింక్ చేసిన గాడ్జెట్స్ ను ఈ రూల్స్ అందుబాటులోకి వచ్చాక కొనసాగించవచ్చు లేదా తీసేయవచ్చు. ఇది పూర్తిగా వినియోగదారుడి అవసరాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.
ఇక ఈ నిబంధనలను వినియోగదారులందరూ తప్పకుండా పాటించాలని తెలిపిన అమెజాన్… రాబోయే కొత్త షోస్, సినిమాలతో మరింత ఆదరణ పెరుగుతుందని ఆశించింది. ఇక వినియోగదారులకు పంపిన సందేశంలో మీర్జాపూర్, పంచాయత్, సిటాడెల్, స్ట్రీ 2, కల్కి 2898 AD మూవీస్ ను హైలైట్ చేసింది.
మరి అమెజాన్ కొత్తగా తీసుకొచ్చిన ఈ నిబంధనలు ఎప్పటినుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయో అనే విషయం తెలియలేదు. వినియోగదారులకు పంపించిన ఈమెయిల్ ఆధారంగా ఇప్పటివరకు ఒక క్లారిటీ వచ్చినప్పుడు నిబంధనలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినప్పుడు మాత్రమే అసలు విషయం తెలుస్తోంది.
ALSO READ : రూ.15వేలలోపే 6000mah బ్యాటరీ మెుబైల్ కొనాలా? టాప్ 8 ఆఫ్షన్స్ ఇవే