BigTV English

Kothagudem Thermal Power Station: పాల్వంచ కేటీపీఎస్‌లో 8 కూలింగ్‌ టవర్ల కూల్చివేత

Kothagudem Thermal Power Station: పాల్వంచ కేటీపీఎస్‌లో 8 కూలింగ్‌ టవర్ల కూల్చివేత

Kothagudem Thermal Power Station: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వచ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఆపరేషన్ అండ్ మొయింటెనెన్స్ కర్మాగారం కూలింగ్ టవర్లను అధికారులు కూల్చివేయించారు. మొత్తం 8 కూలింగ్ టవర్లను అధికారులు కూల్చివేశారు. వీటిని రెండు దశలుగా కూల్చివేశారు. తొలుత నాలుగు కూలింగ్ టవర్లను కూల్చివేయగా.. తర్వాత మరో నాలుగు కూలింగ్ టవర్లను కూల్చివేశారు.


విద్యుత్ యూనిట్ మూతపడి ఏళ్లు గడుస్తున్నా కూలింగ్ టవర్లు అలాగే ఉండడంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే ఈ కూలింగ్ టవర్లను కూల్చివేసి ఆ ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేందుకు యాజమాన్యం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ కూలింగ్ టవర్లను కూల్చి వేసేందుకు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నకు చెందిన ఎగ్జిక్యూటివ్ ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. ఇందులో భాగంగా ఆ కంపెనీ ప్రతినిధులు టవర్ల పేల్చివేత ప్రక్రియను నిర్వహించింది. ఈ క్రమంలోనే పాత కర్మాగారానికి సంబంధించిన ఎనిమిది కూలింగ్ టవర్లను అధికారులు తొలగించారు.


Also Read: ఈ కండెక్టర్ మామూలోడు కాదు..మగవారికీ జీరో టిక్కెట్లు కొడుతున్నాడు

పాల్వంచలో ఈ కూలింగ్ టవర్లను 1996లో జపాన్ టెక్నాలజీతో నిర్మించారు. తొలు ఏ స్టేషన్‌లో 60 మెగావాట్లు సామర్థం కలిగిన నాలుగు యూనిట్స్‌ను నిర్మించగా..1977లో బీ, సీ స్టేషన్‌లో 120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లను నిర్మించారు. ప్రస్తుతం ఓ అండ్ఎంలో 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో కొనసాగుతోంది. 2022లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశానుసారం ఈ స్టేషన్లను మూసివేశారు.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×