E-Paper
Advertisement

KTR : మరోసారి పెద్దమనసు చాటుకున్న మంత్రి కేటీఆర్..

KTR : మరోసారి పెద్దమనసు చాటుకున్న మంత్రి కేటీఆర్..
Advertisement

KTR : మంత్రి కేటీఆర్ పెద్దమనసు ఓ ఇంటికి కొండంత అండగా నిలిచింది. ముగ్గురు కూతుళ్లు అంగవైకల్యంతో బాధపడుతూ.. వారికి చికిత్స అందించలేక ఆర్థికంగా చితికిపోయిన ఆ కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడకు చెందిన వెంకటయ్య, శంకుతల దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వాళ్లు ముగ్గురూ అంగవైకల్యంతో బాధపడుతున్నారు.

వారికి చికిత్స చేయించి ఆర్థికంగా చితికిపోయింది ఆ కుటుంబం. ఐనా కూతుళ్లకు నయం కాలేదు. దీంతో తాము చనిపోవాలనుకుంటున్నామని.. తమను ఆదుకోవాలని ఆ ఆడ బిడ్డలు కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. మీరు ఎంతో మందికి సహాయం చేశారు.

Advertisement

వీళ్లకు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. సహాయం అందించాలని ప్రజాప్రతినిధులను కోరారు. దీంతో పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్.. బాధితుల ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయడంతో పాటు చికిత్సకు అవసరం అయిన సాయం చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తానికి మంత్రి కేటీఆర్ చొరవతో ఆ కుటుంబానికి కొండంత ధైర్యాన్ని నింపింది.

Tags

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×