E-Paper
Advertisement

ఆ తప్పు చేయొద్దు.. ‘సర్’ విషయంలో కేడర్‌ని అలర్ట్ చేసిన కేటీఆర్.. అర్జున్‌రెడ్డి హిట్-రేవంత్‌రెడ్డి ఫిల్మ్ ప్లాప్

ఆ తప్పు చేయొద్దు.. ‘సర్’ విషయంలో కేడర్‌ని అలర్ట్ చేసిన కేటీఆర్.. అర్జున్‌రెడ్డి హిట్-రేవంత్‌రెడ్డి ఫిల్మ్ ప్లాప్
Advertisement

Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల నేతలు రూటు మార్చారు. నేతలు, కార్యకర్తలు, బహిరంగ సభల్లో ఒకటే స్పీచ్ ఉండడంతో సినిమా తరహా డైలాగ్స్ చెప్పడం మొదలు పెట్టారు. ఈ ఒరవడికి ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టగా, ఆ జాబితాలోకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరిపోయారు.

అర్జున్‌రెడ్డి హిట్.. రేవంత్‌రెడ్డి ఫిల్మ్ ప్లాప్-కేటీఆర్

Advertisement

రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ ముఠాకు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. నిజాయితీగా పని చేసే అధికారులకు గౌరవం లేదన్నారు. కాంగ్రెస్ పోవాలో.. కేసీఆర్ రావాలని నినాదం పిలుపు ఇచ్చారు.

ఎమ్మెల్యే, నేతలు గోడ దూకినా రాజేంద్రనగర్ పార్టీ జెండా ఎగురుతుందని కేడర్‌ని ఉత్సాహం పరిచే ప్రయత్నం చేశారు. ఆదివారం రాజేంద్రనగర్ నియోజకవర్గం నేతలు, కార్యకర్తలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, అబద్దాలు చెప్పి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిందన్నారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటీ కూడా అమలు కాలేదన్నారు.

Advertisement

రాజేంద్రనగర్ నియోజకవర్గం నేతల భేటీలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

అప్పుడు వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ అని, ఇప్పుడు రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ప్లాప్ అని వ్యాఖ్యానించారు. కేలండర్‌లో తేదీ ఎప్పుడు మారుతుందాని చూడాలన్నారు. ఈ సినిమా అట్టర్ ప్లాప్.. డిజాస్టర్ అంటూ అన్నారు. ఫస్టాప్ కాగానే రేవంత్ సినిమా తేలిపోయిందన్నారు.  కేటీఆర్ వ్యాఖ్యలపై ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు ఒక్కటే చప్పట్లు.

కేలండర్‌లో తేదీ ఎప్పుడు మారుతుందని చూడాలన్నారు. అదే సమయంలో రేవంత్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో పారిశ్రామికవేత్తల తలకు తుపాకి పెట్టి బెదిరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అయ్యిందని, రాజేంద్రనగర్ నియోకవర్గంలో ఒక్క ఇల్లు కట్టారా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు లేవనెత్తారు.

ALSO READ: నా సీటు చోరీ జరిగింది.. ఎలాంటి లీగల్ కేసుల్లేవ్- మీనాక్షి నటరాజన్ 

ఉన్న సిటీ గురించి చూసుకోకుండా ఫ్యూచర్ సిటీ కడతారని అంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో అప్పులు చేసి గురుకులాలు ఏర్పాటు చేశారని, ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు మంచి చదువు చెప్పించారని  వివరించే ప్రయత్నం చేశారు.  అటు బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. మూసీ ప్రాజెక్టు విషయంలో గాంధీ విగ్రహం ఏర్పాటుకు రక్షణ శాఖకు చెందిన భూములు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.

SIR  సర్ గురించి నోరు విప్పారు కేటీఆర్. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్ ప్రక్రియ 13 సార్లు జరిగిందన్నారు. ఈసారి 14వ సారి జరుగుతుందన్నారు. 2002లో అప్పుడు జరిగిందని, మళ్లీ ఇప్పుడు జరుగుతుందన్నారు. కేడర్, కార్యకర్తలు ఈ విషయంలో అలర్ట్‌గా ఉండాలన్నారు. అందుకోసమే ఈ సమావేశం పెట్టాలమన్నారు.

Related News

వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఇద్దరి ప్రాణాలు గాల్లో

ప్రభుత్వ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. యూనిఫాంలో కొత్త మార్పులు!

కల్వకుంట్ల ఫ్యామిలీ భూములపై రచ్చ.. మధ్యలో రైతుల్ని ఎందుకు లాగుతున్నారు?..ఆది శ్రీనివాస్ ఫైర్

ఢిల్లీ కేంద్రంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

తెలంగాణ యువతకు డెల్ సంస్థ బిగ్ ఆఫర్.. అన్నీ ఉచితం!

మూడు రోజుల డెడ్‌లైన్.. జూరాల ప్రాజెక్టు నీటిపై ఎంపీ డీకే అరుణ అల్టిమేటం?

అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి!

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 45 రోజుల్లో ఆ దరఖాస్తులకు పరిష్కారం..?

Big Stories

Advertisement
×