IND VS SL : ట్రై సిరీస్ లో (Tri Nation A Series in Sri Lanka 2026 ) భాగంగా ఇవాళ టీమిండియా వర్సెస్ శ్రీలంక ఏ (Sri Lanka A vs India A, Final) జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దంబుల్లా వేదికగా జరుగుతున్న ఈ ఫైనల్స్ లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో భారీ స్కోర్ దిశగా దూసుకు వెళ్తోంది. ముఖ్యంగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi ).. శ్రీలంక ప్లేయర్లపై ప్రతి కారం తీర్చుకున్నాడు. 29 బంతుల్లో 94 పరుగులు సాధించాడు. ఎప్పటి లాగే సెంచరీ మిస్ చేసుకున్న వైభవ్, బౌన్సర్ ను సిక్సర్ మలిచే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. దీంతో వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ట్రై సిరీస్ లో (Tri Nation A Series in Sri Lanka 2026 ) భాగంగా ఫైనల్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ తుఫాను ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో టీమిండియా స్కోర్ బోర్డు వైరల్ గా మారింది. వైభవ్ బ్యాటింగ్ దెబ్బకు మొదటి నాలుగు ఓవర్ లోనే 100 దాటేసింది టీమిండియా లిస్టు ఏ జట్టు. ఈ క్రమంలో ప్రొజెక్టెడ్ స్కోర్ 910 ( Projected Score) చేరుకోవడం గ్యారెంటీ అంటూ స్కోర్ బోర్డు ప్రదర్శించారు నిర్వాహకులు. దీంతో ఆ ప్రొజెక్టెడ్ స్కోర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బకు… 910 కాదు.. 1000 పరుగులు సాధించిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అనవసరంగా ఆ రోజు గొడవ పెట్టుకుని, ఇప్పుడు లంక ప్లేయర్లు అనుభవిస్తున్నారని దారుణంగా ఆడుకుంటున్నారు. ఇకపై వైభవ్ సూర్యవంశీ పెట్టుకునే ముందు ప్రత్యర్థి జట్లు ఎవరైనా కాస్త ఆచితూచి అడుగులు వేయాలని కోరుతున్నారు.
ట్రై సిరీస్ ఫైనల్స్ నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీ మంచి ఆరంభం ఇచ్చాడు. అదే ఊపుతో చివరి వరకు టీమిండియా ఉంటే, ప్రొజెక్టెడ్ స్కోర్ 900 దాటేది. కానీ అంత ఫాస్ట్ గా ఆడే ఆటగాడు లిస్టు ఏ క్రికెట్ లో మరొకరు లేరు. కానీ రుతురాజ్ గైక్వాడ్ 40 పరుగులు, కెప్టెన్ తిలక్ వర్మ 67 పరుగులతో రాణించారు. మిగిలిన ఆటగాళ్లు పెద్దగా స్కోర్ చేయకపోవడంతో నిర్ణీత 50 ఓవర్లు ఆడిన టీమిండియా, 9 వికెట్లు నష్టపోయి 377 పరుగులు సాధించింది. ఇక ఈ టార్గెట్ ను చేదిస్తేనే శ్రీలంక లిస్ట్ A చాంపియన్ అవుతుంది. లేకపోతే మనోళ్లు విక్టరీ కొట్టడం గ్యారంటీ.