E-Paper
Advertisement

తుమ్మిడిహెట్టికి ‘ఎత్తు’ పెంచుతాం.. మహారాష్ట్రను ఒప్పించండి.. జల్‌శక్తి మంత్రికి సీఎం రేవంత్ రిక్వెస్ట్!

తుమ్మిడిహెట్టికి ‘ఎత్తు’ పెంచుతాం.. మహారాష్ట్రను ఒప్పించండి.. జల్‌శక్తి మంత్రికి సీఎం రేవంత్ రిక్వెస్ట్!
Advertisement

Thummidihatti Barrage: ప్రాణ‌హిత న‌దిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపున‌కు మ‌హారాష్ట్ర నుంచి అనుమ‌తులు ఇప్పించాల‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. బ్యారేజీ ఎత్తు పెంపుతో మ‌హారాష్ట్రలో ముంపు ప్ర‌భావం పెద్ద‌గా ఉండ‌ద‌ని వివ‌రించారు. దిల్లీ పర్యటనలో భాగంగా జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి భేటి అయ్యారు. ఈ సంద‌ర్భంగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్య‌త‌, ప్రాజెక్టుకు అనుమ‌తులు మంజూరు కోరుతూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి తాను రాసిన లేఖ‌, దానికి ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం స్పందించి జ‌ల్ శ‌క్తికి పంపిన లేఖ‌ విష‌యాన్ని ప్ర‌స్తావించారు.

తుమ్మిడిహెట్టి వ‌ద్ద 148 మీట‌ర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి గ‌తంలోనే రెండు రాష్ట్రాల మ‌ధ్య ఒప్పందం కుదిరిన విష‌యాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. తుమ్మిడిహెట్టి వ‌ద్ద 148 మీట‌ర్ల నుంచి 152 మీట‌ర్ల వ‌ర‌కు ఎత్తుతో బ్యారేజీ నిర్మించే అంశంపై పుణెలోని సెంట్ర‌ల్ వాట‌ర్ అండ్ ప‌వ‌ర్ రీసెర్చ్ సెంట‌ర్ అధ్య‌య‌నం నిర్వ‌హించింద‌ని కేంద్ర మంత్రికి వివ‌రించారు. సీడబ్ల్యూ పీ ఆర్ఎస్ అధ్య‌య‌నం ప్రకారం 148 మీట‌ర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించినా, 152 మీట‌ర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించినా ముంపులో పెద్ద‌గా తేడా లేద‌ని స్ప‌ష్ట‌మైంద‌న్నారు. కాబ‌ట్టి బ్యారేజీ నిర్మాణానికి మ‌హారాష్ట్రను ఒప్పించాల‌ని కేంద్ర మంత్రి పాటిల్‌ను సీఎం కోరారు.

Advertisement

Also Read: దేశంలో మరో ఉగ్ర కుట్ర భగ్నం.. 9 మంది అరెస్టు.. భారీగా ఆయుధాలు స్వాధీనం!

Advertisement

తుమ్మిడిహెట్టి వ‌ద్ద 150 నుంచి 152 మీట‌ర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం చేప‌డితే గ్రావిటీ ద్వారానే నీటి స‌ర‌ఫ‌రాకు అవ‌కాశం ఉంటుంద‌ని కేంద్ర మంత్రికి రేవంత్ తెలియ‌జేశారు. గ్రావిటీ ద్వారా నీటి స‌ర‌ఫ‌రాతో విద్యుత్ వినియోగం భారం ఉండ‌ద‌ని, ఈ నేప‌థ్యంలో బ్యారేజీ నిర్మాణానికి మ‌హారాష్ట్రను ఒప్పించాల‌ని కోరారు. ఈ అంశంపై సాధ్య‌మైనంత త్వ‌ర‌గా తెలంగాణ‌, మ‌హారాష్ట్రల మ‌ధ్య స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రిని కోరారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్త‌యితే పూర్తిగా వెనుక‌బ‌డిన ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాకు సాగు నీటి వ‌స‌తి ఏర్ప‌డుతుంద‌ని సీఎం వివ‌రించారు. మరోవైపు సీఎం రేవంత్ విజ్ఞప్తిపై జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ‌, మ‌హారాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రుల స‌మావేశం ఏర్పాటు చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

Also Read: అచ్చం ‘ఈగ’ మూవీ లాగే.. ఈగను చంపేందుకు ఇల్లు తగలెట్టేసిన వృద్ధుడు!

Tags

Related News

సీఎం రేవంత్‌రెడ్డి సూచన.. వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు కొత్త పేర్లు, కాకతీయులకు పేర్లపై అందరిచూపు

వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఇద్దరి ప్రాణాలు గాల్లో

ప్రభుత్వ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. యూనిఫాంలో కొత్త మార్పులు!

కల్వకుంట్ల ఫ్యామిలీ భూములపై రచ్చ.. మధ్యలో రైతుల్ని ఎందుకు లాగుతున్నారు?..ఆది శ్రీనివాస్ ఫైర్

ఢిల్లీ కేంద్రంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

తెలంగాణ యువతకు డెల్ సంస్థ బిగ్ ఆఫర్.. అన్నీ ఉచితం!

మూడు రోజుల డెడ్‌లైన్.. జూరాల ప్రాజెక్టు నీటిపై ఎంపీ డీకే అరుణ అల్టిమేటం?

అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి!

Big Stories

Advertisement
×