E-Paper
Advertisement

తెలంగాణ సీపీగెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ సీపీగెట్ ఫలితాలు విడుదల
Advertisement

TG CPGET 2026 Results: తెలంగాణలో పీజీ, పీజీ డిప్లొమా ,ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్! టీజీ సీపీగెట్ (TG CPGET) 2026 పరీక్షల ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TGCHE) ఉన్నతాధికారులు ఫలితాలను, ర్యాంక్ కార్డులను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ రిజల్ట్ చెక్ చేసుకోవడంతో పాటు ర్యాంక్ కార్డ్ పీడీఎఫ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ర్యాంక్ కార్డ్  డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

అభ్యర్థులు తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా  ర్యాంక్ కార్డును పొందవచ్చు.

Advertisement

స్టెప్ 1: ముందుగా తెలంగాణ సీపీగెట్ అధికారిక పోర్టల్ cpget.tgche.ac.in లోకి లాగిన్ అవ్వండి.

స్టెప్ 2: హోమ్‌పేజీలో కనిపించే.. ‘CPGET 2026 Rank Card’ లేదా ‘Download Rank Card’ లింక్‌పై క్లిక్ చేయండి.

Advertisement

స్టెప్ 3: ఇప్పుడు స్క్రీన్‌పై లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ సీపీగెట్ హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number), రిజిస్ట్రేషన్ నంబర్ (Registration Number), పుట్టిన తేదీ (Date of Birth) ఎంటర్ చేయండి.

స్టెప్ 4: వివరాలు సరిగ్గా సరిచూసుకున్న తర్వాత ‘View Rank Card’ బటన్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 5: మీ మార్కులు ,ర్యాంక్‌తో కూడిన ర్యాంక్ కార్డ్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.

స్టెప్ 6: చివరిగా ‘Download PDF’ ఆప్షన్ నొక్కి మీ ఫోన్ లేదా సిస్టమ్‌లో సేవ్ చేసుకోండి. ఫ్యూచర్ అవసరాల కోసం రెండు ప్రింటవుట్లు తీసి ఉంచుకోవడం మంచిది.

ర్యాంక్ కార్డులో చెక్ చేసుకోవాల్సిన ముఖ్య విషయాలు:

ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత అందులో మీ పేరు, హాల్ టికెట్ నంబర్, కేటగిరీ, సాధించిన మార్కులు, క్వాలిఫైయింగ్ స్టేటస్, ఓవరాల్/కేటగిరీ ర్యాంక్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే అధికారులను సంప్రదించాలి.

కౌన్సెలింగ్, వెబ్ ఆప్షన్లు:

ఫలితాల ప్రకటన పూర్తయింది కాబట్టి, సీపీగెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా త్వరలోనే విడుదల చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు ప్రక్రియ అంతా ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు తమ ఇన్కమ్, క్యాస్ట్, స్టడీ సర్టిఫికేట్లతో పాటు డిగ్రీ మెమోలను సిద్ధంగా ఉంచుకోవాలి.

తెలంగాణ పీజీ అడ్మిషన్ల కౌన్సెలింగ్ డెవలప్‌మెంట్స్, వెబ్ ఆప్షన్ల డేట్స్ గురించి అధికారిక వెబ్‌సైట్ cpget.tgche.ac.in ని క్రమం తప్పకుండా చెక్ చేయండి.

Related News

సీఎం రేవంత్‌రెడ్డి సూచన.. వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు కొత్త పేర్లు, కాకతీయులకు పేర్లపై అందరిచూపు

వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఇద్దరి ప్రాణాలు గాల్లో

ప్రభుత్వ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. యూనిఫాంలో కొత్త మార్పులు!

కల్వకుంట్ల ఫ్యామిలీ భూములపై రచ్చ.. మధ్యలో రైతుల్ని ఎందుకు లాగుతున్నారు?..ఆది శ్రీనివాస్ ఫైర్

ఢిల్లీ కేంద్రంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

తెలంగాణ యువతకు డెల్ సంస్థ బిగ్ ఆఫర్.. అన్నీ ఉచితం!

మూడు రోజుల డెడ్‌లైన్.. జూరాల ప్రాజెక్టు నీటిపై ఎంపీ డీకే అరుణ అల్టిమేటం?

అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి!

Big Stories

Advertisement
×