E-Paper
Advertisement

బీఆర్‌ఎస్ టు టీఆర్‌ఎస్.. కుటుంబ సభ్యులను ఏడిపించొద్దంటూ క‌విత‌పై కేటీర్ సంచ‌లన వ్యాఖ్య‌లు

బీఆర్‌ఎస్ టు టీఆర్‌ఎస్.. కుటుంబ సభ్యులను ఏడిపించొద్దంటూ క‌విత‌పై కేటీర్ సంచ‌లన వ్యాఖ్య‌లు
Advertisement

KTR: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పర్యటనలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ (TRS) పేరును బీఆర్‌ఎస్‌ (BRS)గా మార్చిన తర్వాత పార్టీ రాజకీయంగా నష్టపోయిందని ఆయన బాహాటంగానే అంగీకరించారు. మళ్లీ పార్టీని పాత పేరు టీఆర్‌ఎస్‌గానే కొనసాగించాలని భావిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

2022 దసరా పర్వదినం రోజున కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. అయితే, ఆ తర్వాత జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. తెలంగాణ అనే పదం పార్టీ పేరులో లేకపోవడం వల్ల ప్రజలతో ఉన్న భావోద్వేగ బంధం కొంత దెబ్బతిన్నదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మళ్లీ పార్టీని టీఆర్‌ఎస్‌గా మార్చాలనేది కేవలం తన ఒక్కడి ఆలోచనే కాదని, క్షేత్రస్థాయిలో వేలాది మంది కార్యకర్తల ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ప్రజా సమస్యలపై తాను రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు.

Advertisement

క‌విత వ్య‌వ‌హ‌రంపై స్పందిస్తూ.. కుటుంబ సభ్యులను ఏడిపించేలా కవిత వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నవారికి మేలు చేయకపోయినా ఫర్వాలేదు కానీ ఏడిపించవద్దని పేర్కొన్నారు. టీడీపిలో నాయకులు నేరుగా కార్యకర్తలతో మమేకమవుతారని, బీఆర్‌ఎస్‌లో అది లోపించడంతోనే ఓడిపోయామన్నారు. జైలుకు వెళ్తే సీఎం అవుతారనేది భ్రమ అని, తాము హత్యలు చేసి జైలుకు వెళ్లేంత దుర్మార్గులం కాదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలను విస్మరించిందని కేటీఆర్ విమర్శించారు. బాండ్ పేపర్లపై సంతకాలు చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో రైతులు, కార్మికులు సుభిక్షంగా ఉన్నారని, తాము అధికారంలో ఉంటే ఈ పాటికే పెన్షన్లు, రైతుబంధు పెంచేవాళ్లమని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇస్తున్నది ‘అభయ హస్తం’ కాదు, అది ప్రజల నెత్తిపై ‘భస్మాసుర హస్తం’ అని ఆయన ఎద్దేవా చేశారు.

Advertisement

సింగరేణి సంస్థ నిర్వహణలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల జోక్యం పెరిగిందని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం బావమరిది సృజన్ రెడ్డి కనుసన్నల్లోనే టెండర్లు సాగుతున్నాయని, దీనిపై ఏసీబీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘సైట్ విజిటేషన్ సర్టిఫికేట్’ పేరుతో కొత్త నిబంధనలు తెచ్చి కాంట్రాక్టర్లను భయపెడుతున్నారని విమర్శించారు. మెడికల్ బోర్డు, వారసత్వ ఉద్యోగాల విషయంలో కార్మికులకు అన్యాయం జరిగితే సహించేది లేదని, సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

క్యాతనపల్లి మున్సిపాలిటీలో అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా నిలబడిన కౌన్సిలర్లను కేటీఆర్ ఘనంగా సన్మానించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి పోలీసుల అండతో కౌన్సిలర్లను భయపెట్టారని ఆరోపించారు. 2028లో మళ్లీ మంచిర్యాల గడ్డపై గులాబీ జెండా ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ (TBGKS) ను గెలిపించి ప్రభుత్వం మెడలు వంచాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో మోదీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కలిసి ‘ఆర్ఆర్ టాక్స్’ (రాహుల్ రేవంత్ టాక్స్) పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆరోపిస్తూనే, తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×