E-Paper
Advertisement

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!
Advertisement

Telangana New Pensions: తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి కష్టాలు అన్నీ ఇన్నీకావు. సర్టిఫికెట్ల జాప్యంతో అర్హులైన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి గమనించిన ప్రభుత్వం, వారికి ఊరట ఇచ్చే శుభవార్త చెప్పింది. దరఖాస్తు సమయంలో సర్టిఫికెట్ లేకుండా అప్లై చేయవచ్చని తెలిపింది. ఇంతకీ సర్టిఫికెట్లు దేనికి అనుకుంటున్నారా?

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్

తెలంగాణలో కొత్త పింఛన్‌ కోసం ఎదురుచూస్తున్న అర్హులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. కొత్త ఫించన్ల కోసం దరఖాస్తు సమయంలో ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో లేకపోయినా ఎదురు చూడాల్సిన పని లేదని తేల్చి చెప్పింది. కొత్త పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ-SERP సెర్ప్‌ వెల్లడించింది. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త పింఛన్ల దరఖాస్తు సమయంలో ధ్రువీకరణ పత్రాలు సమర్పణ ఆలస్యం కావడంతో క్లారిటీ ఇచ్చింది.

సర్టిఫికెట్లు లేకుండా అప్లై చేయవచ్చు

Advertisement

సర్టిఫికెట్ల కోసం ఆగకుండా మీ సేవా కేంద్రాల ద్వారా కొత్త పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేసింది. సర్టిఫికెట్లు రాలేదని దరఖాస్తు గడువు మిస్‌ అవుతుందేమోనని ఆందోళన చెందుతున్నవారికి ఉపశమనం. అధికారులు దరఖాస్తును పరిశీలించే సమయంలో సర్టిఫికెట్లను తప్పనిసరిగా సమర్పించాలని పేర్కొంది. అందువల్ల దరఖాస్తుదారులు తర్వాత అవసరమైన ధ్రువీకరణ పత్రాలను రెడీ చేసుకోవాలని సూచించారు అధికారులు.

ALSO READ: కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

Advertisement

కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్‌ 15 చివరి తేదీ. అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయకపోతే ఆలస్యం చేయకుండా గడువులోపు అప్లై చేసుకోవాలన్నారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదన్నారు. అర్హులైన పేదలు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Related News

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

Big Stories

Advertisement
×