E-Paper
Advertisement

కేసీఆర్ భూములపై రచ్చ.. ఆనాడే భూస్వాములు, డీల్ చేయలేకపోతున్నారన్న కేటీఆర్

కేసీఆర్ భూములపై రచ్చ.. ఆనాడే భూస్వాములు, డీల్ చేయలేకపోతున్నారన్న కేటీఆర్
Advertisement

Hyderabad: భూముల విషయంలో తెలంగాణలో అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ యాక్టివ్ మూడ్‌లోకి వచ్చింది. దీనిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ ఫ్యామిలీ ఆనాడే భూస్వాముల కుటుంబమని తేల్చేశారు. కేసీఆర్‌ని డీల్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు.

కేసీఆర్ భూములపై కేటీఆర్ క్లారిటీ

బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ భూములపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై నోరు విప్పారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గురువారం మీడియా ముందుకొచ్చిన ఆయన, కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ భూస్వామ్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి అన్నారు. కేసీఆర్ పుట్టినప్పుడు ఇల్లు రెండు ఎకరాల్లో ఉండేదన్నారు. ఆయన చిన్న కుటుంబంలో పుట్టలేదన్నారు. ఆనాడు మా తాతకు వందల ఎకరాల భూమి ఉండేదన్నారు. దీనిపై ప్రభుత్వం రికార్డులు ఉన్నాయని తెప్పించుకుని చూడాలన్నారు.

కేసీఆర్ భూముల చిట్టా విప్పిన కేటీఆర్

Advertisement

మా నాయనమ్మ నుంచి వచ్చిన ఆస్తి.. వందల ఎకరాలు అప్పర్ మానేర్‌ ప్రాజెక్టులో మునిగిపోయిందన్నారు.  ఇది 1930-40 నాటి సమయంలోదని వివరించారు. మా నానమ్మకు వచ్చిన ఆస్తి పరిహారంతో చింతమడక దగ్గర కేసీఆర్ తండ్రి భూమి కొనుగోలు చేశారన్నారు. వందల ఎకరాల్లో పుట్టిన కేసీఆర్, ఇవాళ 67 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారని, ఆయన కొల్లగొట్టి సంపాదించినట్టా? ఆయన ఆస్తి తగ్గనట్టా అంటూ ప్రశ్నలు రైజ్ చేశారు.

ఆనాడే వందల ఎకరాలు ఉండేవి-కేటీఆర్

వ్యవసాయంపై ఉన్న మక్కువతో రైతు బిడ్డగా ఆయన ఆ వృత్తిని కంటిన్యూ చేస్తున్నారని అన్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ వ్యవసాయం చేశారని గుర్తు చేశారు. ఇక్కడ పండిన సమ్మర్ పంటలను కోల్‌కత్తాకు ఎగుమతి చేశారని వివరించారు. మా ఫ్యామిలీకి మొదటి నుంచి వందల ఎకరాల భూములు ఉన్నాయని తేల్చిచెప్పారు.

Advertisement

ALSO READ: అసలైన ప్రజా పాలన అంటే ఎంటో నిర్వచనం చెప్పిన సీఎం రేవంత్!

కేసీఆర్ కబ్జా చేశారని అంటున్నారని, దీనికి మించిన సెల్ఫ్ గోల్ మరొకటి ఉండదన్నారు. కేసీఆర్ చరిత్ర తెలియకుండా మాట్లాడడం సరికాదన్నారు. కేసీఆర్‌ని ఎలా డీల్ చేయ్యాలో వారికి అర్థం కాలేదన్నారు. ఒకవైపు దొర అంటారని, మరోవైపు దోచుకున్నారని అంటున్నారని చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో తొలుత అధికార పార్టీ నేతలు క్లారిటీకి రావాలన్నారు.

 

Related News

మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డికి బిగ్ షాక్.. ఫ్లెక్సీలు చింపి పారేసిన బీఆర్ఎస్ నాయకులు!

అసలైన ప్రజా పాలన అంటే ఎంటో నిర్వచనం చెప్పిన సీఎం రేవంత్!

తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు, బీజేపీకి సంకేతాలు!

కీసరలో అర్ధరాత్రి 5 లక్షల లంచం.. ఏసీబీకి రెడ్ హ్యండెడ్‌గా దొరికిన ఎస్ఐ!

పెద్ద బస్టాండ్లలో షాపులు, బిజినెస్ స్పేస్ కావాలా.. ఆర్టీసీ సంస్థ కీలక ప్రకటన!

హుజూరాబాద్‌లో షాకింగ్ ఘటన.. అర్ధరాత్రి ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో గురుకుల విద్యార్థులు కలకలం

మెడికల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డాక్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

Big Stories

Advertisement
×