E-Paper
Advertisement

మెడికల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డాక్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

మెడికల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డాక్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
Advertisement

TVVP Recruitment: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో 1,623 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరింది. ఇందులో 10 విభాగాల ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టుతో పాటు కటాఫ్ ర్యాంకులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) బుధవారం విడుదల చేసింది. గతంలో రెండు విడతల్లో ఏడు విభాగాల ఫలితాలను సేకరించిన బోర్డు, ఈ దఫా ఆప్తాల్మాలజీ, ఈఎన్‌టీ, పాథాలజీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, పల్మనరీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ విభాగాలకు సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసింది. అర్హత పరీక్ష మార్కులు, సర్వీస్ వెయిటేజీ ప్రాతిపదికన మొత్తం 292 మంది అభ్యర్థులను తాత్కాలికంగా ఎంపిక చేసింది.

విభాగాల వారీగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు

పాథాలజీ: 69
ఈఎన్‌టీ: 49
పల్మనరీ మెడిసిన్: 46
ఆప్తాల్మాలజీ: 36
సైకియాట్రీ: 34
డెర్మటాలజీ: 24
ఫోరెన్సిక్ మెడిసిన్: 15
బయోకెమిస్ట్రీ: 7
హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్: 7
మైక్రోబయాలజీ: 5

Advertisement

Also Read: అక్రమ భవనాలు కూలడానికి అసలు కారణం ఇదే.. హైడ్రా కమిషనర్ క్లారిటీ!

పోస్టులు క్యారీ ఫార్వర్డ్..

రిజర్వుడు కేటగిరీల్లో తగినంత మంది అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో 128 పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయాయని, వాటిని తదుపరి నోటిఫికేషన్‌కు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. ఖాళీగా మిగిలిన పోస్టుల్లో అత్యధికంగా ఫోరెన్సిక్ మెడిసిన్‌లో 47, పాథాలజీలో 25, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో 17, సైకియాట్రీలో 13, పల్మనరీ మెడిసిన్‌లో 12, డెర్మటాలజీలో 7, ఈఎన్‌టీలో 5, మైక్రోబయాలజీలో 3, ఆప్తాల్మాలజీలో 2, బయోకెమిస్ట్రీలో 1 పోస్టు ఉన్నాయి.

రోస్టర్ పాయింట్లు..

Advertisement

ఇక పలు విభాగాల్లో ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్ అభ్యర్థులు లభించకపోవడంతో ఆయా రోస్టర్ పాయింట్లను నియమావళి ప్రకారం ఓసీ కేటగిరీకి కన్వర్ట్ చేసి నింపారు. పెండింగ్‌లో ఉన్న కొంతమంది అభ్యర్థుల ఫలితాలను తాత్కాలికంగా అబేయన్స్‌లో ఉంచారు.మరో వైపు అభ్యర్థుల హెల్త్ కండిషన్, క్యారెక్టర్ వెరిఫికేషన్ సంతృప్తికరంగా పూర్తయిన తర్వాతే తుది నియామకాలు ఖరారవుతాయి.
ఇప్పటికే రెగ్యులర్ సర్వీస్‌లో ఉంటూ, అదే స్పెషాలిటీలో వెయిటేజీ పొంది ఎంపికైనట్లు తేలితే నియామకాన్ని రద్దు చేస్తారు. అయితే కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల తీర్పులకు లోబడే నియామకాల ప్రక్రియ కొనసాగుతుందనీ బోర్డ్ పేర్కొన్నది.

Also read: తెలంగాణ విలీనం ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు.. మహేష్ కుమార్ గౌడ్ ఫైర్!

Tags

Related News

పెద్ద బస్టాండ్లలో షాపులు, బిజినెస్ స్పేస్ కావాలా.. ఆర్టీసీ సంస్థ కీలక ప్రకటన!

హుజూరాబాద్‌లో షాకింగ్ ఘటన.. అర్ధరాత్రి ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో గురుకుల విద్యార్థులు కలకలం

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.46,250 సబ్సిడీ..!

తెలంగాణ విలీనం ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు.. మహేష్ కుమార్ గౌడ్ ఫైర్!

మీ ఫోన్ పోగొట్టుకున్నారా.. వెంటనే ఇలా చేయండి.. సీక్రెట్స్ చెప్పిన సైబరాబాద్ సీపీ?

సీఎం రేవంత్ వ్యాఖ్యల వెనుక ఉన్న మతలబిదే.. బండి సంజయ్ క్లారిటీ!

అక్రమ భవనాలు కూలడానికి అసలు కారణం ఇదే.. హైడ్రా కమిషనర్ క్లారిటీ!

Big Stories

Advertisement
×