Hyderabad: తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ కీలక నేతల భూముల వ్యవహారాన్ని అసెంబ్లీ సాక్షిగా గుట్టు విప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. జరుగుతున్న పరిణామాలను గమనించిన బీఆర్ఎస్.. తెర వెనుక పావులు జాగ్రత్తగా కదుపుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటో తెలుసా?
నియోజకవర్గాల పునర్విభజనకు తమ మద్దతు ఉంటుందని చెబుతూనే కండీషన్లు పెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కేసీఆర్ ఫ్యామిలీ భూ కబ్జాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి చిట్టా అంతా బయటపెట్టారు. ఈ సమయంలోనే కేటీఆర్ డీలిమిటేషన్‌పై వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది. ఎందుకంటే డీలిమిటేషన్ వ్యవహారంపై ఇప్పుడు మాట్లాడాల్సిన అంశం కాదని అంటున్నారు. తెలంగాణ రాజకీయాలను డైవర్ట్ చేసేందుకు ఇదొక ఎత్తుగడగా చెబుతున్నారు తెలంగాణ అధికార పార్టీ.
పొత్తులు, డీలిమిటేషన్‌పై తమ పార్టీ వైఖరి వెల్లడించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టంచేశారు. అదే సమయంలో డీలిమిటేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం ప్రాతినిధ్యం ఉందన్నారు. లోక్‌సభ స్థానాలను దామాషా ప్రకారం పెంచితే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడంలో ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చేశారు.
సింపుల్‌గా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని చెప్పకనే చెప్పారు. ఈ విషయాన్ని ఆయన హర్యానాలో మాట్లాడడంతో అక్కడి ఢిల్లీకి సంకేతాలు వెళ్లినట్టు ఆ పార్టీలో కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. బుధవారం హర్యానాలోని సోనిపట్‌లో జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ‘ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్-ది స్టోరీ ఆఫ్ ఏ స్టార్టప్ స్టేట్’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. ఈ సమయంలో విద్యార్థులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు.
ALSO READ: కీసరలో అర్ధరాత్రి 5 లక్షల లంచం.. ఏసీబీకి రెడ్ హ్యండెడ్‌గా దొరికిన ఎస్ఐ!
నియోజకవర్గాల పునర్విభజనకు తమ మద్దతు ఉంటుందని చెబుతూనే కండీషన్లు పెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కేసీఆర్ ఫ్యామిలీ చేసిన భూ కబ్జాల చిట్టా అంతా బయటపెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ సమయంలోనే కేటీఆర్ డీలిమిటేషన్‌పై వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. డీలిమిటేషన్ వ్యవహారంపై ఇప్పుడు మాట్లాడాల్సిన అంశం కాదని అంటున్నారు. తెలంగాణ రాజకీయాలను డైవర్ట్ చేసేందుకు ఇదొక ఎత్తుగడగా చెబుతున్నారు తెలంగాణ అధికార పార్టీ నేతలు. అందుకోసమే బీఆర్ఎస్‌పై బీజేపీ నేతలు నోరు ఎత్తలేదని అంటున్నారు.