E-Paper
Advertisement

పెద్ద బస్టాండ్లలో షాపులు, బిజినెస్ స్పేస్ కావాలా.. ఆర్టీసీ సంస్థ కీలక ప్రకటన!

పెద్ద బస్టాండ్లలో షాపులు, బిజినెస్ స్పేస్ కావాలా.. ఆర్టీసీ సంస్థ కీలక ప్రకటన!
Advertisement

Integrated Transit: స్వేచ్ఛ బ్యూరో: ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు, రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. కేవలం ప్రయాణం మాత్రమే కాకుండా, షాపింగ్ , వ్యాపార సముదాయాలకు కేంద్రాలుగా నిలిచేలా 13 హైటెక్ ‘ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్’ బస్ స్టేషన్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి.

ఎయిర్‌పోర్ట్ స్థాయి..

మారే కాలానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రూపురేఖలను సమూలంగా మార్చేస్తోంది. కేవలం ప్రయాణానికే పరిమితం కాకుండా.. వ్యాపారం, వినోదం, ఇతర రవాణా వ్యవస్థల కలయికగా ‘ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ సిస్టమ్’ విధానంలో హైటెక్ బస్ స్టేషన్ల నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది. ప్రయాణికులకు రైల్వేతో పాటు ఇతర రవాణా వ్యవస్థలతో అనుసంధానం కల్పిస్తూ, ఎయిర్‌పోర్ట్ స్థాయి సదుపాయాలతో వీటిని తీర్చిదిద్దబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో రూపొందించిన ఈ బృహత్తర ప్రాజెక్టుకు ప్రభుత్వం, రవాణా శాఖల నుంచి ఇప్పటికే అధికారిక అనుమతులు లభించాయి.

మల్టీప్లెక్స్ రేంజ్ హంగులు – ఒకే చోట అన్నీ..

Advertisement

ఈ బస్టాండ్లలో ప్రత్యేకంగా కమర్షియల్ స్పేస్‌లను కేటాయించి, షాపింగ్ మాల్స్, ఫుడ్ కోర్టులు, గేమింగ్ జోన్లను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల ఇవి షాపింగ్‌కు ప్రధాన కేంద్రాలుగా మారుతాయి. ప్రయాణికులు వేచి ఉండే సమయంలో ఆహ్లాదాన్ని పంచే గేమింగ్, ఫుడ్ కోర్టులు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే అన్ని డిజైన్లు, అధికారికంగా పరిపాలన అనుమతులు పూర్తయ్యాయి. ఇప్పటికే కొడంగల్, ములుగు, కొస్గి, మద్గురు, కేసముద్రం పనులు ప్రారంభం కాగా, త్వరలోనే మరికొన్ని జిల్లాల్లో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

Also read: తెలంగాణ విలీనం ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు.. మహేష్ కుమార్ గౌడ్ ఫైర్!

ఆ 13 ఇవే..

Advertisement

రాష్ట్రంలో హైటెక్ ‘ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్’ బస్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్న ప్రాంతాలను ఎంపిక చేశారు. వాటిలో నాగర్‌కర్నూల్, రేగొండ, హుజూర్ నగర్, కోదాడ, కొడంగల్, కోస్గి, మద్దూరు, కేసముద్రం, హుస్నాబాద్, ములుగు, మధిర, నల్గొండ, కొత్తగూడెం. ఈ 13 బస్టాండ్లలో 100కోట్లతో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దసరాకు కొడంగల్, ములుగు, కొస్గి, మద్గురు, కేసముద్రం బస్ స్టేషన్లు అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం.ఈ నూతన హైటెక్ బస్టాండ్లలో షాపులు, బిజినెస్ కాంప్లెక్స్‌ల కేటాయింపు కోసం ఆసక్తిగల వ్యాపారులు ఆర్టీసీ యాజమాన్యాన్ని సంప్రదించవచ్చని సంస్థ ప్రకటించింది. ఈ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ హబ్స్ ద్వారా ఆర్టీసీకి ప్రయాణీకుల సేవలతో పాటు, వాణిజ్యపరమైన ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

త్వరలో మోడల్ బస్ స్టేషన్లు..

ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులకు రవాణా మరింత సులభతరం కావడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణ ప్రాంగణాలు ఆధునిక హంగులతో కొత్త కళను సంతరించుకోనున్నాయి. త్వరలోనే ఈ మోడల్ బస్ స్టేషన్ల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.సరికొత్త వరవడితో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ప్రజాదరణ పొందేలా మారుస్తున్న ఆర్టీసీ, ఈ హైటెక్ బస్టాండ్లతో ప్రయాణికులకు మరింత చేరువ కాబోతోంది.

Also read: హుజూరాబాద్‌లో షాకింగ్ ఘటన.. అర్ధరాత్రి ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో గురుకుల విద్యార్థులు కలకలం

Tags

Related News

కీసరలో అర్ధరాత్రి 5 లక్షల లంచం.. ఏసీబీకి రెడ్ హ్యండెడ్‌గా దొరికిన ఎస్ఐ!

హుజూరాబాద్‌లో షాకింగ్ ఘటన.. అర్ధరాత్రి ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో గురుకుల విద్యార్థులు కలకలం

మెడికల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డాక్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.46,250 సబ్సిడీ..!

తెలంగాణ విలీనం ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు.. మహేష్ కుమార్ గౌడ్ ఫైర్!

మీ ఫోన్ పోగొట్టుకున్నారా.. వెంటనే ఇలా చేయండి.. సీక్రెట్స్ చెప్పిన సైబరాబాద్ సీపీ?

సీఎం రేవంత్ వ్యాఖ్యల వెనుక ఉన్న మతలబిదే.. బండి సంజయ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×