Friday Release Movies: ఇటీవల కాలంలో పెద్ద చిత్రాలతో పాటూ చిన్న చిత్రాలు కూడా విడుదలవుతూ మంచి కంటెంట్ తో పెద్ద చిత్రాలకు గట్టి పోటీ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రతి వారం బాక్సాఫీస్ వద్ద తెలుగు చిత్రాల సందడి పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కొన్ని తెలుగు చిత్రాలు సెప్టెంబర్ 18న శుక్రవారం థియేటర్లలో విడుదల కాబోతున్న నేపథ్యంలో.. సెన్సార్ పూర్తి చేసుకున్నాయి. దీంతో ఏ చిత్రానికి ఏ సర్టిఫికెట్ లభించింది? ఏ సినిమా రన్ టైం ఎంత? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్స్ లో ఒకటిగా రికార్డు సృష్టించిన ఈ సినిమాకి చంద్ర సిద్ధార్థ దర్శకత్వం వహించారు. జే రెక్స్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అమైరా గౌస్వామి, సుజనా రెడ్డి , రవివర్మ, ఇనయా సుల్తానా, రేఖా నిరోషా తదితరులు నటించా.రు సెప్టెంబర్ 18వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది. 1:55 గంటల రన్ టైం లాక్ చేశారు.
మహిష్ చంద్ర దర్శకత్వంలో డాక్టర్ రాజేంద్రప్రసాద్, కేదార్ శంకర్, అన్నపూర్ణమ్మ, విరాట్ వర్మ, పృధ్వీరాజ్, మణి చందన తదితరులు కీలకపాత్రలు పోసిస్తున్న ఈ సినిమాకి చిన్న కృష్ణ సంగీతం అందించారు. సెప్టెంబర్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సెన్సార్ పూర్తి చేసుకోగా.. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది. 1 గంట 59 నిమిషాల నిడివితో సినిమా రన్ టైం లాక్ చేశారు.
తెలుగు యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీగా రాబోతున్న సీక్రెట్ సోల్జర్ చిత్రానికి అక్కి విశ్వనాథరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నిహాల్ కోడటి, సూర్యా శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక తాజాగా సెన్సార్ పూర్తి చేసుకోగా ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది. 1 గంట 58 నిమిషాల నిడివితో ఈ సినిమా రన్ టైం లాక్ చేశారు.
నూతన దర్శకుడు అభిరామ్ నాయుడు దర్శకత్వంలో రాబోతున్న తెలుగు ఎమోషనల్ డ్రామా చిత్రం హ్యాపీ జర్నీ. బాలాజీ గుప్తా, కౌశిక్ రెడ్డి నిర్మాణంలో శేఖర్ చంద్ర సంగీతం అందిస్తూ సెప్టెంబర్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, జినీషా అలిశెట్టి , రూప శ్రీనివాస్, సునైనా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకోగా.. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది. 2:00 గంటల నిడివితో ఈ సినిమా రన్ టైం లాక్ చేశారు.
ALSO READ:బీచ్ లో డాన్స్ చేస్తూ..కిక్కెక్కిస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్ .. వీడియో వైరల్!
ఎంజీఆర్ తుకారం దర్శకత్వంలో తెలుగు గ్రామీణ ప్రేమ కథ చిత్రంగా రాబోతున్న చిత్రం కాగితం పడవలు. సెప్టెంబర్ 18న చాలా గ్రాండ్గా థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రంలో వర్ధన్ గుర్రాల, కృష్ణప్రియ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకోగా U/A సర్టిఫికెట్ లభించింది. ఈ చిత్రానికి 2గంటల 19 నిమిషాల రన్ టైం తో లాక్ చేశారు.
వాచస్పతి దర్శకత్వంలో రాబోతున్న తెలుగు క్రైమ్ మిస్టరీ ఎమోషనల్ మిస్సింగ్ మేఘన సెప్టెంబర్ 18 థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికెట్ లభించింది. ఈ చిత్రానికి 1గంట 57 నిమిషాల రన్ టైం తో లాక్ చేశారు.
చెంచయ్య నూతలపాటి దర్శకత్వంలో శివా చౌదరి, జాస్విక జంటగా రాబోతున్న చిత్రం ఒక్క చూపుతో (మొదలైన) . సెప్టెంబర్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ తెలుగు డ్రామా, ఫ్యామిలీ , రొమాంటిక్ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది. ఈ చిత్రానికి 2గంటల 2 నిమిషాల రన్ టైం తో లాక్ చేశారు.