E-Paper
Advertisement

కేసీఆర్‌కు వారం ఇస్తే రాష్ట్రమంతా నీరే.. కేటీఆర్ సంచలనం!

కేసీఆర్‌కు వారం ఇస్తే రాష్ట్రమంతా నీరే.. కేటీఆర్ సంచలనం!
Advertisement

KTR: స్వేచ్ఛ బ్యూరో: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులుపై  కుంటి సాకులు చెడుతున్నారని, రైతులకు నీరివ్వాలనే స్పృహ లేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఉత్తంకు సిగ్గు ఉంటే వెంటనే పంపులు ప్రారంభించి నీటిని ఎత్తిపోసి జలాశయాలు నింపాలని డిమాండ్ చేశారు. లక్షల క్యూసెక్కుల నీటిని వృధాగా కిందికి పారదోలుతున్న అంశం లో అధికారులను నిలదీయాలని, కాంగ్రెస్ నాయకులను గల్లా పట్టి అడగండి అని ప్రజలకు పిలుపు నిచ్చారు. కన్నెపల్లి పంప్ హౌస్ ను ఆదివారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు. నీటిని పరిశీలించారు.

కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..

Advertisement

అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం పంప్‌హౌస్‌ల నుంచి వెంటనే నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ నీటిని ఎత్తిపోయకపోతే దాదాపు 50 వేల మంది రైతులతో కలిసి కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.ఒకవైపు రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు, మరోవైపు ఎల్‌నినో ప్రభావం రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.కరువు పరిస్థితుల్లో కూడా లక్షల క్యూసెక్కుల గోదావరి నీరు సముద్రంలో కలిసిపోతున్నా, రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

మేము వస్తే ప్రభుత్వానికి ఎందుకు అంత భయం..?

Advertisement

రైతుల కోసం ప్రధాన ప్రతిపక్షంగా కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వస్తుంటే తమను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారన్నారు. ప్రజా సమస్యల కోసం వస్తున్న తమపై ఇంతటి పోలీసు నిర్బంధం ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు. రైతుల కోసం మేము వస్తే ప్రభుత్వానికి ఎందుకు అంత భయం?” అని నిలదీశారు. రైతుకు మించిన ప్రయారిటీ రాష్ట్రాధినేతకు ఉండకూడదన్నారు. రైతుల కోసం అందరం సమిష్టి అండగా ఉందామని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరాన్ని జాతికి అంకితం చేసినా, ఆ ప్రాజెక్టు ప్రాముఖ్యతను గుర్తించే స్పృహప్రభుత్వానికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేకపోవడం బాధాకరమని మండిపడ్డారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా రాజకీయాలు పక్కనబెట్టి వెంటనే కాళేశ్వరం పంప్‌హౌస్‌లను ప్రారంభించి సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: హామీలు ఏమాయె? రేవంత్ రెడ్డిపై తలసాని ఘాటు విమర్శలు!

నీటి కోసం దశాబ్దాల పోరాటం

నేను ఒకరిని విమర్శించడానికో, నిందించడానికో కన్నెపల్లి పంపు హౌజ్ వద్దకు రాలేదన్నారు. నీటి కోసం దశాబ్దాలుగా పోరాటం కొనసాగుతుందన్నారు. బాసార్‌లో ప్రవహించిన గోదావరి భద్రాచలం వరకు వందల కిలోమీటర్లు ప్రయాణించి ఎన్నో శతాబ్దాలుగా, దశాబ్దాలుగా తెలంగాణ మాత్రం ఎడారిగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి ఒకవైపు తరలిపోతూనే ఉంది, వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయన్నారు. అందుకనే కేసీఆర్ గులాబీ జెండా ఎగరవేసి సొంత రాష్ట్రాన్ని సాధించారన్నారు. అందుకే నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశం మీద పోరాటం జరిగి మనం తెలంగాణను తెచ్చుకోవడం జరిగిందన్నారు. ఒకవైపు గోదావరి, మరోవైపు కృష్ణా ప్రవహించినప్పటికీ గత ప్రభుత్వ పాలకులు తెలంగాణకు నీళ్లు లేకుండా చేశారన్నారు. ఒక రైతు ముఖ్యమంత్రి అయితే ఎలా అభివృద్ధి జరుగుతుందో కేసీఆర్ సీఎం అయి ప్రతి ఒక్కరికి చూపించారన్నారు.

నాలుగేళ్లలోనే కాళేశ్వరం పూర్తి..

ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, అంతేకాకుండా ఢిల్లీలో అంతేకాకుండా మహారాష్ట్రలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండేదని, అయినప్పటికీ తుమ్మిడిహట్టికి ఏనాడు ప్రయత్నం చేయలేదని ఆరోపించారు.చివరికి అంతరాష్ట్ర ఒప్పందం చేయాల్సి ఉన్నప్పటికీ సైతం డ్యామ్ హైట్ విషయంలోనూ ప్రయత్నం చేయలేదన్నారు. కానీ తుమ్మిడిహట్టి కడతామని ఇక్కడ జనాలను మభ్యపెట్టారన్నారు. కానీ కేసీఆర్ పరిశోధన చేసి ఎంత కరువులోనైనా కాళేశ్వరం దగ్గర నీళ్లు ఉంటాయని తేలడంతో ఇంజనీర్ల ,జియాలజిస్ట్ల సూచనతో ముందడుగు వేశారని, సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనతో కేసీఆర్ నాయకత్వంలో భూమి పూజ చేసుకున్నామన్నారు.

ఎన్నో అధ్భుతాల ప్రాజెక్టు

మేడిగడ్డ, కన్నెపల్లి పంప్ హౌస్, లక్ష్మి పంప్ హౌస్‌లను నిర్మించామన్నారు. మేడిగడ్డ దగ్గర మనం బ్యారేజ్ నిర్మించడం జరిగిందని తెలిపారు. కాళేశ్వరంను కేసీఆర్ నాలుగేళ్లలోనే పూర్తి చేశారన్నారు. కాళేశ్వరంలో 15 రిజర్వాయర్లు ఉన్నాయన్నారు. ఎన్నో అద్భుతాల సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. దాంట్లో  రెండు పిల్లర్ల దగ్గర కుంగుబాటు వచ్చిందన్నారు. తెలంగాణలోని పాత ఏడు జిల్లాలకు నీరిచ్చే ప్రాజెక్ట్ కాళేశ్వరం అని స్పష్టం చేశారు.

లక్ష కోట్ల అవినీతి

ప్రాజెక్ట్ నిర్మాణానికి 94 వేల కోట్లు అయితే, లక్ష  కోట్ల అవినీతి ఎలా జరుగుతుందంటూ సీఎం మామే అన్నారన్నారు. 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని, ఎందుకు రికార్డు స్థాయిలో పంటలు పండలేదని నిలదీశారు. కోదాడ నియోజకవర్గంలో కాకతీయ కెనాల్లో ఎప్పుడైనా నీళ్లు ఉన్నాయా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం… రైతు ఆత్మహత్యలను ఆపింది, భూముల విలువను పెంచిందన్నారు.తెలంగాణ రైతుకు విలువను పెంచిన ప్రాజెక్ట్ కాళేశ్వరం అని స్పష్టం చేసింది.

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి వల్ల ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలిపోయి 8 మంది కూలీలు సజీవ సమాధి అయ్యారని, ఇప్పటివరకు వారి శవాలను కూడా తీయలేని అసమర్ధ ప్రభుత్వం అని మండిపడ్డారు. కేసీఆర్ పై కోపంతో రైతులకు శిక్ష వేసే పని చేస్తుం కాంగ్రెస్ సర్కార్ అన్నారు. నీళ్లిస్తే యూరియా ఇవ్వాలన్న భయంతోనే ప్రభుత్వం ఇలా చేస్తుందని మండిపడ్డారు. అంతేకాకుండా నీళ్లిస్తే పంటలు పండుతాయి.ఆ పంట మళ్ళీ కొనాలి.. బోనస్ ఇవ్వాలి..ఇవన్నింటికీ భయపడే  కాళేశ్వరం నీళ్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంను బద్నాం చేయాలనే లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌కి వారం పాటు ఇస్తే నీరు వస్తుంది..

ఒక వారం పాటు కేసీఆర్‌కి కాళేశ్వరం ప్రాజెక్టు అప్పజెప్తే మొత్తం తెలంగాణ నిండా, మొత్తం నీటిని పారించే బాధ్యత మాదని స్పష్టం చేశారు. కన్నెపల్లిలో పంపులు ఆన్ చేస్తే 13న్నర కిలోమీటర్ లు  గ్రావిటీ ద్వారా అన్నారం చేరుతాయని, అక్కడి నుండి వెంటనే సింపుల్‌గా 93 మీటర్ల నుంచి ఇక్కడ లిఫ్టింగ్ చేయవచ్చు అన్నారు. 97 మీటర్ల మీద ఇక్కడ పారకం ఉన్నదన్నారు.ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు పడవంటూ అధికారులు చెప్తున్నారని, తెలంగాణ 33 జిల్లాల్లో దాదాపు 26 జిల్లాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయన్నారు. అయినప్పటికీ ప్రభుత్వానికి సోయి లేదన్నారు. ఇక్కడి నుండి దాదాపు రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోయవచ్చు అన్నారు.ట్యాంక్‌బండ్ కెపాసిటీ ఒక కెపాసిటీ, హుస్సేన్‌సాగర్ కెపాసిటీ ఒక కెపాసిటీ అన్నారు. రెండు హుస్సేన్‌సాగర్‌లను లిఫ్ట్ చేసే కెపాసిటీ ఇక్కడ కాళేశ్వరం ఉన్న మోటర్లకు ఉందని తెలిపారు. రైతులకు సాగునీరందించడమే బీఆర్ఎస్ లక్ష్యం అని వెల్లడించారు.

Also Read: రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.. కేక్ కట్ చేసిన మణుగూరు కాంగ్రెస్ శ్రేణులు

Related News

‘కూలేశ్వరం’పై కేటీఆర్ కొత్త కథలు.. అద్దంకి దయాకర్ షాకింగ్ కామెంట్స్!

Kishan Reddy: సర్కార్‌కు ఓవైసీ అంటే భయమా?.. హైడ్రాపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Zaheerabad: జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. డాక్టర్లు లేక నర్సుల డెలివరీకి పసికందు మృతి!

రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.. కేక్ కట్ చేసిన మణుగూరు కాంగ్రెస్ శ్రేణులు

Bandi Owaisi: మేం అధికారంలోకి వస్తే ఒవైసీ విద్యాసంస్థలు కూల్చేస్తాం: బండి సంజయ్!

హామీలు ఏమాయె? రేవంత్ రెడ్డిపై తలసాని ఘాటు విమర్శలు!

Fertilizer App: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. యూరియా బుకింగ్‌లో సంచలనం!

Big Stories

Advertisement
×