E-Paper
Advertisement

‘కూలేశ్వరం’పై కేటీఆర్ కొత్త కథలు.. అద్దంకి దయాకర్ షాకింగ్ కామెంట్స్!

‘కూలేశ్వరం’పై కేటీఆర్ కొత్త కథలు.. అద్దంకి దయాకర్ షాకింగ్ కామెంట్స్!
Advertisement

Addanki Dayakar: ​స్వేచ్ఛ బ్యూరో:  గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మించి,అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు (కూలేశ్వరం)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు కొత్త కథలు చెపుతున్నారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ప్రాజెక్టు కుప్పకూలినప్పుడు కనీసం బాధపడని కల్వకుంట్ల కుటుంబం, ఇప్పుడు రాజకీయ గేమ్ ప్లాన్‌లో భాగంగానే కాళేశ్వరం పర్యటనలు చేస్తూ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరైనా చూడొచ్చు

Advertisement

​బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వైపు వెళ్లాలని చూసిన ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులను అడుగడుగునా అరెస్టులు చేయించిన చరిత్ర కేటీఆర్‌ది అని  గుర్తుచేశారు. కానీ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో  కాళేశ్వరం ప్రాజెక్టును ఎవరైనా వెళ్లి చూడొచ్చనే పూర్తి స్వేచ్ఛను కల్పించామని ఆయన స్పష్టం చేశారు. కేటీఆర్ పర్యటనను ప్రభుత్వం ఎక్కడా ఆపలేదని, ఆపకపోతే ఆయన కన్నెపల్లి పంప్ హౌస్‌కు ఎలా వెళ్లగలిగారని ప్రశ్నించారు.

Also Read: రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.. కేక్ కట్ చేసిన మణుగూరు కాంగ్రెస్ శ్రేణులు

Advertisement

​‘బాహుబలి’ మోటార్ల పతనం.. కమిషన్ల స్కెచ్‌లు..

​లక్షల కోట్ల ఖర్చు పెట్టి కేవలం కమిషన్ల కోసమే ఎలాంటి స్కెచ్‌లు వేశారో తెలంగాణ సమాజానికి అంతా తెలుసని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలోనే కన్నెపల్లి పంప్ హౌస్ మొత్తం మునిగిపోయిందని, ఆనాడేబాహుబలి మోటార్లు మొత్తం కూలిపోయాయని గుర్తుచేశారు. ప్రాజెక్టు కూలిపోయిన రోజున స్పందించకుండా, కనీసం బాధపడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కల్వకుంట్ల కుటుంబం.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అక్కడకు వెళ్తుందని నిలదీశారు. అప్పట్లో ప్రాజెక్టు కూలిపోతే ఎవరో బాంబులు పెట్టి పేల్చారంటూ కథలు అల్లిన విచిత్ర చరిత్ర బీఆర్ఎస్‌ది అని ఎద్దేవా చేశారు.

Also Read: కేసీఆర్‌కు వారం ఇస్తే రాష్ట్రమంతా నీరే.. కేటీఆర్ సంచలనం!

Related News

హైదరాబాద్‌లో 70 ఏళ్ల పాలనా వ్యవస్థ రద్దు.. కొత్త చట్టం అమలు!

భాగ్యనగరం వాసులకు బిగ్ అలర్ట్.. 36 గంటలపాటు నీళ్లు బంద్, ఏయే ప్రాంతాల్లో అంటే..

ఘోర రోడ్డు ప్రమాదం.. అమెరికాలో తెలుగు మహిళ మృతి, సొంతూరు మహబూబాబాద్ జిల్లా

100 శాతం ఖైరతాబాద్ సీటు మాదే.. క్లారిటీగా చెప్పిన తెలంగాణ బీజేపీ చీఫ్, మాటల వెనుక లెక్కలివే

సీఎం ఆదేశాలతో పొన్నం సుడిగాలి పర్యటనలు.. ఆర్టీసీ, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి!

వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్ OYO రూమ్‌లలో వరుస హత్యలు.. 10 రోజుల్లో ముగ్గురు అమ్మాయిల బలి.. అసలు ఏం జరుగుతోంది?

భూపాలపల్లి ఆస్పత్రిలో తప్పిన పెను ప్రమాదం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత తీవ్ర ఆగ్రహం

Big Stories

Advertisement
×