E-Paper
Advertisement

Khan Academy: తెలంగాణ విద్యాశాఖ సరికొత్త నిర్ణయం.. డిజిటల్ స్క్రీన్లపై మ్యాథ్స్, సైన్స్ పాఠాలు!

Khan Academy: తెలంగాణ విద్యాశాఖ సరికొత్త నిర్ణయం.. డిజిటల్ స్క్రీన్లపై మ్యాథ్స్, సైన్స్ పాఠాలు!
Advertisement

Khan Academy: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో గణితం, సైన్స్ సబ్జెక్టులపై అవగాహనను పెంపొందించడానికి ఖాన్ అకాడమీ పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ విధానాన్ని 2026-27 విద్యా సంవత్సరంలో సమర్థవంతంగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు.

డిజిటల్ క్లాస్‌రూమ్‌లు..

6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ ఈ డిజిటల్ బోధన వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కింద అన్ని ప్రభుత్వ, జెడ్పీహెచ్ఎస్, మోడల్ స్కూల్స్, కేజీబీవీలలో డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేయనున్నారు. వారానికి ఒక గణితం, ఒక సైన్స్ పీరియడ్ చొప్పున ఐఎఫ్‌పీ స్క్రీన్లు లేదా ప్రాజెక్టర్ల ద్వారా ఖాన్ అకాడమీ రికార్డెడ్ పాఠాలను విద్యార్థులకు ప్రదర్శించాలని సూచించారు. పాఠశాల సమయం తర్వాత లేదా ఇంట్లో స్మార్ట్‌ఫోన్ల ద్వారా విద్యార్థులు ఆన్‌లైన్ ప్రాక్టీస్ పూర్తి చేసేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పర్యవేక్షించాల్సి ఉంటుందని స్పష్​టంచేశారు.

Advertisement

Also read: Bandi Owaisi: మేం అధికారంలోకి వస్తే ఒవైసీ విద్యాసంస్థలు కూల్చేస్తాం: బండి సంజయ్!

15 రోజులకు ఒకసారి..

ఉపాధ్యాయుల పాఠాల ప్రిపరేషన్, విద్యార్థుల ప్రగతిని ట్రాక్ చేయడానికి ఖాన్మిగో ఏఐ టూల్ ను అందుబాటులో ఉంటుందన్నారు. ఈ విద్యా విధానంపై హెడ్‌మాస్టర్లు వారానికోసారి, మండల విద్యాధికారులు 15 రోజులకు ఒకసారి, జిల్లా విద్యాధికారులు లేదా కలెక్టర్లు నెలవారీ సమీక్షలు నిర్వహించి నివేదికలను పరిశీలిస్తారని స్పష్టంచేశారు. రెండు వారాల కంటే ఎక్కువ కాలం ఇనాక్టివ్‌గా ఉన్న పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ వహించి తగిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది.

Advertisement

Also read: Kishan Reddy: సర్కార్‌కు ఓవైసీ అంటే భయమా?.. హైడ్రాపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Related News

ఫుడ్ డెలివరీ లేట్ చేసాడని డెలివరీ బాయ్‌ని కొట్టిన భర్త భార్య.. కేసు నమోదు!

హైదరాబాద్‌లో 70 ఏళ్ల పాలనా వ్యవస్థ రద్దు.. కొత్త చట్టం అమలు!

భాగ్యనగరం వాసులకు బిగ్ అలర్ట్.. 36 గంటలపాటు నీళ్లు బంద్, ఏయే ప్రాంతాల్లో అంటే..

ఘోర రోడ్డు ప్రమాదం.. అమెరికాలో తెలుగు మహిళ మృతి, సొంతూరు మహబూబాబాద్ జిల్లా

100 శాతం ఖైరతాబాద్ సీటు మాదే.. క్లారిటీగా చెప్పిన తెలంగాణ బీజేపీ చీఫ్, మాటల వెనుక లెక్కలివే

సీఎం ఆదేశాలతో పొన్నం సుడిగాలి పర్యటనలు.. ఆర్టీసీ, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి!

వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్ OYO రూమ్‌లలో వరుస హత్యలు.. 10 రోజుల్లో ముగ్గురు అమ్మాయిల బలి.. అసలు ఏం జరుగుతోంది?

Big Stories

Advertisement
×