BigTV English
Advertisement

KTR: ఉన్న సిటీకే దిక్కులేదు.. ఫోర్త్ సిటీనా? : కేటీఆర్

KTR: ఉన్న సిటీకే దిక్కులేదు.. ఫోర్త్ సిటీనా? : కేటీఆర్

– ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ ఎందుకు మార్చారు?
– మూసీ పేరుతో జరిగేది అభివృద్ధి కాదు.. దోపిడీ
– గబ్బు మాటలు మాట్లాడితే ఊరుకోవాలా?
– ఇప్పుడు మంత్రిపై దావా వేశా
– రేపోమాపో సీఎంపైనా పరువు నష్టం దావా వేస్తా
– మోదీకే భయపడలేదు.. రేవంత్ రెడ్డి ఎంత?
– కందుకూరు బీఆర్ఎస్ రైతు ధర్నాలో కేటీఆర్


హైదరాబాద్, స్వేచ్ఛ: బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతు ధర్నాలు కొనసాగుతున్నాయి. రుణమాఫీ, రైతు బంధుకు సంబంధించి గులాబీ నేతలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణాలు కూడా మాఫీ చేయాలని, వెంటనే రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే, ఆయన మాత్రం నోటికొచ్చింది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డిసెంబర్ 9 నాడు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి, 10 నెలలు అవుతున్నా ఇంతవరకు పూర్తి చేయలేదని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో దేవుళ్ళ మీద ఒట్లు వేసి రైతులను మోసం చేవారని అన్నారు.

Also Read: కేటీఆర్.. అతి తెలివిగా ప్రశ్నలు వేయకు: మహేష్ కుమార్ గౌడ్


‘‘సీఎం కూర్చీ కాపాడుకునేందుకే రేవంత్ రెడ్డి తహతహలాడుతున్నారు. ఇచ్చిన హామీలను అమలు చెయ్యకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు దేవుడెరుగు, ఉన్న ఇల్లులు కూలగొడుతున్నారు. ముఖ్యమంత్రి మూసీ సుందరీకరణపై లక్ష కోట్లు ఖర్చు చేస్తానని అంటున్నారు. ఇచ్చిన హామీలకు పైసలు లేవు గానీ, మూసీ సుందరికరుణకు లక్ష కోట్లు ఖర్చు చేస్తారా? లక్ష కోట్లలో 30 వేల కోట్ల కమీషన్లు దొబ్బాలని చూస్తున్నారు. ఆ డబ్బులను ఢిల్లీకి పంపించేందుకు ప్లాన్ చేస్తున్నారు’’ అంటూ ఆరోపించారు కేటీఆర్. ఫార్మా సిటీ రద్దు చేసి రైతులకు భూములను తిరిగి ఇస్తామని అన్నారని, పేరు మార్చి ఫోర్త్ సిటీ పెట్టారు, ఇది మోసం కాదా అని అడిగారు. ఉన్న సిటికే దిక్కు లేదు, భవిష్యత్ సిటీ అంటున్నారని ఎద్దేవ చేశారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చారని విమర్శించారు.

Also Read: దసరా పండుగ వేళ తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త… త్వరలోనే..

‘‘ముఖ్యమంత్రి, మంత్రులు గబ్బు మాటలు మాట్లాడుతున్నారు. ఒక మంత్రి పైన పరువు నష్టం దావా వేశా. రేపోమాపో ముఖ్యమంత్రి పైన కూడా వేస్తా. తప్పు చేయనప్పుడు మేము ఎందుకు భయపడుతాం. మోదీకే భయపడలేదు రేవంత్ రెడ్డి ఎంత. దసరా పండుగకు బతుకమ్మ చీరలు ఇవ్వలేదు. పేదోళ్ల ఇండ్లను కూల్చుతున్నారు. సీఎం అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు కూల్చడం లేదు. కేసీఆర్‌కు కందుకూరు పైన ప్రేమ ఎక్కువ. అందుకే ఫార్మాసిటీ వరకు మెట్రో రైలు తెస్తా అని ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి పేర్లు మార్చి ఫోర్త్ సిటీ అని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మనమందరం ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి పెంచాలి’’ అని పిలుపునిచ్చారు కేటీఆర్.

Related News

Jubilee Hills: మాగంటి డెత్ మిస్ట‌రీ.. జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ చీప్ పాలిటిక్స్.. మరీ ఇంత దిగజారాలా..?

Jubilee Hills bypoll: జూబీహిల్స్‌ బైపోల్‌లో సైలెంట్ వేవ్ రాబోతుంది.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

Cyber Crime Hyderabad: సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్.. ఒక్క నెలలో 55 మంది అరెస్ట్

Revanth Reddy Birthday: రేషన్ బియ్యంతో.. సీఎం రేవంత్‌కు స్పెషల్ బర్త్ డే గిఫ్ట్

Bandi Sanjay: కాంగ్రెస్ ప్లాన్ ఇదే.. జూబ్లీహిల్స్ ఈసీలో రైడ్స్ పై బండి సంజయ్ స్ట్రాంగ్ రియాక్షన్

Marri Janardhan Reddy: 2 డ్రాయర్లు, 2 బనియన్స్ నా ఇంట్లో దొరికినవి ఇవే.. మర్రి జనార్దన్ షాకింగ్ కామెంట్స్

BRS Leaders: ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం..

Ponnam Prabhakar: షాకింగ్ ఓట్ల గారడీ.. జూబ్లిహిల్స్ ఎన్నికల ఫలితాలపై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు

Big Stories

×