BigTV English

Black Magic: ఫొటోలకు చేతబడి చేయొచ్చా? వామ్మో.. జాగ్రత్త, బలైపోతారు!

Black Magic: ఫొటోలకు చేతబడి చేయొచ్చా? వామ్మో.. జాగ్రత్త, బలైపోతారు!

Sadguru on Black Magic: సోషల్ మీడియా పరిధి విస్తృతంగా పెరిగింది. టెక్నాలజీ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. అదే సమయంలో నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చి చేరింది. అరచేతిలో ప్రపంచాన్ని చూసేస్తున్నారు. ఫోన్ ద్వారా ఎంత మంచి జరుగుతుందో? అంతకంటే ఎక్కువ చెడు జరుగుతున్నది. ఫోన్ ఎన్నో నేరాలకు కారణం అవుతుంది.


ప్రతి ఒక్కరు చీటికి మాటికి సోషల్ మీడియాలో తమ ఫోటోలు షేర్ చేస్తుంటారు. కొంత మంది తమ రోజు వారీ జీవితానికి సంబంధించిన ఫోటోలను టపీ టపీమని తీసి సోషల్ మీడియాలో తోసేస్తుంటారు. అలా ఫోటోలు పెట్టడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ ఉంటుంది. మార్ఫింగ్ చేస్తూ కొందరు జీవితాలతో ఆడుకుంటుంటే.. మరికొందరు బ్లాక్ మ్యాజిక్‌లు నమ్ముకుంటున్నారు. ఫోటోల ద్వారా తమకు నచ్చని వారిపై చేతబడులు చేస్తున్నారనే ఎప్పటి నుంచో ఉన్నదే. ఇంతకీ ఫొటోలకు చేతబడి చేయొచ్చా? పెద్దలు ఏం చెప్తున్నారంటే?

ఫోటోలతో చేతబడుల గురించి సద్గురు కీలక వ్యాఖ్యలు


ఫోటోల ద్వారా చేతబడులు చేసే అవకాశం ఉందంటున్నారు సద్గురు జగ్గీ వాసుదేవ్. ఒక వ్యక్తి ఫోటోకు ఉన్న జామెట్రీని అర్థం చేసుకోగలిగితే తప్పకుండా చేతబడి చేసే అవకాశం ఉంటుందంటున్నారు. “చేతబడి చేసే వ్యక్తి దగ్గరికి వెళ్తే కేవలం ఓ ఫోటో మాత్రమే అడుగుతాడు. ఫోటోతోనే సదరు వ్యక్తి మీద ప్రతికూల శక్తిని పంపే అవకాశం ఉంటుంది. కొంత మంది ఆశీర్వాదం కోసం తమ పిల్లల ఫోటోలు పంపిస్తారు.

ఒక వ్యక్తి ఫోటోతో సానుకూల విషయాలు చేయగలిగితే, ప్రతికూల విషయాలు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఫోటోలోని ప్రతి వ్యక్తికి ఓ నిర్దిష్టమైన జామెట్రీ ఉంటుంది.  మీరు ఒక వ్యక్తి బొమ్మకున్న జామెట్రీని అర్థం చేసుకుంటే, అతడికి పిచ్చెక్కించే జామెట్రీని మీరు రూపొందించవచ్చు. అతడి బాగోగులకు ఉపయోగపడే జామెట్రీని తయారు చేయవచ్చు. అదే సమయంలో అతడిని ఏదో విధంగా సర్వనాశనం చేసే జామెట్రీని క్రియేట్ చేయవచ్చు’’ అంటున్నారు.

కొంత మంది ఫోటోలకు దూరంగా ఉంటారు

ఫోటో జామెట్రీ తెలిసిన చాలా మంది ఫోటోలు దిగడానికి ఇష్టపడరని జద్గురు వెల్లడించారు. ‘‘ఫోటోలకు సంబంధించి జామెట్రీ తెలిసిన చాలా మంది ఫోటోలు తీసుకునేందుకు ఇష్టపడరు. సాధువులు, సన్యాసులు కూడా ఫోటోలు తీసుకోనివ్వరు. కానీ, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఓ మంచి వ్యక్తి, మరో చెడ్డ వ్యక్తి ఫోటోలను తీసుకుని వాటి మీద రుద్రాక్ష మాలను పెట్టి చూడండి.

ఒక్కో ఫోటో మీద ఒక్కోలా ప్రవర్తిస్తుంది. అంటే పవిత్ర రుద్రాక్ష జామెట్రీని బట్టి ప్రవర్తిస్తుంది. ఒక ఫోటోకు ఉన్న జామెట్రీని అర్థం చేసుకోగలిగితే, ఒక వ్యక్తికి మంచి చేసే అవకాశం ఉంది. చెడు చేసే అవకాశం ఉంది. అందుకే, శత్రువులకు మన ఫోటోలు అందుబాటులో ఉంచకూడదు. వీలైనంత వరకు మీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేయకపోవడం మంచిది” అని సద్గురు అభిప్రాయపడ్డారు.

Read Also:‘ఇంత బతుకు బతికి చివరికి ఈ పని చేయాలా!’.. వైరల్ అవుతున్నరిటైర్డ్ అధికారి ఫన్నీ పోస్ట్

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×