Amazon Great Indian Festival 2026: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్ వచ్చేస్తోంది! సెప్టెంబర్ చివరి వారం నుంచి మంచి మంచి ఆఫర్లతో ఈ ఈ-కామర్స్ పండగ మొదలుకానుంది. ఈ సేల్ లో లేటెస్ట్ మొబైల్స్, ఐఫోన్లు, ట్రెండీ ఫ్యాషన్ వేర్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు ఉండటంతో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో ఆకర్షణీయమైన యాడ్స్ చూసి కొన్ని సింపుల్ మిస్టేక్స్ చేయడం వల్ల వేల రూపాయలు నష్టపోయే ఛాన్స్ ఉంది. మరి ఆ తప్పులేంటి? వాటికి దూరంగా ఉంటూ ఎలా పర్ఫెక్ట్‌గా షాపింగ్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం!
1. విష్‌లిస్ట్, బడ్జెట్ :
చాలా మంది సేల్ ప్రారంభమైన రోజే యాప్ ఓపెన్ చేసి నచ్చినవన్నీ కార్ట్‌లో వేస్తుంటారు. ఇలా ప్లానింగ్ లేకుండా షాపింగ్ చేయడం వల్ల.. అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి. మీకు ఏయే వస్తువులు కావాలో ముందే ఒక బడ్జెట్ వేసుకుని, వాటిని విష్‌లిస్ట్ లో యాడ్ చేసి ఉంచుకోవడం బెస్ట్.
కొన్ని సార్లు సేల్‌కు.. కొద్ది వారాల ముందే.. ధరలను కృత్రిమంగా పెంచి,సేల్ సమయంలో.. భారీ తగ్గింపు ఇస్తున్నట్లు చూపుతుంటారు. దీని వల్ల పెద్దగా ఆదా ఏమీ ఉండదు. కాబట్టి..ప్రైస్ హిస్టరీని చెక్ చేసి, అసలైన తగ్గింపు ఎంత ఉందో సరి చూసుకున్న తర్వాతే కొనాలి.
సేల్స్‌లో లభించే తగ్గింపు లేదా క్రెడిట్ కార్డ్ ఆఫర్లు.. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను చాలా మంది పట్టించుకోరు. అలాగే.. అమెజాన్ పే లేదా ఇతర వ్యాలెట్ల ద్వారా లభించే అదనపు క్యాష్ బ్యాక్ పొందే.. అవకాశాన్ని కోల్పోకూడదు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే.. చెక్ అవుట్ సమయంలో మీ కార్ట్ విలువ మరింత తగ్గుతుంది.
ఎలక్ట్రానిక్స్ లేదా వివిధ రకాల గార్జెట్స్ ఉన్నప్పుడు భారీ డిస్కౌంట్లు చూసి రిటర్న్ పాలసీ లేదా వారెంటీ వివరాలు.. చూడకుండా ఆర్డర్ చేస్తుంటారు. ఒక వేళ ఆ వస్తువు డ్యామేజ్ అయితే.. లేదా డిఫెక్ట్ వస్తే.. ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి రీప్లేస్‌మెంట్ విండోను ముందుగానే చెక్ చేయాలి.
“ఈ రోజు మాత్రమే ఆఫర్” లేదా “ఇంత తక్కువ ధరకే వస్తోంది” అనే ట్యాగ్‌లు చూసి, అసలు అవసరం లేని.. వస్తువులను కూడా కొనేస్తుంటారు. ఇది కేవలం డబ్బు వృథా చేయడమే అవుతుంది. అవసరమున్న వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వాలి.
అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు సేల్ ప్రారంభానికి.. ముందే ఎర్లీ యాక్సెస్ లభిస్తుంది. లిమిటెడ్ స్టాక్ ఉండే పాపులర్ స్మార్ట్ ఫోన్‌లు, బ్రాండెడ్ గాడ్జెట్ త్వరగా అమ్ముడుపోతాయి. ప్రైమ్ మెంబర్ షిప్ లేక పోతే మంచి డీల్స్ మిస్ అయ్యే ప్రమాదం ఉంది.
Also Read: చాటింగ్ సీక్రెట్స్..ఆన్‌లైన్‌లోకి రాకుండానే వాట్సాప్ మెసేజ్‌లు చదవడం ఎలా?
మీకు నచ్చిన ఐటమ్‌ను కార్ట్‌లో.. వేసి, పేమెంట్ చేసే సరికి స్టాక్ అయిపోవడం జరుగుతుంది. ఐఫోన్‌లు లేదా ట్రెండింగ్ ఎలక్ట్రానిక్స్ కొనేటప్పుడు.. క్షణాల్లో స్టాక్ ఖాళీ అవుతుంది. కాబట్టి డెలివరీ అడ్రస్, పేమెంట్ ఆప్షన్లను ముందుగానే సిద్ధంగా ఉంచుకుని..సేల్ ప్రారంభమైన వెంటనే ఆర్డర్ కన్ఫార్మ్ చేసుకోవాలి.
ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే.. ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో.. మీరు ఎలాంటి నష్టాలు లేకుండా బెస్ట్ డిస్కౌంట్‌లతో మీ షాపింగ్‌ను పూర్తి చేయవచ్చు!