E-Paper
Advertisement

బీచ్ లో డాన్స్ చేస్తూ..కిక్కెక్కిస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్ .. వీడియో వైరల్!

బీచ్ లో డాన్స్ చేస్తూ..కిక్కెక్కిస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్ .. వీడియో వైరల్!
Advertisement

Rakul And Pragya: చిత్ర సీమలో హీరోలే కాదు హీరోయిన్ల మధ్య కూడా మంచి స్నేహబంధం ఉంటుంది. ముఖ్యంగా హీరోలు ఎలా అయితే ప్రత్యేకంగా పార్టీలు నిర్వహించుకుంటూ ఎంజాయ్ చేస్తారో.. హీరోయిన్స్ కూడా తమకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళిపోయి, ఆ సందర్భాలను, సమయాలను ఆస్వాదిస్తూ తమ బెస్టీ లతో బెస్ట్ మూమెంట్స్ ను గడుపుతూ ఉంటారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అలా ఎంతోమంది సెలబ్రిటీల మధ్య స్నేహబంధం అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే అటు టాలీవుడ్ లో ఇటు బాలీవుడ్ లో పేరు మోసిన స్నేహితులలో ఒకరిగా పేరు దక్కించుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), ప్రగ్యా జైస్వాల్ (Pragya jaiswal)..

బీచ్ గర్ల్స్.. గ్లామర్ తో పిచ్చెక్కిస్తూ డాన్స్..

వీరిద్దరూ స్నేహితులు మాత్రమే కాదు బెస్ట్ బడ్డీస్ గా కూడా పేరు సొంతం చేసుకున్నారు. పైగా ముంబైలో పక్కపక్కనే వీరు ఇల్లు ఉండడంతో తరచూ కలుస్తూ ఉంటారు. ఇక సినిమాలు , జిమ్ తోపాటు బాలి, గోవా, లండన్ వంటి ప్రాంతాలకు కలిసి వెకేషన్ లకి కూడా వెళ్తూ ఉంటారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ వివాహ వేడుకల్లో అలాగే బ్యాచిలర్ పార్టీలలో ప్రగ్యా జైస్వాల్ ప్రత్యేకంగా పాల్గొని సందడి చేసిన విషయం తెలిసిందే. అలాంటి వీరిద్దరూ ఇప్పుడు మరొకసారి బీచ్ సైడ్ అందాలు ఆరబోస్తూ.. డాన్స్ చేస్తూ తమ గ్లామర్ తో కుర్రకారుకు కిక్కెక్కించారు.

Advertisement

ALSO READ:‘కాకా’ చిత్రంలో అలనాటి హీరోయిన్ స్నేహ.. నిజమెంత?

వైరల్ గా మారిన డాన్స్ వీడియో..

తాజాగా వీరిద్దరూ వెకేషన్ కి వెళ్ళగా అక్కడి నుండి కొన్ని ఫోటోలను, వీడియోలను పంచుకున్నారు. అందులో ప్రత్యేకంగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా చిట్టి పొట్టి బట్టలు ధరించి తమ డాన్స్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టేశారు. వెకేషన్ లో భాగంగా బీచ్ కి వెళ్ళిన వీరిద్దరూ అక్కడ ఫారినర్స్ తో డాన్స్ చేస్తూ సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ప్రగ్యా ఆరెంజ్ కలర్ బ్రాలెట్ టాప్ ధరించి, ఆరెంజ్ ఎల్లో మల్టీకలర్ తో డిజైన్ చేసిన బికినీ తలపించేలా డ్రెస్ ధరించి ఆకట్టుకోగా.. అటు మినీ మిడీ ధరించి గాగుల్స్ పెట్టుకొని గ్లామర్ తో ఆకట్టుకుంది రకుల్ ప్రీత్ సింగ్. మొత్తానికైతే బీచ్ సైడ్ వీరిద్దరూ డాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బీచ్ గర్ల్స్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

రకుల్ , ప్రగ్యా కలిసి నటించిన చిత్రం..

Advertisement

ఇకపోతే వీళ్లిద్దరూ స్నేహితులు మాత్రమే కాదు కలసి నటించారు కూడా.. అలా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2017లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన జయ జానకి నాయక చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ , ప్రగ్యా జైస్వాల్ కలిసి నటించారు. ఇక ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. ఇక ఆ బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ.. వెకేషన్ కి వెళ్తూ.. సినిమా పార్టీలలో కూడా కలిసి సందడి చేస్తున్నారు వీరిద్దరు.

Related News

‘కాకా’ చిత్రంలో అలనాటి హీరోయిన్ స్నేహ.. నిజమెంత?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ఇప్పటిల్లో లేనట్లే..?

పాయల్ రాజ్‌పుత్ గ్లామర్ డోస్.. ఒక్క ఫొటోతో సోషల్ మీడియా షేక్!

సంగీత సామ్రాజ్ఞి కథలో నేషనల్ క్రష్.. రష్మిక కొత్త అవతారం!

జాన్వీ, ఖుషీలకు నోటీసులు.. శ్రీదేవి ఆస్తి వివాదంలో సుప్రీం కీలక ఆదేశం

సెన్సార్ బోర్డు పునర్వ్యవస్థీకరణ.. CBFCలో చోటు దక్కించుకున్న సుప్రియ యార్లగడ్డ

‘కాంతారా’ బ్యూటీకి అవార్డు.. రుక్మిణీ వసంత్ స్పెషల్ పోస్ట్ వైరల్!

Big Stories

Advertisement
×