E-Paper
Advertisement

Malkajgiri: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. కల్తీ కుల్ఫీ, ఐస్‌ క్రీమ్‌ లు తయారీ..

Malkajgiri: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. కల్తీ కుల్ఫీ, ఐస్‌ క్రీమ్‌ లు తయారీ..
Advertisement

Malkajgiri : డబ్బు సంపాదనే లక్ష్యంగా కొందరు దుర్మార్గులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నాచారం పీఎస్ పరిధిలో కల్తీ కుల్ఫీ ఐస్‌ క్రీమ్‌ తయారు చేస్తున్న ముఠా గుట్టును మల్కాజ్‌గిరి ఎస్ఓటీ, నాచారం పోలీసులు రట్టు చేశారు.

ఎలాంటి అనుమతులు లేకుండా ఐస్‌ క్రీమ్‌ పరిశ్రమను నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడ కుల్ఫీ, ఫలుదా తయారీ విధానం చూసి విస్తుపోయారు. తయారీ కోసం వాడుతున్న ఎక్స్పైర్ అయిన రసాయనాలు, కుళ్లిపోయిన బాదం గింజలను వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

రాజస్థాన్ కు చెందిన రోషన్ లాల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో.. డ్రమ్ముల్లో పానకం నిల్వ ఉంచి ఆ పానకంతో కుల్ఫీలను తయారు చేస్తున్నారు. ఇలాంటి ఐస్ క్రీం లు తింటే పిల్లల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఎక్కడపడితే అక్కడ తక్కువకే ఐస్ క్రీమ్ లు, ఫలుదాలు వస్తున్నాయని తినరాదని హెచ్చరించారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×