BigTV English

Lady Aghori Case: లేడీ అఘోరీపై కేసు.. జోక్యం చేసుకున్న మాజీ కేంద్ర మంత్రి.. స్పీడ్ పెంచిన పోలీసులు

Lady Aghori Case: లేడీ అఘోరీపై కేసు.. జోక్యం చేసుకున్న మాజీ కేంద్ర మంత్రి.. స్పీడ్ పెంచిన పోలీసులు

Lady Aghori Case: ఇటీవల లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ పై కోడి బలిచ్చిన కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఎవరు జోక్యం చేసుకున్నారో తెలుసుకుంటే.. షాక్ కావాల్సిందే. ఫిర్యాదు చేసింది రోహన్ రెడ్డి అయినప్పటికీ.. జోక్యం చేసుకున్నది మాత్రం మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ. అసలు మేనకా గాంధీ ఏమిటి, ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ఏమిటని అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది నిజమే. అసలేం జరిగిందంటే..


లేడీ అఘోరీకి పెద్దగా పరిచయం కూడా అక్కర్లేదు. ఈవిడ మాటెత్తితే చాలు.. అమ్మో అంటూ భయాన్ని వ్యక్తం చేసే వారు కొందరు.. అంతా మోసమేనంటూ మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఏదిఏమైనా వివాదాల చుట్టూ ఈమె ఉంటుందో లేదో తెలియదు కానీ, ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో మాత్రం ఈమె ఉండడం విశేషం. ఏపీ పర్యటన సమయంలో నేరుగా ఓ పోలీస్ అధికారిపైనే దాడికి యత్నించగా, అక్కడ పోలీసులు తమదైన రీతిలో కౌన్సిలింగ్ ఇచ్చారన్న మాట కూడా మొన్నటి వరకు వినిపించింది.

ఏపీ పర్యటన అనంతరం తన స్వంత రాష్ట్రం తెలంగాణలోకి అడుగుపెట్టిన అఘోరీ తన మకాం వరంగల్ కు మార్చారు. వరంగల్ లోని బెస్త శ్మశానవాటికలో విచిత్ర పూజలు చేసి అక్కడి స్థానికులను భయకంపితులను చేసింది అఘోరీ. స్వయంగా స్థానికులే ఆమె కారుకు అడ్డుపడి, ప్రశ్నించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అక్కడ విచిత్ర పూజలు చేస్తూ.. ప్రాణంతో ఉన్న కోడిని బలిచ్చినట్లుగా ఓ వీడియో వైరల్ గా మారింది.


Also Read: Lizards in Vizag Airport: విమానంలో స్మగ్లింగ్.. పట్టుకున్న కస్టమ్స్ అధికారులు.. అన్నీ వింత జీవులే!

ఈ వీడియో ఆధారంగా కరీంనగర్ కు చెందిన రోహన్ రెడ్డి అనే విద్యార్థి, మామునూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అనంతరం అసలు విషయాన్ని తన స్నేహితుడి సహాయంతో, మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఇక అంతే మేనకా గాంధీ ఎంటర్ కావడంతో అఘోరీపై పోలీసులు కేసు నమోదు చేశారు. సాధారణంగా జంతుబలి అనేది నిషేధమని చట్టం చెబుతుందని, కానీ అఘోరీ శ్మశానంలో పూజలు నిర్వహించి బలి ఇవ్వడంపై స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేయడంతో ఫిర్యాదు చేసినట్లు బిగ్ టీవీతో రోహన్ రెడ్డి తెలిపారు.

ఈ విషయం ఇలా ఉంటే అఘోరీ మాత తన స్టైల్ మార్చారు. అది కూడా మీసాలు, గడ్డంతో ఇటీవల కనిపించారు. అంతేకాదు అఘోరీకి చెందిన ఓ పాత ఫోటో అంటే శ్రీనివాస్ గా ఉన్నప్పటి ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ఎన్నో వివాదాలు ఆమె చుట్టూ ఉండగా, తాజాగా కోడిని బలిచ్చిన కేసులో పోలీసులు స్పీడ్ పెంచినట్లు సమాచారం.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×