Lizards in Vizag Airport: ఎయిర్ పోర్ట్ లలో సాధారణంగా తనిఖీలు నిర్వహించడం ఆనవాయితీ. అదేరీతిలో ఆ ఎయిర్ పోర్ట్ అధికారులు కూడా విస్తృత తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఒక బ్యాగ్ తనిఖీ చేసేందుకు స్కాన్ చేశారు. అలా స్కాన్ చేసిన వారికి ఎక్కడో కొడుతుంది పుష్పా అంటూ సందేహం వచ్చింది. వెంటనే ఆ బ్యాగ్ అలా ఓపెన్ చేశారు. ఇక అంతే షాకుల మీద షాకులే. ఈ ఘటన జరిగింది విశాఖ ఎయిర్ పోర్టులో…
విశాఖ ఎయిర్ పోర్ట్ కు విమానం వచ్చింది. అందులో నుండి ప్రయాణికులు దిగారు. తమ లగేజీ సెక్యూరిటీ చెక్ కోసం వదిలేశారు. అంతలోనే కస్టమ్స్ అధికారులు బిజీబిజీ అయ్యారు. ఎక్కడైనా బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోతుంటారు కొందరు. మరికొందరు డ్రగ్స్ ఇలా సరఫరా చేస్తూ పట్టుబడతారు. కానీ ఇక్కడ దొరికింది మాత్రం వింత జీవులు.
సెక్యూరిటీ చెక్ కోసం వచ్చిన ఓ బ్యాగ్ ను స్కాన్ చేసిన అధికారులకు అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. బ్యాగ్ లో చెక్ చేస్తే ఏవో కదులుతున్నాయి. అనుమానంతో బ్యాగ్ ఓపెన్ చేస్తే, బల్లులు కనిపించాయి. అదేదో మన గృహాలలో తిరిగే బల్లులు అనుకుంటే పొరపాటే.. ఇవి విదేశీ బల్లులట. మూడు నీలిరంగు నాలుక బల్లులు కాగా, మరో మూడు విదేశీ బల్లులుగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. మొత్తం ఆరు బల్లులను స్వాధీనం చేసుకున్న అధికారులు ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. అంతేకాదు ఇవి చాలా ప్రమాదకరమైన బల్లులని, వీటిని థాయ్ లాండ్ నుండి అక్రమంగా తీసుకువచ్చినట్లు వారి విచారణలో వెల్లడైంది.
Also Read: AP Heavy Rains: ఏపీకి భారీ వర్షసూచన.. లేటెస్ట్ అప్ డేట్.. అంతా అలర్ట్
డీఆర్ఐ, అటవీ సర్వీస్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించగా ప్రమాదకరమైన బల్లులు పట్టుబడడంతో ఎయిర్ పోర్ట్ పోలీసులకు వాటిని డీఆర్ఐ అధికారులు అప్పగించారు. ఇంత ప్రమాదకరమైన బల్లులను అక్రమంగా భారత్ కు ఎలా తీసుకువచ్చారు? దీని వెనుక ఉన్న కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. కానీ ఈ బల్లులను చూసిన అధికారులు మొదట ఖంగుతిని, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా, అవి బల్లులుగా వారు గుర్తించారు. ఈ బల్లులను చూసిన ప్రయాణికులు, వీటిని ఎందుకు తెచ్చారో అంటూ అక్కడ చర్చించుకోవడం విశేషం.
విశాఖ ఎయిర్పోర్టులో ప్రమాదకర బల్లులు
మూడు నీలి రంగు నాలుక బల్లులు, మూడు విదేశీ బల్లులను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు
థాయ్లాండ్ నుంచి అక్రమంగా బల్లులను భారత్కు తరలిస్తున్నట్లు సమాచారం
డీఆర్ఐ, అటవీ సర్వీస్ అధికారుల సంయుక్త తనిఖీల్లో గుర్తింపు
ఎయిర్పోర్టు… pic.twitter.com/0l49xLwslG
— BIG TV Breaking News (@bigtvtelugu) November 27, 2024