BigTV English

Bigg Boss 8 Telugu Promo: కంటెస్టెంట్స్ మధ్య క్రికెట్ పోటీ.. టికెట్ టు ఫినాలేలో స్థానం సంపాదించుకునేది ఎవరు?

Bigg Boss 8 Telugu Promo: కంటెస్టెంట్స్ మధ్య క్రికెట్ పోటీ.. టికెట్ టు ఫినాలేలో స్థానం సంపాదించుకునేది ఎవరు?

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో ప్రస్తుతం హౌస్‌లో 9 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. అందుకే వారి మధ్య టికెట్ టు ఫినాలే కోసం పోటీ మొదలయ్యింది. ఇప్పటికే రోహిణి.. టికెట్ టు ఫినాలే రేసులో కంటెండర్‌గా ఎంపికయ్యింది. ఇప్పుడు ఇతర కంటెస్టెంట్స్ కూడా దానికోసం కంటెండర్లుగా గెలవడానికి పోటీపడుతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది. ఇక సీజన్ 8 కంటెస్టెంట్స్‌తో టికెట్ టు ఫినాలే గేమ్స్ ఆడించడం కోసం మాజీ కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెడుతున్నారు. నేడు ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో మానస్, ప్రియాంక హౌస్‌లోకి ఎంటర్ అయినట్టు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. టికెట్ టు ఫినాలే రేసులో నిలవడం కోసం కంటెస్టెంట్స్ క్రికెట్ ఆడారు.


నేర్పుగా సాగు

నబీల్, పృథ్వి, ప్రేరణ, అవినాష్‌తో టికెట్ టు ఫినాలే కంటెండర్‌షిప్ టాస్కులను ఆడించారు ప్రియాంక, మానస్. ఈ నలుగురి మధ్య జరిగిన మొదటి టాస్కులో టేస్టీ తేజ సాయం చేయడం వల్లే అవినాష్ గెలిచాడని నబీల్ అనుకున్నాడు. అందుకే తేజ హెల్ప్ చేశాడా అని సూటిగా అడిగేశాడు. అది రోహిణికి నచ్చలేదు. ఈ విషయంపై రోహిణి, అవినాష్ మధ్య డిస్కషన్ జరగడంతో ప్రోమో ప్రారంభమయ్యింది. ‘‘టికెట్ టు ఫినాలే రేసులో మీ స్కిల్‌ను టెస్ట్ చేయడానికి బిగ్ బాస్ ఇస్తున్న ఛాలెంజ్ నేర్పుగా సాగు స్కోర్‌ను పొందు’’ అంటూ తరువాతి టాస్క్ గురించి వివరించారు బిగ్ బాస్. ఈ టాస్కులో బాల్‌ను రాడ్‌పై బ్యాలెన్స్ చేస్తూ చివరిగా ఉన్న సిక్సర్ హోల్‌లో పడేయాలి కంటెస్టెంట్స్.


Also Read: టికెట్ టు ఫినాలే లో కొత్త టాస్క్.. హౌస్ లోకి మరో ఇద్దరు మాజీ కంటెస్టెంట్స్..!

ఎంటర్‌టైన్ చేయండి

నబీల్, పృథ్వి, ప్రేరణ, అవినాష్‌.. ‘నేర్పుగా సాగు స్కోర్‌ను పొందు’ ఆటను సీరియస్‌గా ఆడుతుంటే మిగతా కంటెస్టెంట్స్ అంతా వారిని మరింత సీరియస్‌గా గమనిస్తున్నారు. ఇక మాజీ కంటెస్టెంట్స్ అయిన మానస్, ప్రియాంక.. ఈ టాస్క్‌కు సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో కామెంటరీ ఇస్తూ అందరినీ ఎంటర్‌టైన్ చేయమని రోహిణిని ఆదేశించారు బిగ్ బాస్. వెంటనే రోహిణి కామెంటరీ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ‘‘ఆటగాడు బంతిని దాని మీద పెడుతున్నాడు. దేని మీద అది?’’ అంటూ మొదలుపెట్టడంతోనే అందరినీ నవ్వించింది. పృథ్వి సిక్సర్ కొట్టిన ప్రతీసారి విష్ణుప్రియా సంతోషానికి హద్దులు లేవు.

అందరూ సిక్సర్లే

అవినాష్ ఆడుతుండగా రోహిణితో పాటు గౌతమ్ కూడా కామెంటరీ మొదలుపెట్టాడు. ‘‘ఆ బంతిని ఆరు రన్నుల దిశగా ప్రయాణిస్తూ ఉంది. అలా దాదాపుగా రేసులో ఉన్న నలుగురు కంటెస్టెంట్స్ చాలాసార్లు సిక్సర్ కొట్టినట్టుగా ప్రోమోలో చూపించారు. మరి ఈ టాస్కులో గెలిచి టికెట్ టు ఫినాలే కంటెండర్ అయ్యింది ఎవరు, బ్లాక్ బ్యాడ్జ్‌ను దక్కించుకుంది ఎవరు తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సందే. ఇప్పటికే రోహిణి.. టికెట్ టు ఫినాలేలో కంటెండర్‌గా స్థానాన్ని సొంతం చేసుకోగా విష్ణుప్రియా టాస్కులో చురుగ్గా ఆడలేక వెనకబడింది. దీంతో ఇప్పటికే ప్రసారమయిన ఎపిసోడ్‌లో హారిక, అఖిల్ వచ్చి తనకు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి వెళ్లారు.

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×