BigTV English

Komati Reddy Venkat Reddy: హరీష్ రావు కి కోమటిరెడ్డి బిగ్ ఆఫర్.. ఏంటంటే..?

Komati Reddy Venkat Reddy: హరీష్ రావు కి కోమటిరెడ్డి బిగ్ ఆఫర్.. ఏంటంటే..?
Komati Reddy Venkat Reddy latest news

Komatireddy Venkat Reddy offer to Harish Rao(Telangana politics): తెలంగాణ రాజకీయాలు హోరా హోరీగా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. నల్గొండ సభ ద్వారా రేవంత్ ప్రభుత్వం పైన పోరాటానికి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దమయ్యారు. ఈ సమయం లోనే అసెంబ్లీ వేదికగా ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన హరీష్ రావు ఆసక్తికరంగా స్పందించారు. దీని పైన స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హరీష్ కు బంపరాఫర్ ఇచ్చారు.


హరీశ్ రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలు కావటం ఖాయమన్నారు. హరీష్ వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్ కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. హరీష్ ముఖ్యమంత్రి కావాలనే ప్రణాళికతో ఉన్నారన్నారు. కేసీఆర్‌ను కాదనుకొని వస్తే అందుకు సపోర్ట్ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కవిత, హరీశ్, కేటీఆర్‌ల పేర్ల మీద విడిపోతుందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌లో నాలుగు పార్టీలు అవుతాయని జోస్యం చెప్పారు. హరీశ్ రావు పార్టీలో ఎల్పీ లీడర్ కూడా కాలేదన్నారు. 20 మందితో ఆ పార్టీ లీడర్ కావాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ చేశారు.

Read More: ‘ఇది ప్రజాప్రభుత్వం.. ప్రజలకు సేవచేయడమే మా లక్ష్యం’


కట్టె పట్టుకొని తిరుగుతున్న కేసీఆర్ పులి ఎట్లా అవుతారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. 60 కిలోలు ఉన్న వ్యక్తి పులి అయితే.. 86 కిలోలు ఉన్న తానేం కావాలని కోమటిరెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారు. ఇంకో 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు.

తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లో నీటి నిల్వ గురించి నల్గొండ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పై సభలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నీటిని నింపటం సాధ్యమైతే హరీష్ కే బాధ్యతలు అప్పగిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే దీనికి సిద్దమంటూ హరీష్ ముందుకొచ్చారు. ఆ సమయంలో తనకు సీఎం పదవి ఇస్తే చేసి చూపిస్తానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు హరీష్ వ్యాఖ్యల పైన రాజకీయంగా చర్చ సాగుతోన్న వేళ..మంత్రి కోమటిరెడ్డి స్పందించి ఆసక్తి వ్యాఖ్యలు చేశారు.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×