BigTV English

Minister Komatireddy: రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసిన మరుక్షణమే బీఆర్ఎస్ ఆఫీసులు పునాదులతో సహా గాల్లో కలుస్తాయి: మంత్రి కోమటిరెడ్డి

Minister Komatireddy: రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసిన మరుక్షణమే బీఆర్ఎస్ ఆఫీసులు పునాదులతో సహా గాల్లో కలుస్తాయి: మంత్రి కోమటిరెడ్డి

Minister Komatireddy Comments on KTR Remarks Over Hydra: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైడ్రాపై కేటీఆర్ చాలెంజ్ లు అవసరంలేదన్నారు. రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదన్నారు. కేసీఆర్ మాదిరిగా తాము ఆసుపత్రిలో దీక్షలు చేయలేదంటూ మండిపడ్డారు.


Also Read: గ్రామ పంచాయతీ ఎన్నికల తాజా అప్డేట్.. షెడ్యూల్ విడుదల

‘సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్ లో ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఆరేడు వేల ఓట్లు మైనస్ అయ్యాయి. ఈ పరిస్థితిని బట్టి చెప్పొచ్చు రాష్ట్రం బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనేది. అయితే, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందంటూ కేటీఆర్ మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. కేటీఆర్ జన్వాడలో ఫామ్ హౌజ్ కట్టుకున్నారు. నేను కేటీఆర్ ఫామ్ హౌజ్ చూసి వచ్చా. అప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి డ్రోన్ ఎగిరిస్తే కేసు పెట్టారు. పొంగులేటి ఫామ్ హౌజ్ ఎప్టీఎల్ పరిధిలో ఉందనే విషయం నాకు తెలువదు. పొంగులేటి ఉండేది హైదరాబాద్ లో.. ఆయనకు సిటీలో ఇల్లు ఉంది. కేటీఆర్ ఫామ్ హౌజ్ కు వెళ్లినప్పుడు ఆయన భార్య అక్కడ పని చేయిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డికి అక్కడ ఫామ్ హౌజ్ లేదు. జన్వాడ ఫామ్ హౌజ్ కేటీఆర్ దే. మీడియా వస్తా అంటే నేనే తీసుకెళ్తాను.


హైడ్రాను ఓ మంచి ఆలోచన ఏర్పాటు చేసింది ప్రభుత్వం. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సినిమా వాళ్ల ఇండ్లు, రాజకీయ నాయకులు ఫామ్ హౌజ్ లు.. అంతేకాదు ఎవరెవరివీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయో వాటన్నిటినీ తొలగిస్తాం.

Also Read: జన్వాడ ఫామ్‌హౌజ్ కూల్చివేతపై హైకోర్టు తీర్పు ఇదే

తెలంగాణ ఉద్యమం కోసం నీకు మాట్లాడే అర్హత లేదు కేటీఆర్. తెలంగాణ కోసం ఒక్క దెబ్బతిన్నావా నువ్వు? మేం తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేశాం. ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కేసీఆర్ మాదిరిగా ఆసుపత్రిలో ఉద్యమం చేయలేదు. రోడ్లమీదకు వచ్చి ఉద్యమం చేశాం. కేటీఆర్ కుటుంబంలో ఎవరైనా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారా..? రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని ఎలా అంటారు..? రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసిన మరు క్షణమే బీఆర్ఎస్ ఆఫీసులు, ఫామ్ హౌజ్ లు పునాదులతో సహా గాల్లో కలుస్తాయి’ అంటూ మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×