BigTV English

Pawan: పవన్ మూర్ఖుడు!.. అనుకోకుండా అనేశారా? కావాలనే అన్నారా? జనసేనాని ఊరుకుంటారా?

Pawan: పవన్ మూర్ఖుడు!.. అనుకోకుండా అనేశారా? కావాలనే అన్నారా? జనసేనాని ఊరుకుంటారా?

Pawan: టీఆర్ఎస్ నేతలు ఫుల్ ఫామ్ లో ఉన్నట్టున్నారు. షర్మిల ఎపిసోడ్ లో వరుసబెట్టి విమర్శలు చేస్తున్నారు. గులాబీ దళమంతా వైఎస్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తుంటే.. మంత్రి నిరంజన్ రెడ్డి మాత్రం పవన్ కల్యాణ్ పై బాణాలు ఎక్కుపెట్టారు. జనసేనాని ఎప్పుడో చేసిన వ్యాఖ్యలను మళ్లీ కొత్తగా తెర మీదకు తీసుకొచ్చారు.


తెలంగాణకు వరిసాగు నేర్పింది ఎన్టీఆరే అని.. ఎవరో మూర్ఖుడు, ప్రముఖ సినీ నటుడు అనడం సిగ్గచేటన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. అంతటి మూర్ఖుడిని ఎక్కడ చూడలేదని.. చరిత్ర తెలియని మూర్ఖులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 1100 ఏళ్ల క్రితం నుంచే తెలంగాణలో వరి సాగు చేస్తున్నారని మంత్రి తెలిపారు.
మంత్రి నిరంజన్ రెడ్డి ఎక్కడా పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించకున్నా.. ప్రముఖ నటుడు అని మాత్రమే కోట్ చేశారు. అయితే, గతంలో పవన్ ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో.. మూర్ఖుడు అని పవన్నే అన్నారని అర్థమైపోతోంది. గతంలో జనసేనాని ఓ సమావేశంలో తెలంగాణ వాళ్లకి ఎన్టీఆర్ పాలనలోనే వరి అన్నం సాగు తెలిసిందని వ్యాఖ్యానించారు.

నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి.. వరి సాగుపై పవన్ వ్యాఖ్యలు గుర్తుకొచ్చి.. ఇలా విమర్శించారని అనుకోవచ్చా? జనసేనానిని మూర్ఖుడు అనేంత ఘటు కామెంట్ చేయాలా? అనుకోకుండా అనేశారా? లేదంటే, మిగతా మంత్రులు వ్యూహాత్మకంగా షర్మిల విషయంలో వైఎస్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సెంటిమెంట్ రాజేస్తున్నట్టుగానే.. మంత్రి నిరంజన్ రెడ్డి సైతం కావాలనే పవన్ కల్యాణ్ ను ముర్ఖుడని అన్నారా? అనే డౌటు.


అయితే, పవన్ కల్యాణ్ ఫుల్ ఫైర్ ఉన్న లీడర్. తనను ఎవరు ఏ మాట అన్నా.. బాగా గుర్తు పెట్టుకుంటారు. కచ్చితంగా వారి విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంటారు. మరి, తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి తనను మూర్ఖుడు అంటే ఊరుకుంటారా? చూడాలి ఏ రేంజ్ లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×