BigTV English

TRS: మళ్లీ జగన్, వైఎస్సార్ టార్గెట్!.. షర్మిల కేసులో సెంటిమెంట్ రాజేస్తున్నారా?

TRS: మళ్లీ జగన్, వైఎస్సార్ టార్గెట్!.. షర్మిల కేసులో సెంటిమెంట్ రాజేస్తున్నారా?

TRS: షర్మిల వర్సెస్ టీఆర్ఎస్. అగ్గి రాజుకుంది. ఫ్లెక్సీలకు నిప్పు అంటుకుంది. అరెస్టులతో కాక రేగింది. కట్ చేస్తే.. వరుసబెట్టి టీఆర్ఎస్ నేతలు షర్మిలపై మాటలతో విరుచుకుపడుతున్నారు. పనిలో పనిగా షర్మిలతో పాటు జగన్ పైనా ఘాటు విమర్శలు చేస్తున్నారు. వైఎస్సార్ ను కూడా ఇందులోకి లాగుతున్నారు. అదేంటి.. షర్మిల ఏదో అంటే, గులాబీ నేతలు కూడా తిరిగి ఏదో అనడం కామనే కానీ.. షర్మిలతో పాటు ఆమె తండ్రి వైఎస్సార్ ను, అన్న జగన్ నూ టీఆర్ఎస్ శ్రేణులు టార్గెట్ చేయడమేంటి? కావాలనే ఇలా చేస్తున్నారా? మళ్లీ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం జరుగుతోందా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది.


షర్మిల పాదయాత్రపై దాడి చేశారు. ఫ్లెక్సీలు తగలబెట్టారు. అనుచరులను కొట్టారు. పోలీస్ కేసులు పెట్టారు. అరెస్ట్ చేశారు. అంతా టీఆర్ఎస్ వాళ్లే చేస్తే.. తప్పు మాత్రం షర్మిలదే అన్నట్టు సీన్ క్రియేట్ చేస్తున్నారని అంటున్నారు. కేసీఆర్ కూతురు కవిత షర్మిలపై ట్వీట్లు సంధిస్తే.. ఎంపీలు సుమన్, కవిత, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్.. నేరుగా జగన్ ను టార్గెట్ చేశారు. గతంలో జగన్ ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ లో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకున్న ఫోటోలు, మానుకోటకు రాకుండా జగన్ ను అడ్డుకున్న ఘటనను.. అప్పట్లో వైఎస్సార్ తెలంగాణ గురించి మాట్లాడిన వీడియోలను చూపిస్తూ.. షర్మిల కుటుంబం అంతా తెలంగాణకు వ్యతిరేకమనేలా టీఆర్ఎస్ శ్రేణులంతా ముక్తకంఠంతో ఊదరగొడుతున్నారు.

ఎక్కడి జగన్.. ఎక్కడి పార్లమెంట్. తెలంగాణ రాష్ట్రం రాకముందు.. దాదాపు దశాబ్దం కిందటి విషయాన్ని మళ్లీ వ్యూహాత్మకంగా బయటకు తీసుకొస్తున్నారా? వైఎస్సార్ వ్యాఖ్యలనూ మళ్లీ గుర్తు చేయడం మానిన గాయాన్ని గెలకడమేనా? రాష్ట్రం విడిపోయింది.. జగన్ ఏపీకి వెళ్లిపోయారు.. ప్రస్తుతం అక్కడ సీఎంగా ఉన్నారు. ఇక్కడ షర్మిల ఏదో అందని.. పక్క రాష్ట్ర జగన్ గురించి బాల్క సుమన్ అన్నేసి సాక్షాలు వెలికితీయడం వెనుక ఏదో రాజకీయ ప్రయోజనం ఉండేఉంటుందని అనుమానిస్తున్నారు.


తెలంగాణ ప్రజలు ఉద్యమకాలం నాటి భావోద్వేగాలను ఎప్పుడో మర్చిపోయారు. అంతా ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్లు జగన్ అలా అన్నాడు.. వైఎస్సార్ ఇలా అన్నాడు.. షర్మిల ఆ ఫ్యామిలీనే అంటూ.. పాత చింతకాయ పచ్చడిని ఫ్రెష్ జాడీలో పెట్టి.. మరింత కారం దట్టిస్తుండటానికి కారణం ఏంటి?

జగన్ తో తెగదెంపులు చేసుకొని తెలంగాణలో రాజకీయం చేస్తున్న షర్మిలను.. అన్నను బూచీగా చూపిస్తూ విమర్శించడం ఏంటి? వరుసబెట్టి టీఆర్ఎస్ నేతలంతా పోలో మంటూ.. షర్మిలకు వైఎస్ ఫ్యామిలీ ట్యాగ్ తగిలించడం ఏంటి? అంతా ప్రగతిభవన్ డైరెక్షన్ లోనే జరుగుతోందా? సెంటిమెంటును మళ్లీ రాజేస్తున్నారా? ప్రజలపై మళ్లీ ప్రాంతీయవాదం రుద్దే ప్రయత్నం జరుగుతోందా? అనే అనుమానం.

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×